అఖండ 2లో బాలకృష్ణ వాడిన రాక్స్ వెహికల్ గ్రాండ్ లాంచ్- పవర్, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా- థియేటర్‌లో మెస్మరైజ్ అవుతారంటూ!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమాలో బాలకృష్ణ వాడిన వెహికల్‌ను డైరెక్టర్ బోయపాటి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా అఖండ 2 రాక్స్ వెహికల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Nov 28, 2025, 10:53:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ వాడిన వాహనాన్ని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజిన్‌తో ఈ వెహికిల్‌ను నిర్మించగా ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినిమాటిక్ లుక్‌ను అందించింది.

అఖండ 2లో బాలకృష్ణ వాడిన రాక్స్ వెహికల్ గ్రాండ్ లాంచ్- పవర్, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా- థియేటర్‌లో మెస్మరైజ్ అవుతారంటూ!
అఖండ 2లో బాలకృష్ణ వాడిన రాక్స్ వెహికల్ గ్రాండ్ లాంచ్- పవర్, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా- థియేటర్‌లో మెస్మరైజ్ అవుతారంటూ!

మాస్ ఎనర్జీకి నిదర్శనంగా

పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుందని మేకర్స్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

బోయపాటి శ్రీను కామెంట్స్

ఈ వెహికిల్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవీ వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దాదాపుగా పది వెహికల్స్ ఉన్నాయి. అమర్ గారు అద్భుతంగా డిజైన్ చేస్తారు" అని అన్నారు.

రాత్రి పగలు కష్టపడి

"ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికిల్ రాత్రి పగలు కష్టపడి గొప్పగా డిజైన్ చేశారు. అందుకు ఆయనను అభినందించాలి. ఈ వెహికల్‌ని యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. మెస్మరైజ్ అవుతారు. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు" అని బోయపాటి శ్రీను తెలిపారు.

పవర్ ఉన్న క్యారెక్టర్

"ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్‌ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్‌కి ధన్యవాదాలు. ఈవెంట్‌ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు" దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు.

భారత దేశ ఆత్మ

"అఖండ 2 ది తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారత దేశ ఆత్మ. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అందరికీ థాంక్యు వెరీ మచ్" అని తన స్పీచ్ ముగించారు అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఇది మా అదృష్టం

ఇదే ఈవెంట్‌లో అమర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు. అఖండ2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి పని చేయడం మా అదృష్టం. ఇందులో మీరు చూస్తున్న ఈ వెహికల్ స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తుంది" అని అన్నారు.

ప్రతి విషయంలో

"డైరెక్టర్ బోయపాటి గారితో మాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. అయిన ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఈ వెహికల్‌ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ ప్రాజెక్ట్‌లో బాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరినీ అలరిస్తుంది" అని అఖండ 2 వెహికిల్ డిజైన్ చేసిన అమర్ తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More