బంగారం లాంటి మనసున్న మనిషి.. ఈ సినిమా సునామీ సృష్టించబోతుంది.. హీరో ఆది పినిశెట్టి కామెంట్స్

హీరోగా, విలన్‌గా చేస్తూ అలరిస్తున్నాడు ఆది పినిశెట్టి. తాజాగా ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 నుంచి రీసెంట్‌గా ది తాండవం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 16, 2025, 06:30:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోగా, విలన్‌గా చేస్తూ మెప్పిస్తున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు, ది వారియర్ సినిమాల తర్వాత మరోసారి విలన్‌గా అలరించేందుకు ఆది పినిశెట్టి చేస్తున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 నుంచి రీసెంట్‌గా ది తాండవం సాంగ్ రిలీజ్ చేశారు.

బంగారం లాంటి మనసున్న మనిషి.. ఈ సినిమా సునామీ సృష్టించబోతుంది.. హీరో ఆది పినిశెట్టి కామెంట్స్
బంగారం లాంటి మనసున్న మనిషి.. ఈ సినిమా సునామీ సృష్టించబోతుంది.. హీరో ఆది పినిశెట్టి కామెంట్స్

ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ సందర్భంగా అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సునామీ సృష్టించబోతుంది

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. బంగారం లాంటి మనసు ఉన్న మనిషి. బోయపాటి గారు బాలయ్య గారు తమన్ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ సినిమా సునామీ సృష్టించబోతోంది" అని అన్నాడు.

నాకు చాలా స్పెషల్ ఫిల్మ్

బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా మాట్లాడుతూ.. "లెజెండ్రీ బాలకృష్ణ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అని తెలిపింది.

ఎం తేజస్విని సమర్పణ

ఇదిలా ఉంటే, అఖండ 2 తాండవం సినిమాకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా అఖండ 2 మూవీని సమర్పిస్తున్నారు.

ది తాండవం పూర్తి సాంగ్ రిలీజ్

ముంబైలోని జుహూలోని పీవీఆర్ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో అఖండ 2 ది తాండవం పూర్తి పాటను లాంచ్ చేశారు. బాలయ్యకు హై-వోల్టేజ్ సౌండ్‌ ట్రాక్‌ల అదించే ఎస్‌. థమన్‌ ‘అఖండ 2’ కోసం మరోసారి డివైన్ ఫుల్ సాంగ్ ఇచ్చారు.

అఘోర మంత్రాలతో

ఈ పాటలో బాలకృష్ణ అఘోర అవతారంలో, అఘోర మంత్రాలతో దద్దరిల్లుతున్న భారీ ఆలయ ప్రాంగణంలో శివ తాండవం చేయడం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రతి ఫ్రేమ్‌లోని డివైన్ ఇంటెన్సిటీ థమన్ ట్రేడ్‌మార్క్ పెర్కషన్- స్కోర్‌తో అదిరిపోయింది.

గూస్‌బంప్స్ తెప్పించేలా

శంకర్‌ మహదేవన్‌, కైలాష్‌ ఖేర్‌ పవర్‌ఫుల్ వోకల్స్ ఈ పాటకు డివైన్ వైబ్‌ని యాడ్ చేశాయి. లిరిసిస్ట్‌ కళ్యాణ్‌ చక్రవర్తి శివుని మహోన్నత శక్తిని పదాల్లో అద్భుతంగా మలిచారు. వినగానే గూస్‌బంప్స్‌ తెప్పించేలా అఖండ 2 ది తాండవం పాట ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన డివోషనల్ సాంగ్‌గా నిలవనుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More