అఖండ 2 రివ్యూ- చైనా బయోవార్, హైందవ ధర్మ రక్షణ- బాలకృష్ణ తాండవం, బోయపాటి మాస్ ఎలివేషన్స్‌తో మూవీ ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి అఖండ 2 తాండవం మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్ : అఖండ 2: తాండవం

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్ తదితరులు
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
కథ, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
విడుదల తేది: 12 డిసెంబర్ 2025
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేశారు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా, అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
అలాంటి అంచనాల నడుమ ఎట్టకేలకు ఇవాళ (డిసెంబర్ 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది అఖండ 2 చిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అఖండ 2 తాండవం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
భారత్‌పై పగ తీర్చుకునేందుకు చైనా బయోవార్‌కు కుట్ర పన్నుతుంది. దేవుళ్లపై నమ్మకం కోల్పోయేలా చేసేందుకు కుంభమేళాను టార్గెట్ చేస్తుంది. కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించిన భక్తులందరూ కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోతారు. అది ఒక వ్యాధి వల్ల పడిపోయారని తెలుస్తుంది.
ఆ వ్యాధికి విరుగుడుగా యాంటీ డాట్ వాక్సిన్‌ను భారత్ వైద్య బృందం కనిపెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శత్రువులు భారత్ ల్యాబ్‌ను నాశనం చేసి సైంటిస్ట్‌లందరిని చంపేస్తారు. అక్కడి నుంచి యంగ్ సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా) వ్యాక్సిన్‌తో బయటపడుతుంది.
అది తెలుసుకున్న శత్రువులు జనని వెంట పడతారు. జనని రక్షించేందుకు రుద్ర సికందర్ అఘోరా (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. జనని ఎవరు జనని ఆపదలో ఉందని అఘోరాకు ఎలా తెలిసింది? శత్రువులను అఘోరా ఎలా ఎదుర్కొన్నాడు? చైనాకు భారత్ అంటే ఎందుకు పగ? సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని అఘోరా ఎలా చాటి చెప్పాడు? తెలియాలంటే అఖండ 2 చూడాల్సిందే.
విశ్లేషణ:
అఖండ సినిమా రీక్యాప్‌తో అఖండ 2 తాండవం ప్రారంభం అవుతుంది. అఖండలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తే ఈ సినిమాలో ఉగ్రరూపం చూపించారు బోయపాటి శ్రీను. సనాతన ధర్మం, భారతీయ విశ్వసాలు, వేదజ్ఞానాల గొప్పతనాన్ని అఘోరా పాత్రతో చెప్పించారు.
సినిమా కథ అంతా టిబెట్ సరిహద్దుల దగ్గర జరుగుతుంది. దేవుడని ఎక్కువ నమ్మే భారతీయల మనసుల్లో దైవత్వంపై దెబ్బకొట్టాలని చైనా పన్నాగం పన్నడం, అందుకు బయోవార్ ఉపయోగించుకోవడం, దానికి విరుగుడుగా భారత్ సైంటిస్టులు కనిపెట్టడం వంటి సీన్లతో అలా సాగిపోతుంది సినిమా.
అఖండ టెంప్లెట్‌లో
తర్వాత భారత శాస్త్రవేత్తలను శత్రు సైన్యం చంపడం, వారి నుంచి జనని తప్పించుకోవడం, జనని నేపథ్యం అంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే జనని ఎవరు అనేది ఆడియెన్స్ ముందుగానే గెస్ చేసేలా ఉంది. ఇక అనంతరం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ ఎపిసోడ్ దాదాపుగా అఖండ టెంప్లెట్‌లోనే సాగుతుంది.
ఈ సినిమాలో మత్తు మందులను సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాను మట్టుపెట్టే పాత్రలో రెండో బాలకృష్ణ పాత్ర ఉంటుంది. అయితే, బాలమురళీకృష్ణ పాత్ర పరిచయం, మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. కామన్ ఆడియెన్స్‌కు సాగదీతలా అనిపిస్తాయి.
అఘోరా ఎంట్రీతో
ఇంటర్వెల్‌కు ముందు అఘోరా ఎంట్రీతో సినిమా ఊపందుకుంటుంది. ఫ్యాన్స్‌కు పూనకాలు అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగా వర్కౌట్ అయింది. అఘోరా తాండవం, మాస్ సీన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. అఘోరాలోని రెండు కోణాలు ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.
మరోవైపు తాంత్రికుడైన నేత్ర (ఆది పినిశెట్టి) ఎపిసోడ్ అదిరిపోతుంది. అఘోరాకు ధీటుగా నేత్ర ఎపిసోడ్ తెరకెక్కించారు. అలాగే, హనుమాన్, శివుడు ఎపిసోడ్స్, మదర్ సెంటిమెంట్, దేశభక్తి, హైందవ ధర్మం నేపథ్యం, రక్షణ, అఘోరా సర్జికల్ స్ట్రైక్ వంటివన్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. బాలకృష్ణ డైలాగ్స్ విజిల్స్ కొట్టేలా ఉంటాయి.
మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా
క్లైమాక్స్ ఊహించినట్లుగా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా బాలకృష్ణే కనిపిస్తారు. బాలయ్య బాబు వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. రెండు పాత్రల్లో మూడు కోణాల్లో బాలకృష్ణ అదరగొట్టారు. మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా బోయపాటి శ్రీను సినిమాను తెరకెక్కించారు.
ఆది పినిశెట్టి పాత్రల ఆకట్టుకునేలా ఉంది. సంయుక్త మీనన్ రూల్ పర్వాలేదనేలా ఉంది. బాలీవుడ్ నుంచి వచ్చిన హర్షాలీ మల్హోత్రా చుట్టూనే సినిమా కథ సాగుతుంది. ఆ పాత్రకు న్యాయం చేసింది హర్షాలీ. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయింది. జాజికాయ సాంగ్ అలరిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే అఖండ 2 మూవీ బాలకృష్ణ నట తాండవం.
రేటింగ్: 3.25/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


