నేను స్టూడెంట్‌గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది.. హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది. తాజాగా నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ అనంతరం దర్శకుడిగా న. చిలసౌ అనే సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ మంచి హిట్ అందుకున్నారు. అనంతరం నాగార్జునతో చేసిన మన్మథుడు 2 డిజాస్టర్‌గా నిలిచింది.

అల్లు అరవింద్ సమర్పణలో
ఇప్పుడు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ
రొమాంటిక్, ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ది గర్ల్‌ఫ్రెండ్ తెరకెక్కింది. సరికొత్త ప్రేమ కథ అంటూ నవంబర్ 7న థియేటర్లలో ది గర్ల్‌ఫ్రెండ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా అక్టోబర్ 25న ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
13 ఏళ్లుగా
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "నేను స్టూడెంట్‌గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. 13 ఏళ్లుగా నా మైండ్ లో ఉంది ఇది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్‌తో ఉంటుంది. రిలేషన్‌షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు" అని అన్నారు.
కథకు లైఫ్ ఇచ్చారు
"అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. మూవీ రియల్‌గా, రూటెడ్‌గా, ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక మందన్నా తమ పర్‌ఫార్మెన్స్‌తో కథకు లైఫ్ ఇచ్చారు" అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
ఏ దర్శకుడికైన అదృష్టం
"ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్‌ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్‌గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్‌కు మీ సపోర్ట్ కావాలి" అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.
ఎంతో ఇన్స్‌పైర్ చేసింది
ఇదే ఈవెంట్‌లో డీవోపీ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ.. "ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా టీమ్‌తో వర్క్ చేయడం ఎంతో ఇన్స్‌పైర్ చేసింది. ఒక ఇంటెన్స్, ప్యాషనేట్ కంటెంట్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీరంతా మా మూవీని సపోర్ట్ చేస్తారని, మా సినిమా గురించి మిగతా వారికి చెబుతారని కోరుకుంటున్నా" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


