గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలతో బాలుకి దొరికిపోయిన ప్రభావతి.. కవర్ తారుమారు.. బుక్కయిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు గురువారం (అక్టోబర్ 30) ఎపిసోడ్ లో మనోజ్ ను కాపాడుకోవడానికి ప్రభావతి దొంగతనం చేయడం, ఆ తర్వాత బాలు, మీనాలకు దొరికిపోవడంలాంటి సీన్లు చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Oct 30, 2025, 07:19:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 543వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తనను కాపాడమని తల్లి కాళ్లపై మనోజ్ పడటం, అతన్ని కాపాడేందుకు మీనా నగలను ఇవ్వడానికి సిద్ధమైన ప్రభావతి వాటిని దొంగతనం చేయడం, ఆ తర్వాత కవర్ తారుమారు కావడంతో ఆమె బాలుకి దొరికిపోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలతో బాలుకి దొరికిపోయిన ప్రభావతి.. కవర్ తారుమారు.. బుక్కయిన మనోజ్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా నగలతో బాలుకి దొరికిపోయిన ప్రభావతి.. కవర్ తారుమారు.. బుక్కయిన మనోజ్

బాలుకు సేవలు చేసిన మీనా.. మురిసిపోయిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 30) ఎపిసోడ్ బాలు, మీనా తాము పొదుపు చేసిన డబ్బులు దాచే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత కాళ్లు నొప్పులుగా ఉన్నాయన్న బాలుకి వేడి నీళ్లు తెచ్చి మీనా సేవలు చేస్తుంది. అది చూసిన ప్రభావతి.. వీడైనా వంశం పరువు నిలబెట్టాడంటూ రవి దగ్గరికి వెళ్తుంది.

బాలుగాడు మీనాతో ఎలా సేవలు చేయించుకుంటున్నాడో చూడు.. నువ్వూ ఉన్నావు నీ భార్య కాళ్లు పట్టుకుంటావంటూ అతన్ని తీసుకొస్తుంది. కానీ అప్పటికి సీన్ రివర్సై మీనా చేతులకు బాలు సేవలు చేస్తుంటాడు. అది చూసి ప్రభావతి షాక్ తింటుంది. వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ బాలు కాళ్లకు కాపడం పెడుతుంది మీనా.

ప్రభావతికి మూడు కోతుల బొమ్మ తెచ్చిన సత్యం

ఇంట్లో సమస్యలకు పరిష్కారం చెబుతానని బయటకు వెళ్లిన సత్యం.. ప్రభావతి కోసం బొమ్మలు తీసుకొస్తాడు. అదేంటని బాలు, మీనా అడిగినా సమస్యలకు పరిష్కారం అంటూ ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. తాను తెచ్చిన మూడు కోతుల బొమ్మలను ప్రభావతికి ఇస్తాడు.

ఇంట్లో ఏది పడితే అది మాట్లాడకు అని.. మొగుడు, పెళ్లాలు అన్యోన్యంగా ఉంటే చూడటం లేదు కదా అలాంటప్పుడు చూడకు అని.. వాళ్ల మాటలు వినకుండా చెవులు మూసుకో అని ఆ బొమ్మలను ఇస్తాడు. ఇవే ఈ ఇంట్లో సమస్యలకు పరిష్కారం అని చెప్పడంతో ప్రభావతి మండిపడుతుంది. వాళ్ల సమస్యలు చెబితే నేనే ఓ సమస్య అంటారేంటని అంటుంది.

ప్రభావతి కాళ్లపై పడిన మనోజ్.. చితకబాదిన తల్లి

అటు హడావిడిగా ఇంటికి వచ్చిన మనోజ్.. ప్రభావతిని గదిలోకి తీసుకెళ్లి కాళ్లపై పడతాడు. పూర్తిగా మునిగిపోయానమ్మా.. నువ్వే కాపాడాలి అని అంటాడు. అసలు ఏం జరిగిందని ఆమె అడిగితే.. జరిగిన విషయం చెబుతాడు. అది విని ప్రభావతి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అతన్ని చితకబాదుతుంది.

ఇన్ని డిగ్రీలు ఎందుకు రా నీకు.. బయట పడేయ్ అని తిడుతుంది. నువ్వేమైనా అను కానీ రోహిణికి తెలిస్తే నా పరువు పోతుంది అని మనోజ్ అంటాడు. నువ్వే కాపాడాలి అంటూ రూ.4 లక్షలు కావాలని చెబుతాడు. అది విని ప్రభావతి షాక్ తింటుంది. అంత డబ్బు తన దగ్గర లేదని అంటుంది.

మీనా నగలు దొంగతనం చేసిన ప్రభావతి.. నిలదీసిన సత్యం

ఇంటి పత్రాలు ఇస్తే తాకట్టు పెడతానని మనోజ్ అంటాడు. అది అస్సలు చేయనని ప్రభావతి అంటుంది. పోనీ కనీసం నగలైనా ఇవ్వమంటాడు. తన దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయని అంటే.. అవైనా ఇవ్వమని బతిమాలుతాడు. అలా చేస్తే నేను దొంగనవుతానని తల్లి అంటున్నా అతడు పట్టించుకోడు. మీనా ఎలాగూ నిన్ను నగలు అడగదు.. అయినా మళ్లీ నేను విడిపించుకొని తీసుకొస్తానని మనోజ్ అంటాడు.

దీంతో చేసేది లేక తన ఇంట్లోనే దొంగలా మారడానికి ప్రభావతి వెళ్తుంది. మీనా నగలను బీరువాలో నుంచి జాగ్రత్తగా తీసి కవర్ లో వేస్తుంది. తిరిగి బీరువా డోరు మూయకుండా వెళ్తున్న సమయంలో అక్కడికి వచ్చిన సత్యం ఏం చేస్తున్నావని అడగడంతో ఆమె కంగారు పడుతుంది. చూసేశాడా అనుకుంటుంది. కానీ అతడు బీరువా డోరు మూయడం గురించి కావడంతో ఊపిరి పీల్చుకుంటుంది.

అటు మీనా.. బాలు కోసం చేపలు తేవడానికి బయటకు వెళ్లి వస్తుంటుంది. ఇటు ప్రభావతి ఇంట్లో నుంచి వేగంగా బయటకు రావడంతో ఇద్దరూ ఢీకొట్టుకుంటారు. ఆ సమయంలో రెండు కవర్లు తారుమారవుతాయి. మీనా తెచ్చిన చేపల కవర్ తీసుకొని నగల దుకాణానికి వెళ్లిన మనోజ్ బుక్కవుతాడు. ఆ విషయం మనోజ్ ఫోన్ చేసి చెప్పడంతో మీనా దగ్గరున్న కవర్ ప్రభావతి లాక్కొంటుంది. దానిని బాలు బలవంతంగా తల్లి చేతుల్లో నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More