రామా నాయుడు స్టూడియో నా ఇల్లుగా మారింది, రానా నటన సర్‌ప్రైజ్ చేస్తుంది.. తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కామెంట్స్
తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కాంత. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల కాంత ట్రైలర్ లాంచ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళంలో నీల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా కాంత. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నటుడు, డైరెక్టర్ సముద్రఖని, ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సేతోపాటు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇది.

కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్
నవంబర్ 14న తెలుగు, తమిళ, మలయాళ థియేటర్లలో కాంత విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా కాంత ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎంతో ప్రేమ దొరికింది
డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. గత ఏడాదిగా రామానాయుడు స్టూడియో నా హోమ్‌గా మారింది. సినిమా మొత్తం హైదరాబాద్‌లో షూట్ చేశాం. తెలుగు ప్రేక్షకుల నుంచి మాకు ఎంతో ప్రేమ దొరికింది. నవంబర్ 14న మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది" అని అన్నారు.
అందరిని సర్‌ప్రైజ్ చేస్తుంది
"ఇందులో మీరందరూ కూడా ప్రతి నటుడి గ్రేట్ పర్ఫామెన్స్ చూస్తారు. నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ గారి పర్ఫామెన్స్‌ని మీరందరూ చాలా ఇష్టపడతారు. రానా దగ్గుబాటి గారి నటన మీ అందరిని సర్‌ప్రైజ్ చేస్తుంది. భాగ్యశ్రీ గారు, సముద్ర ఖని గారు అందరు అద్భుతంగా నటించారు. నవంబర్ 14న థియేటర్స్‌లో కలుద్దాం" అని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెలిపారు.
కష్టపడి ప్రాణం పోశాం
ప్రొడ్యూసర్ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమాని కష్టపడి ప్రాణం పోసి నవంబర్ 14న మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాం. సినిమా ఫెంటాస్టిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుంది. ఇందులో ప్రతి యాక్టర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు" అని పేర్కొన్నారు.
సర్‌ప్రైజ్ ప్యాకేజ్
"సినిమాకి ట్రిబ్యూట్ లాగా ఈ కాంత మూవీ చేశాం. ప్రతి ఫ్రేమ్‌లో ఇంటెన్సిటీ పెర్ఫార్మన్స్, థ్రిల్స్, ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి. ఇందులో రానా గారు సర్‌ప్రైజ్ ప్యాకేజ్. సముద్రఖని గారు అద్భుతంగా నటించారు" అని నిర్మాత ప్రశాంత్ పొట్లూరి తెలిపారు.
నట చక్రవర్తి అని పిలుస్తారు
"ఇందులో దుల్కర్ సల్మాన్ గారి కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఆయన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. నవంబర్ 14న కాంత చూడండి. మీ అభిమానానికి థాంక్యూ" అని తన స్పీచ్ ముగించారు కాంత నిర్మాత ప్రశాంత్ పుట్లూరు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


