మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా?
మహాభారతంలో కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం (అక్టోబర్ 15) కన్నుమూశాడు. అయితే ఈ సీరియల్ లో మొదట అర్జునుడి పాత్ర పోషించాల్సిన అతడు.. తర్వాత కర్ణుడి పాత్రకు ఎలా మారాడన్నది ఆసక్తి రేపేదే.
బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్‌లో కర్ణుడి క్యారెక్టర్ చేసిన టీవీ యాక్టర్ పంకజ్ ధీర్ ఈరోజు అంటే అక్టోబర్ 15న చనిపోయాడు. పంకజ్ ధీర్ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. పంకజ్ చాలా టాలెంటెడ్ యాక్టర్. అతడు తన కెరీర్‌లో చాలా మంచి క్యారెక్టర్లు చేశాడు. కానీ అతనికి అసలు పేరు వచ్చింది మాత్రం కర్ణుడి రోల్ ద్వారానే. ఆ రోల్ ఎంత పాపులర్ అయ్యిందంటే పుస్తకాల్లో కర్ణుడి బొమ్మల దగ్గర కూడా పంకజ్ ధీర్ ఫేస్ వేసేవాళ్లు. అయితే నిజానికి మొదట అతనికి అర్జునుడి పాత్ర ఇచ్చారన్న విషయం తెలుసా?
మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా? (Instagram)
మీసాలు తీయనని అనడంతో..
మహాభారత్ సీరియల్ లో మొదట పంకజ్ ధీర్ ను అర్జునుడి పాత్ర కోసం ఆడిషన్ చేశారట. కానీ అతడు మీసాలు తీయడానికి ఒప్పుకోలేదు. దానివల్ల అతనికి ఆ రోల్ దొరకలేదు. గతంలో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో పంకజ్ ధీర్ ఈ విషయం గురించి మాట్లాడాడు. అందులో పంకజ్ ఏమన్నారంటే.. “నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు డైలాగ్ రైటర్స్ రాహీ మాసూమ్ రజా, భృంగ్ తుప్కరీ సాహెబ్ పండిట్ నరేంద్ర శర్మతో కలిసి ఒక ప్యానెల్ ఉండేది. వాళ్ళందరూ నేను అర్జునుడి రోల్‌లో చాలా బాగుంటానని అనుకున్నారు.
మేము దాని గురించి మాట్లాడుకుని నేను కాంట్రాక్ట్ సైన్ చేశాను. తర్వాత బీఆర్ చోప్రా నాకు ఫోన్ చేసి బృహన్నల క్యారెక్టర్ కోసం మీసాలు కత్తిరించుకోవాలి అన్నారు. నేను అది చేయలేను అన్నాను. నా ముఖం బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే నేను మీసాలు తీసేస్తే నా ఫేస్ బాగుండదు అని చెప్పాను. దానికి ఆయన నాతో.. నువ్వు యాక్టర్ వా కదా.. నువ్వు మీసాల కోసం ఇంత పెద్ద రోల్ వదిలేస్తున్నావు. నాకు ఇది అర్థం కావడం లేదు అన్నాడు” అని పంకజ్ తెలిపాడు.
కర్ణుడి రోల్ ఇలా దొరికింది
ఆ తర్వాత పంకజ్ ధీర్ ఏం చెప్పారంటే.. బీఆర్ చోప్రా ఈ మాట విన్నాక తనను అక్కడి నుండి బయటికి పంపించేసినట్లు చెప్పాడు. "ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళిపో.. మళ్ళీ రాకు. నన్ను ఆఫీస్ నుండి బయటికి నెట్టేశారు. నా కాంట్రాక్ట్ చింపేశారు. ఆరు నెలల పాటు నేను అటుఇటూ తిరుగుతూ డబ్బింగ్ చేసుకుంటున్నాను.
మళ్ళీ చోప్రా సర్ నాకు కాల్ చేశారు. దీన్నే నేను అదృష్టం అంటాను. ఆయన నన్ను కర్ణుడి రోల్ చేస్తావా అని అడిగారు? నేను.. సర్ మీసాలు కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడిగాను. ఆయన లేదు అన్నారు. నాకు కర్ణుడి రోల్ దొరకడం నా అదృష్టం” అని పంకజ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. పంకజ్ ఇప్పుడు 68 ఏళ్ల వయసులో కన్నుమూసినా.. ఆ కర్ణుడి పాత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాడు.
News/Entertainment/మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా?
News/Entertainment/మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా?