శివుడి రూపంలో బాలకృష్ణను చూస్తే చేతులెత్తి దండం పెడతారు, స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. ఎస్ఎస్ తమన్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరోసారి తెరకెక్కిన సినిమా అఖండ 2 తాండవం. ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 29, 2025, 11:26:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.

శివుడి రూపంలో బాలకృష్ణను చూస్తే చేతులెత్తి దండం పెడతారు, స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. ఎస్ఎస్ తమన్ కామెంట్స్
శివుడి రూపంలో బాలకృష్ణను చూస్తే చేతులెత్తి దండం పెడతారు, స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. ఎస్ఎస్ తమన్ కామెంట్స్

అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన అఖండ 2 తాండవం సినిమాను 2డీ, త్రీడీ ఫార్మాట్స్‌లలో డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ శివుడే చేయించుకున్నాడు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. "అఖండ సినిమా చేయాలంటే చాలా బలం కావాలి. ఈ సినిమా చేసింది నేను కాదు.. ఆ శివుడే చేయించుకున్నాడు. అఖండ అనేది ఒక గుడి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి" అని అన్నారు.

ఆది పినిశెట్టి కూడా

"శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని బిగ్ స్క్రీన్‌పై చూస్తుంటే మీరందరూ చేతులెత్తి దండం పెడతారు. ఆది పినిశెట్టి కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు. తనకు చాలా మంచి పేరు వస్తుంది. శివుడికి మ్యూజిక్ చేయడమనేది ఎంతో అదృష్టం ఉండాలి" అని తమన్ తెలిపాడు.

ఇది సిక్సర్

"ఈ డ్రీమ్‌కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ 14 రీల్స్, దూకుడు సినిమా నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అఖండ కంటే అఖండ 2 మూడింతలు ఎక్కువ ఉంటుంది. బాలయ్య గారితో బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు పని చేయడం.. ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. ఇప్పుడు గోపి సినిమా కూడా ప్రారంభమైంది. ఇది సిక్సర్" అని తమన్ పేర్కొన్నారు.

ఆ కంప్లైంట్ చేయకూడదు

"డిసెంబర్ 5న ఎవరు కూడా బాక్సులు పగిలిపోయి, స్పీకర్లు పేలిపోయాయని కంప్లైంట్ చేయకూడదు. ముందే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు. డిసెంబర్ 5 బాలయ్య గారితో మరో బ్లాక్ బస్టర్ హిట్. అందరం సక్సెస్ మీట్‌లో కలుద్దాం" అని ఎస్ఎస్ తమన్ తన స్పీచ్ ముగించారు.

అదృష్టంగా భావిస్తున్నా

హర్షాలి మల్హోత్రా మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా నాకు ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. నాకు ఈ క్యారెక్టర్‌లో బిలీవ్ చేసిన డైరెక్టర్ బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మా నిర్మాతలకు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని తెలిపింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More