దర్శకుడు రాహుల్ సొంతింటి కల నేను నెరవేరుస్తా, అల్లు అరవింద్ దేవుడు, ఆయన ఫొటో పెట్టుకుంటాం: ది గర్ల్‌ఫ్రెండ్ నిర్మాత ధీరజ
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించారు. తాజాగా నవంబర్ 5న నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి చేశాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రచన, దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించిన ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న హైదరాబాద్‌లో నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్. ఆయన పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఘటనలు జరిగాయి. అయినా సినిమా వర్క్ మాత్రం ఏరోజు ఆపలేదు. మేము మంచి స్నేహితులం, శత్రువులం కూడా. ఆయన సొంతిల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు" అని అన్నారు.
రెండేళ్ల కిందట
"ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా రిలీజ్ తర్వాత రాహుల్ సొంతింటి కల నేను నెరవేరుస్తా. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. మేము కొన్ని కథలు అనుకుని హీరోలను అప్రోచ్ అయ్యాం. ఏ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత రెండేళ్ల కిందట రష్మిక గారిని ఈ సబ్జెక్ట్‌తో కలిస్తే ఆమె వెంటనే ఒప్పుకున్నారు" అని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
"ఆ తర్వాత దీక్షిత్ శెట్టి డేట్స్ తీసుకున్నాం. కానీ, ఆ డేట్స్‌కు సినిమా షూటింగ్ కాలేదు. దీక్షిత్ ఎన్నోసార్లు డేట్స్ అడ్జస్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అతనికి తెలుగులో బాగా ఆఫర్స్ వస్తాయి. ఆయన అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ను థియేటర్స్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారు" ధీరజ్ మొగిలినేని చెప్పారు.
ఎలాంటి ఇగోలు లేకుండా
"హేషమ్ గారిని తెలుగు నుంచి ఫస్ట్ అప్రోచ్ అయ్యింది మేమే. ఆ తర్వాత ఖుషి, హాయ్ నాన్న వంటి హిట్ మూవీస్ చేశారు. ఈ సినిమాకు హేషమ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రశాంత్ విహారితో కలిసి ఎక్కడా ఇగోలు లేకుండా మాకు టైమ్‌కు మూవీ కంప్లీట్ అయ్యేలా వర్క్ చేశారు" అని నిర్మాత ధీరజ్ పేర్కొన్నారు.
"విద్య అక్క లేకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. గీతా ఆర్ట్స్ వైజయంతీ మూవీస్ కలిసి సినిమాలు చేసినట్లు, విద్య అక్కతో కలిసి కనీసం మరో పది సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. విద్య అక్క ఎవరి షాడోలో లేరు. ప్రొడ్యూసర్‌గా పెద్ద సినిమాలు చేయబోతున్నారు.
అరవింద్ ఫొటోలు పెట్టుకుంటాం
"అరవింద్ గారి రూపంలో దేవుడు నా వెంట ఉన్నాడు అనుకుంటున్నా. నాకు ఏ కష్టం వచ్చినా అరవింద్ గారు ఉన్నారనే భరోసా ఉంది. ఆయన పర్మిషన్‌తో మా ఆఫీస్‌ల్లో అరవింద్ గారి ఫొటో పెట్టుకోవాలని అనుకుంటున్నాం" అని ది గర్ల్‌ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలనేని చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


