గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలు అమ్మేసిన మనోజ్.. నగల కోసం పట్టుబట్టిన బాలు.. దొరికిపోయిన మనోజ్, ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. మీనా నగలు తాకట్టు పెట్టకుండా మనోజ్ అమ్మేస్తాడు. అయితే ఆ నగలు తమకు కావాలని బాలు, మీనా అడగడంతో మనోజ్, ప్రభావతి అడ్డంగా బుక్కవుతారు.

Published on: Oct 31, 2025, 07:48:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 544వ ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి ఇంట్లో వాళ్లకు అడ్డంగా దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీనా నగలు తాకట్టు పెట్టమంటే మనోజ్ వాటిని ఏకంగా అమ్మేయడంతో ఇంట్లో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలు అమ్మేసిన మనోజ్.. నగల కోసం పట్టుబట్టిన బాలు.. దొరికిపోయిన మనోజ్, ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలు అమ్మేసిన మనోజ్.. నగల కోసం పట్టుబట్టిన బాలు.. దొరికిపోయిన మనోజ్, ప్రభావతి

బాలు కోసం మీనా చేపలు.. మందు కోసం రిక్వెస్ట్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ బాలు కోసం మీనా చేపలు తెచ్చే సీన్ తో మొదలవుతుంది. కాళ్లు నొప్పులు పెడుతున్నాయన్న బాలు ఆమె వచ్చినప్పుడు మళ్లీ కారు తుడుస్తుండటంతో మీనా అతన్ని తిడుతుంది.

గది కోసం ఆలోచిస్తే తనకు నిద్ర పట్టడం లేదని బాలు అంటాడు. మీకు చేపలు పులుసు, వేపుడు చేస్తానని మీనా అంటుంది. అలాగే ముక్కతోపాటు చుక్క కూడా తెచ్చుకుంటానని బాలు అంటాడు. సరే నాకు ఓకే కానీ మామయ్యని అడిగి చెబుతానని అనడంతో వద్దని బాలు ఆమె వెంటపడతాడు.

ప్రభావతిని ఢీకొట్టిన మీనా.. నగల కవర్ తారుమారు

సరిగ్గా అప్పుడే ప్రభావతి చేతిలో నగల కవర్ తో బయటకు వస్తుంటుంది. బాలు నుంచి తప్పించుకోవడానికి మీనా వేగంగా లోనికి వెళ్లే ప్రయత్నంలో ప్రభావతిని ఢీకొడుతుంది. దీంతో ఇద్దరి చేతుల్లో కవర్లు కింద పడిపోతాయి.

మీనాను తిట్టిన ప్రభావతి.. మీనా తెచ్చిన చేపల కవర్ తీసుకొని మనోజ్ కు ఇస్తుంది. నగల కవర్ ను మీనా తీసుకెళ్తుంది. నగలను తాకట్టు పెట్టు కానీ అమ్మితే బాగుండదు అని మనోజ్ కు వార్నింగ్ ఇస్తుంది. మనోజ్ వాటిని తీసుకెళ్లిన తర్వాత లోనికి వచ్చిన ప్రభావతికి కిచెన్ లో ఆ కవర్ కనిపిస్తుంది. దానిని తెరిచి చూస్తే తన కవర్ అని తేలుతుంది. దానిని మెల్లగా తీసుకొని బయటకు వెళ్తుంది.

నగల షాపులో మనోజ్ షాక్.. సమయానికి తిరిగి ఇంటికి..

అటు చేపలు ఉన్న కవర్ తీసుకొని నగల షాపుకు వెళ్తాడు మనోజ్. అక్కడున్న వాళ్లందరూ చేపల కంపు కొడుతుందేంటని అనుకుంటారు. మనోజ్ కూడా అలాగే బిల్డప్ ఇస్తాడు. తర్వాత షాపతను ఏం కావాలని అడిగితే తనకు రూ.4 లక్షలు కావాలంటాడు. అయితే 80 గ్రాముల బంగారం కావాలంటాడు. వెంటనే కవర్ తెరిచి అతని ముందు పోస్తాడు. అందులో చేపలు ఉండటం చూసి షాపతను మనోజ్ ను తిట్టి పంపిస్తాడు.

అటు ఇంట్లో చేపల కవర్ కనిపించకపోవడంతో ప్రభావతిని అడుగుతుంది మీనా. కవర్ తన చేతుల్లోనే ఉందని, మనోజ్ తన జాకెట్ల కవర్ అనుకొని చేపల కవర్ తీసుకెళ్లాడని చెబుతుంది. అప్పుడే లోని వచ్చిన బాలు.. తాను ఆ షాపులో ఇస్తానని బలవంతంగా ప్రభావతి చేతిలోని కవర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఇవ్వదు. తాను మనోజ్ కే ఇస్తానని అంటుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ప్రభావతి.. మనోజ్ కు ఆ నగల కవర్ ఇచ్చి పంపిస్తుంది.

మీనా నగలు అమ్మేసిన మనోజ్

అటు నగలు తీసుకెళ్లిన మనోజ్ షాపులో వాటిని చూపిస్తాడు. తాకట్టు పెడితే రూ.4 లక్షలు రావని, రూ.2.1 లక్షలు మాత్రమే ఇస్తానని అతడు అంటాడు. దీంతో తనకు ఎలాగైనా రూ.4 లక్షలు కావాలంటాడు. అయితే వీటిని అమ్మేస్తే ఇస్తానని చెబుతాడు. దీంతో మనోజ్ సరే అంటాడు. ఏం జరిగితే అది జరుగుతుంది.. ఇప్పటికైతే తాను గండం నుంచి గట్టెక్కాలని అనుకుంటాడు. తన పని పూర్తవడంతో అతడు ఊపిరి పీల్చుకుంటాడు.

ఇటు ఇంట్లో మీనా, బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మ పుట్టిన రోజుకి మంచి గొలుసు చేయించాలని అనుకుంటున్నానని బాలు అంటాడు. మన నగలు అత్తయ్య దగ్గర ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి చేయించమని మీనా చెబుతుంది. అది విని మనోజ్ షాక్ తింటాడు. వెంటనే విషయం ప్రభావతికి చెప్పడంతో ఆమె నగలు తీసుకురమ్మని చెబుతుంది. మనోజ్ వెంటనే షాపతనికి ఫోన్ చేయగా.. ఆ నగలను ఎప్పుడో కరిగించేశామని అనడంతో అతడు కంగు తింటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More