అఖండ 2లో నటించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు.. స్టేజీ మీద పరిచయం.. పరమేశ్వరుడే కనిపించాలంటూ!

మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2. నందమూరి బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కించిన నాలుగో సినిమా ఇది. ఈ అఖండ 2 తాండవం సినిమాలో బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ నటించినట్లు దర్శకుడు ఇటీవల వెల్లడించారు.

Published on: Dec 1, 2025, 10:00:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను-గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అఖండ 2 సినిమాలో డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ నటించారు.

అఖండ 2లో నటించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు.. స్టేజీ మీద పరిచయం.. పరమేశ్వరుడే కనిపించాలంటూ!
అఖండ 2లో నటించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను చిన్న కుమారుడు.. స్టేజీ మీద పరిచయం.. పరమేశ్వరుడే కనిపించాలంటూ!

చిన్న కొడుకు పరిచయం

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అలాగే, తన కుమారుడు వర్షిత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఆ యాక్షన్ నమ్ముతాను

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను ఎమోషన్‌ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఆ యాక్షన్‌కి నాతో పాటు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అలాగే ఫ్యూచర్‌లో బెస్ట్ మాస్టర్ అయ్యే రాహుల్, అలాగే ఒక ఫైట్‌కి రవి వర్మ గారు పనిచేశారు. కొరియోగ్రాఫర్స్‌కి థాంక్యూ" అని అన్నారు.

విజన్‌కు ప్రాణం పోసిన

"నా విజన్ స్క్రీన్ మీద చూపించే కెమెరామెన్, ఆ విజన్‌కి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తనతో నాకు సరైనోడు నుంచి జర్నీ ఉంది. ఈ సినిమాకి సంతోష్, రామ్ ప్రసాద్ ఇద్దరు కెమెరామెన్‌గా పనిచేశారు. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు" అని బోయపాటి శ్రీను తెలిపారు.

ఎంతో స్వేచ్ఛనిచ్చారు

"పూర్ణ అద్భుతమైన ఆర్టిస్ట్. హర్షాలి భజరంగ్ భాయిజాన్ తర్వాత మన సినిమానే చేసింది. తన క్యారెక్టర్‌ని చాలా అభిమానిస్తారు. మా నిర్మాతలు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. వారి స్వేచ్ఛ వల్లే నేను ఇంత బ్రహ్మాండంగా సినిమాను తీయగలిగాను" అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.

మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి

"అఖండ 2లో మా చిన్నబ్బాయి (వర్షిత్) ఒక క్యారెక్టర్ చేశాడు తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. సినిమా తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు." అని దర్శకుడు బోయపాటి వెల్లడించారు.

భగవంతుడే దారి చూపించాడు

"ఇందులో మేము షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ చూస్తే మీకు నమ్మశక్యంగా ఉండవు. ఆ భగవంతుడే మాకు దారి చూపించాడు. జన్మభూమికి యుద్ధం జన్మభూమి కోసం యుద్ధం చేసే సైనికులు అన్నిచోట్ల ఉంటారు. కానీ, కర్మభూమి కోసం యుద్ధం చేసే వీరులు భారతదేశంలోనే ఉంటారు. వాళ్లు ఉండబట్టే ఈ దేశం ముందుకు వెళుతుంది" అని బోయపాటి శ్రీను అభిప్రాయపడ్డారు.

అఖండ అన్‌స్టాపబుల్

ఇదే ఈవెంట్‌లో నటి, సీనియర్ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. అఖండలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా అంతే అద్భుతమైన అనుభూతినిచ్చే పాత్ర ఇచ్చారు. బాలకృష్ణ గారు అన్‌‌స్టాపబుల్.. అఖండ కూడా అన్‌స్టాపబుల్. జై బాలయ్య" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More