ప్రభాస్ రాజా సాబ్ టు బాలకృష్ణ అఖండ 2- ఈ వారం ఓటీటీ, థియేటర్లలో 17 సినిమాలు- ఒక్కరోజే 16 రిలీజ్!

ఓటీటీ, థియేట్రికల్ ఆడియెన్స్‌కు ఈ వారం పండుగే అని చెప్పాలి. థియేటర్లలో ప్రభాస్ ది రాజా సాబ్, విజయ్ జన నాయగన్ వంటి సినిమాలతోపాటు బాలకృష్ణ అఖండ 2, రకుల్ ప్రీత్ సింగ్ దేదే ప్యార్ దే 2 ఓటీటీ రిలీజెస్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఈ వారం నాటి థియేట్రికల్, ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Jan 5, 2026, 15:11:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త ఏడాది సందడి అప్పుడే మొదలైపోయింది. ఈ వారం అంటే జనవరి 5 నుంచి 11వ తేదీ మధ్య సినీ ప్రియులను అలరించేందుకు థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో ముస్తాబవుతున్నాయి. అటు హాలీవుడ్ నుంచి ఇటు ప్రాంతీయ సినిమాల వరకు, ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి బాలకృష్ణ అఖండ 2 వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రభాస్ రాజా సాబ్ టు బాలకృష్ణ అఖండ 2- ఈ వారం ఓటీటీ, థియేటర్లలో 17 సినిమాలు- ఒక్కరోజే 16 రిలీజ్!
ప్రభాస్ రాజా సాబ్ టు బాలకృష్ణ అఖండ 2- ఈ వారం ఓటీటీ, థియేటర్లలో 17 సినిమాలు- ఒక్కరోజే 16 రిలీజ్!

థియేటర్లలో దళపతి, రెబల్ స్టార్ సందడి

ఈ వారం బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం మొదలుకానుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో రెండు భారీ చిత్రాలపైనే అందరి కళ్లు ఉన్నాయి.

ది రాజా సాబ్: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలతోపాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

జన నాయగన్: దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయన్ కావడంతో కోలీవుడ్‌లో దీని మేనియా పీక్స్‌లో ఉంది. థియేటర్లలో జనవరి 9న జన నాయగన్ రిలీజ్ కానుంది. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

బెంగాలీ సినిమాలు: అంకుష్ హజ్రా నటించిన ‘నారీ చరిత్రో బిజయ్ జోటిల్’, ‘కీర్తనేర్ పోర్ కీర్తన్’ చిత్రాలు జనవరి 9నే బెంగాలీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.

హాలీవుడ్ లవర్స్ కోసం

హాలీవుడ్ నుంచి కూడా ఆసక్తికరమైన సినిమాలు లైన్‌లో ఉన్నాయి. జనవరి 9న జెరార్డ్ బట్లర్ నటించిన ‘గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్’, హ్యూ జాక్‌మన్ ‘సాంగ్ సంగ్ బ్లూ’ సహా ‘ది క్రోనాలజీ ఆఫ్ వాటర్’, ‘ప్రైమేట్’ చిత్రాలు భారత్‌లో విడుదల కానున్నాయి.

ఓటీటీల్లో పండుగే పండుగ!

థియేటర్లకు వెళ్లలేని వారికి ఓటీటీలు అదిరిపోయే ఆప్షన్లను ఇస్తున్నాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జీ5 వేదికగా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

అఖండ 2: తాండవం ఓటీటీ: నందమూరి బాలకృష్ణ మైథలాజికల్ మాస్ యాక్షన్ ఫాంటసీ మూవీ అఖండ 2 జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు.

దే దే ప్యార్ దే 2 ఓటీటీ: అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం దే దే ప్యార్ దే 2 కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి 9న డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది.

వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 7న ‘షిబోయుగి’ యానిమే సిరీస్, 9న ‘ఆల్ఫా మేల్స్’ సీజన్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇతర ఓటీటీల్లో

సోనీ లివ్ (SonyLIV)లో చారిత్రాత్మక సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ జనవరి 9న విడుదలవుతుంది. అలాగే మలయాళ చిత్రం ‘కాలంకావల్’ కూడా అదే రోజున వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 9 నుంచి బాల్తీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

జీ5 (ZEE5)లో తమిళ సినిమా ‘మాస్క్’, హిందీ డాక్యూమెంటరీ ‘హనీమూన్ సే హత్య’ జనవరి 9న ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇలా ఓటీటీలో 9, థియేటర్లలో 8 కలిపి మొత్తంగా 17 సినిమాలు సినీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాయి. వీటిలో ఒక్క జనవరి 9నే 16 విడుదల కావడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More