గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నకిలీ నగలు చేయించి అడ్డంగా బుక్కయిన ప్రభావతి.. బాలు, మీనాలకు ఘోర అవమానం.. రచ్చ రచ్చ

గుండె నింగా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ నకిలీ నగలు చేయించి మరింత బుక్కవుతారు. బాలు, మీనాలకు అసలు విషయం తెలిసిపోయి ఇంట్లో పెద్ద రచ్చ చేయడానికి బాలు రెడీ అవుతాడు.

Published on: Nov 4, 2025, 07:54:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 546వ ఎపిసోడ్ లో బాలు, మీనాల చేతిలో అడ్డంగా బుక్కవుతుంది ప్రభావతి. నకిలీ నగలు ఆమె కొంప ముంచుతాయి. వాటిని తాకట్టు పెట్టడానికి వెళ్లిన బాలు, మీనాలకు ఘోర అవమానం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ జరిగే ప్రమాదం కనిపిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నకిలీ నగలు చేయించి అడ్డంగా బుక్కయిన ప్రభావతి.. బాలు, మీనాలకు ఘోర అవమానం.. రచ్చ రచ్చ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నకిలీ నగలు చేయించి అడ్డంగా బుక్కయిన ప్రభావతి.. బాలు, మీనాలకు ఘోర అవమానం.. రచ్చ రచ్చ

బామ్మకు బంగారం కోసం బాలు తిప్పలు

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ లో బాలు, మీనా కలిసి బామ్మ పుట్టిన రోజుకు గోల్డ్ చెయిన్ చేయించాలని నిర్ణయించుకుంటారు. అయితే డబ్బు లేదని, అప్పు చేయాల్సిందే అని బాలు అంటాడు. మిమ్మల్ని, నన్ను అంత బాగా చూసుకునే బామ్మ కోసం అప్పు చేసినా సరే అని మీనా అంటుంది. దీంతో అప్పు కోసం బాలు బయటకు వెళ్తాడు. కానీ ఎవరూ అతనికి డబ్బు ఇవ్వరు.

తన బంగారం తాకట్టు పెట్టమన్న మీనా

దీంతో బాలు నిరాశగా తిరిగి ఇంటికి వస్తాడు. ఎవరూ అప్పు ఇవ్వడం లేదని, కారు తాకట్టు పెట్టమంటున్నారని చెబుతాడు. దీంతో మీనా కూడా బాధపడుతుంది. అయితే అత్తయ్య దగ్గర తన నగలు ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టి చెయిన్ చేయిద్దామని మీనా అంటుంది. కానీ నువ్వు శపథం చేశావు కదా అని బాలు అంటాడు. నా కోసం అడగడం లేదు కదా అని మీనా అంటుంది. తాను అడిగితే ఇవ్వదని బాలు అనడంతో మామయ్యతో అడిగిద్దామని మీనా చెబుతుంది.

సత్యంతో బంగారం విషయం చెప్పిన బాలు.. వినేసిన మనోజ్

బాలు, మీనా కలిసి సత్యాన్ని పిలుస్తారు. ఇద్దరూ విషయం ఎలా చెప్పాలా అని కంగారు పడతారు. చివరికి అసలు విషయం చెప్పేస్తారు. బామ్మ పుట్టిన రోజున గోల్డ్ చెయిన్ ఇవ్వాలనుకుంటున్నానని, అందుకే అమ్మ దగ్గర ఉన్న మీనా నగలు ఇప్పించాలని అడుగుతారు. మీరే అడగండి అని సత్యం అంటే.. తాను అడిగితే ఇవ్వదని, మీరే అడిగి ఇప్పించాలని బాలు అంటాడు. సరే అని సత్యం అంటాడు. అయితే ఇదంతా మనోజ్ చాటు నుంచి విని వీళ్లకు అసలు విషయం తెలిసిపోయిందా ఏంటని కంగారు పడతాడు.

ఇరుక్కుపోయిన మనోజ్, ప్రభావతి

వెంటనే కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్తాడు మనోజ్. బాలు, మీనా నగలు అడుగుతున్నారని చెబుతాడు. అంతకుముందే కామాక్షికి అసలు విషయం చెప్పిన ప్రభావతి.. ఆరు నెలల్లో మనోజ్ ఆ నగలు తీసుకొస్తాడని అంటుంది. కానీ అప్పుడే మనోజ్ రావడంతో కామాక్షి వాళ్లను ఎగతాళి చేస్తుంది. వెంటనే వెళ్లి ఆ నగలు తీసుకురమ్మని మనోజ్ కు చెబుతుంది. దీంతో తాను వాటిని అమ్మేశానని మనోజ్ అంటాడు. అది విని అతన్ని ప్రభావతి చితకబాదుతుంది.

నకిలీ నగలు చేయించాలన్న ప్రభావతి

అయినా ఆ సేటు దగ్గర ఆ నగలు ఉంటే తన నగలు ఇచ్చి అయినా వాటిని తీసుకురమ్మని ప్రభావతి చెబుతుంది. సరే అంటూ బయటకు వెళ్లిన మనోజ్ సేటుకు ఫోన్ చేస్తాడు. వాటిని కరిగించేశానని అతడు చెప్పడంతో మనోజ్ షాక్ తింటాడు. అసలు విషయం ప్రభావతికి చెప్పడంతో ఆమె మరింత కంగారు పడుతుంది. దీంతో నకిలీ నగలు చేయించాలని అనుకుంటుంది. వాటి ఫొటో తన దగ్గర ఉందని మనోజ్ చెప్పడంతో అచ్చూ అలాగే చేయించి తీసుకురావాలని అతన్ని పంపిస్తుంది.

అన్నంలో వెంట్రుక.. కష్టం, నష్టం అన్న బాలు

ఇటు ఇంట్లో అందరూ కలిసి తింటూ ఉంటారు. అప్పుడే బాలుకి అన్నంలో వెంట్రుక వస్తుంది. అది చూసిన బాలు ఇలా జరిగితే ఇంటికి ఏదో కష్టం, నష్టం వస్తుందని అంటాడు. అప్పుడే నకిలీ నగలు చేయించుకొని మనోజ్ రాగా.. ప్రభావతితో కలిసి ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. కష్టం, నష్టం అనగానే ఇద్దరూ వచ్చారంటూ బాలు ఆటపట్టిస్తాడు.

ఆ తర్వాత బాలు, మీనాలకు ఆ నకిలీ నగలు ఇవ్వడంతో వాళ్లు వాటిని తాకట్టు పెట్టి చెయిన్ తీసుకురావడానికి షాపుకు వెళ్తారు. అక్కడ అవి నకిలీ నగలని తేలడంతో వాళ్లిద్దరినీ షాపతను ఘోరంగా అవమానిస్తాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన బాలు అసలు విషయం తేల్చేస్తానంటూ ఇంటికి వస్తాడు. దీంతో మనోజ్, ప్రభావతి మరింత కంగారు పడతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More