పరమశివుడే మీ ముందుకు వచ్చి సందేశం ఇచ్చినట్లు ఉంటుంది.. అఖండ 2 చెన్నై ఈవెంట్‌లో బోయపాటి శ్రీను కామెంట్స్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేశారు. తాజాగా చెన్నైలో అఖండ 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నందమూరి నటసిహం బాలకృష్ణ-బ్లాక్ బస్టర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వంటి పవరుఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. సింహా, లెజెండ్, అఖండ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చెన్నైలో అఖండ 2 ప్రెస్ మీట్
అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న 2డీ, త్రీడీ ఫార్మాట్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో అఖండ 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
భారతదేశ ఆత్మ
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. బాలయ్యతో అఖండ సినిమా చేసాం. అది రీజినల్ సినిమా కాదు ఇండియన్ సినిమా. అలాగే అఖండ 2 చేశాం. ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
పరమశివుడే మీ ముందుకు వచ్చి
"అఖండ 2 సినిమా ఆడియన్స్‌ని కమర్షియల్‌గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షియల్‌గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది" అని బోయపాటి శ్రీను తెలిపారు.
బాలకృష్ణ కామెంట్స్ వైరల్
ఇదిలా ఉంటే, ఇదే ఈవెంట్‌లో తమిళంలో మాట్లాడి బాలకృష్ణ అందరిని ఆశ్చర్యపరిచారు. దాంతో చెన్నై ఈవెంట్‌లో బాలకృష్ణ స్పీచ్, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బాలకృష్ణ ఏం మాట్లాడారో ఓ లుక్కేద్దాం.
130 రోజుల్లోనే చిత్రీకరించాం
"అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు" అని బాలకృష్ణ అన్నారు.
సనాతన ధర్మం నేర్చుకుంటారు
"ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది" అని బాలయ్య బాబు తెలిపారు.
ఆయన బాటలోనే నడుస్తున్నా
"ఈ సినిమా ఒక ఎన్‌సైక్లోపీడియా. మా నాన్న గారు నా గురువు, దైవం ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలను చేశారు. నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను" అని గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


