రిపోర్టర్ అభ్యంతరకర ప్రశ్న.. ఘాటుగా సమాధానం ఇచ్చిన 96 ఫేమ్ హీరోయిన్ గౌరీ కిషన్.. ఇది జర్నలిజం కాదంటూ!

96 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ గౌరీ కిషన్‌కు తాజాగా అభ్యంతరకర ప్రశ్న ఎదురైంది. ఈ హీరోయిన్ నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్ ప్రెస్ ఈవెంట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది గౌరీ కిషన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published on: Nov 8, 2025, 11:04:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

96, జాను సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరీ కిషన్. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు, హాట్‌స్పాట్ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, తాజాగా గౌరీ కిషన్‌కు ఓ రిపోర్టర్ నుంచి అభ్యంతరకర ప్రశ్న ఎదురైంది.

రిపోర్టర్ అభ్యంతరకర ప్రశ్న.. ఘాటుగా సమాధానం ఇచ్చిన 96 ఫేమ్ హీరోయిన్ గౌరీ కిషన్.. ఇది జర్నలిజం కాదంటూ!
రిపోర్టర్ అభ్యంతరకర ప్రశ్న.. ఘాటుగా సమాధానం ఇచ్చిన 96 ఫేమ్ హీరోయిన్ గౌరీ కిషన్.. ఇది జర్నలిజం కాదంటూ!

అదర్స్ ప్రమోషన్స్‌లో

గౌరీ కిషన్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమా అదర్స్. రీసెంట్‌గా చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో భాగగా అదర్స్ ప్రెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చింది బ్యూటిఫుల్ గౌరీ కిషన్.

అయితే, అదర్స్ సినిమాలోని ఓ పాటలో గౌరీ కిషన్‌ను హీరో ఆదిత్య మాధవన్ ఎత్తుకుని తిప్పుతాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదిత్య మాధవన్‌ను "హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పినప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా?" అని అడిగారు.

మరుసటి రోజు అదే ప్రశ్న

దానికి ఆదిత్య "నేను జిమ్ చేస్తాను కాబట్టి బరువుగా అనిపించలేదు" అని చెబుతాడు. ఈ సంఘటన తర్వాత మరుసటి రోజు జరిగిన మరో ప్రెస్ మీట్ ఈవెంట్‌లో అదే రిపోర్టర్ గౌరీ కిషన్ బరువు గురించి మళ్లీ అడిగాడు. దానికి తెగ కోపం తెచ్చుకున్న గౌరీ కిషన్ ఆ రిపోర్టర్‌పై విరుచుకుపడింది.

"నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావ్. ఇది బాడీ షేమింగ్. ఒక స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నావ్. నా రోల్ గురించి లేదా నటన గురించి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. అందరూ నా బరువే అడుగుతున్నారు. మగ నటులను ఇలా అడిగే ధైర్యం మీకుందా. ఇది జర్నలిజం కాదు. మీ వృత్తికే అవమానం" అంటూ ఇచ్చిపడేసింది గౌరీ కిషన్.

సాధారణంగా చూడకండి

అయితే, ఆ సమయంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నను మిగతా వారు సరదాగా అడిగినట్లు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కానీ, గౌరీ కిషన్ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. "నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ షేమింగ్‌ను నార్మలైజ్ చేసి చూడడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించి కాబట్టి నా అభిప్రాయాన్నిచెప్పే హక్కు నాకు ఉంది" అని గట్టిగానే బదులిచ్చింది గౌరీ కిషన్.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ హీరోయిన్ గౌరీ కిషన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రిపోర్టర్లకు ఎప్పుడు ఏది అడగాలో తెలియకుండా పోతుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిన్మయి సపోర్ట్

ఇకపోతే ఈ వీడియోపై ది గర్ల్‌ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య, సింగర్ చిన్నయి శ్రీపాద ట్వీట్ చేసింది. "బాడీ షేమింగ్ కామెంట్స్‌పై గౌరీ అద్భుతంగా బదులిచ్చింది. అవమానకరమైన, అనవసరమైన ప్రశ్నను ఖండించినప్పుడు అరుపులు, ఎదురుదెబ్బలు తప్పవు" అని రాసుకొచ్చింది చిన్మయి శ్రీపాద.

చిన్మయి ఇంకా కొనసాగిస్తూ.. "ఇంత చిన్న వయసులో కూడా ఆమె ధైర్యంగా నిలబడటం గర్వకారణం. ఏ పురుష నటుడుని కూడా అతని బరువు గురించి అడగరు" అని పేర్కొంది. కాగా, తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న గౌరీ కిషన్‌కు 26 సంవత్సరాలు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More