గుండె నిండా గుడి గంటలు: మారిపోయిన బాలు- ప్రభావతి, రోహిణిని ఉతికి ఆరేసిన మీనా- కొత్త రూమ్ తామె కట్టిస్తామని పూలగంప శపథం
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలు తాగొచ్చాడని ప్రభావతి, రోహిణి, శ్రుతి మాటలంటారు. వారిని చెడాముడా ఉతికి ఆరేస్తుంది మీనా. తాగొచ్చినంత మాత్రాన పరువు పోదంటుంది. తెల్లారి పంచె కట్టుకుని దేవుడికి పూజ చేస్తాడు బాలు. కొత్త రూమ్‌ను బాలు, మీనానే కట్టిస్తామని శపథం చేస్తారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తండ్రి సత్యం కొట్టడంతో బాలు తాగి ఇంటికొస్తాడు. మీనా అన్నం తీసుకొచ్చేందుకు వెళ్తుంది. ఇంతలో బాలు పడబోతుంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు. నేను అన్నందుకేగా తాగి వచ్చావ్ అని సత్యం అంటాడు. దానికి కాదని చెప్పు మీనా అని బాలు అంటాడు.

కుక్కతోక వంకరేగా
ఆ మాట నాకే చెప్పొచ్చుగా. నాకు చెప్పనంత పరాయి వాన్ని అయిపోయానా అని సత్యం కుమిలిపోతాడు. అలా ఏం లేదు నాన్న అని బాలు అంటాడు. ఇంతలో ఇంట్లోవాళ్లంతా వస్తారు. బాలు తాగొచ్చాడని ప్రభావతి గొడవ చేస్తుంది. ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు. కుక్క తోక వంకరేగా అని ప్రభావతి అంటుంది.
ఇందాక ఇంత పెద్ద గొడవ చేశాడు. ఇప్పుడు ఇలా బాలు మళ్లీ తాగొచ్చాడు అని శ్రుతి అంటుంది. గొడవ అంతా మీ అమ్మతోనేగా జరిగింది. మీ అమ్మ మాకు డబ్బులివ్వడమేంటీ డబ్బుడమ్మా అని బాలు అంటాడు. మనం కష్టపడుతున్నామని మా అమ్మ సహాయం చేద్దామనుకుంది. కానీ, చెప్పే విధానం సరిగా లేదని శ్రుతి అంటుంది.
ఇదంతా ఆ రూమ్ వల్లే అయింది. మొత్తం డబ్బు నేనే తెచ్చి కడతాను అని బాలు అంటాడు. నీ పెళ్లాం నువ్వు పూలమ్మని డబ్బుతో కట్టిస్తారా అని ప్రభావతి వెటకారంగా అంటుంది. అంటే ఎవరో దానం ఇస్తే తీసుకోవాలా అని మీనా అంటుంది. ఏయ్ అని ప్రభావతి అరిస్తే.. ఏయ్ ఏంటీ ఏయ్.. అత్త మీదకు రివర్స్ అవుతుంది మీనా.
తాగొచ్చినంత మాత్రానా పరువు పోదు
ఆవిడ ఇచ్చిన ఐదు లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎప్పటికీ కట్టరంటా. ఆయన తాగొచ్చాడని, ఇంటి పరువు పోతుందని అంటున్నారు. ఇంటి మర్యాద తాగొచ్చినంత మాత్రానే పోదు శ్రుతి. పదిమందిలో ఆయన (సత్యం) తలదించుకునేలా చేస్తే పోతుంది. తన తండ్రి తల దించుకోకూడదని ఆయన గొడవ చేశారు. ఆయన్ను ఆపేందుకు మావయ్య గారు కొట్టారు. ఆ బాధలో తాగొచ్చారు. ఏమైంది దానికి అని రోహిణి, శ్రుతిని అంటుంది మీనా.
అయినా ప్రభావతి అనడంతో తన మాటలతో ఉతికి ఆరేస్తుంది పూలగంప. రోహిణి, శ్రుతిలకు కూడా ఇచ్చిపడేస్తుంది మీనా. దాంతో అంతా సైలెంట్‌గా ఉండిపోతారు. మరుసటి రోజు ఉదయం బాలు పూర్తిగా మారిపోయి కనిపిస్తాడు. పంచె కట్టుకుని చెవిలో పూలు పెట్టుకుని, నుదుట నామాలు పెట్టుకుని దేవుడికి పూజ చేస్తాడు బాలు.
దేవుడికి హారతి ఇచ్చి గంట మోగిస్తాడు. బాలును అలా చూసి సత్యం ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ప్రభావతి నోరెళ్లబెడుతుంది. అసలు ఏంట్రా ఇదంతా అని సత్యం అడుగుతాడు. తొక్కలో ఫైటింగ్‌లు, పనికి మాలిన వాళ్లతో ఫైటింగ్‌లు చేసి చేసి విసిగిపోయాను నాన్నగారు. ఈ గొడవలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. గొడవలన్నింటికి కారణమైన రూమ్‌ను నేనే ఎప్పుడో వీలున్నప్పుడు కట్టుకుంటాను అని బాలు అంటాడు.
ఆ శపథమే పూర్తి కాలేదు
ఇలాగే నీ భార్య కూడా నువ్వు కొనిచ్చినప్పుడే బంగారం వేసుకుంటానని శపథం చేసింది కదరా అని మనోజ్ అంటాడు. ఆ శపథమే పూర్తి కాలేదు. ఇంకో శపథం ఎందుకులే బాలు అని రోహిణి వెటకారంగా అంటుంది. ఇలా, మనోజ్, రోహిణి ఏదోటి అంటుంటే ఆపండి అని మీనా అరుస్తుంది. వాళ్లిద్దరు కలిసి ఏం వెలగబెట్టారో చెప్పండి అని రివర్స్ పంచులు వేస్తుంది మీనా.
ఏవండి.. రూమ్ కట్టి వీళ్ల నోళ్లు మూయించాలి అని మీనా అంటుంది. దాంతో మనోజ్, రోహిణి అలాగే సైలెంట్‌గా ఉండి చూస్తారు. మీనా శపథంతో ప్రభావత కోపంగా చూస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


