గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా శపథం.. ఇంట్లో వాళ్ల నోళ్లు మూయించాలంటూ పంతం.. బాలు కొత్త అవతారం చూసి..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ లో బాలుని సత్యం కొట్టడం, ఇంట్లో వాళ్లందరూ తిట్టడంతో అతడు ఒంటరి వాడవడం, తప్పతాగి ఇంటికి రావడం.. చివరికి బాలు, మీనా శపథం చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది.

Published on: Oct 24, 2025, 08:09:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 539వ ఎపిసోడ్ మొత్తం ఇంట్లో గది కోసం శోభ పెట్టిన చిచ్చు, ఆ తర్వాత బాలును ఒంటరివాడిని చేసి అందరూ తిట్టడం చూడొచ్చు. దీంతో బాధలో బాలు తప్పతాగి వస్తాడు. అటు సత్యం కూడా కొడుకుపై చేయి చేసుకున్నందుకు ఎంతో బాధపడతాడు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా శపథం.. ఇంట్లో వాళ్ల నోళ్లు మూయించాలంటూ పంతం.. బాలు కొత్త అవతారం చూసి..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా శపథం.. ఇంట్లో వాళ్ల నోళ్లు మూయించాలంటూ పంతం.. బాలు కొత్త అవతారం చూసి..

శోభను మెడ పట్టి గెంటేస్తానన్న బాలు.. చేయి చేసుకున్న సత్యం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ శృతి తల్లి శోభ ఇంట్లో గది విషయంలో చేసే రచ్చతో మొదలవుతుంది. మీ ఆయన దయాదాక్షిణ్యాలేమీ లేవు.. లోన్ తీసుకునే ఈ ఇల్లు కట్టాను అని సత్యం అంటాడు. అయినా శోభ ఏవేవో మాటలు అనడంతో ఆమెపై దూసుకెళ్తాడు బాలు.

ఇంకొక్క మాట మాట్లాడితే మెడ పట్టి ఇంట్లో నుంచి గెంటేస్తానని అంటాడు. ఆ మాటతో సత్యం ఆవేశం కట్టలు తెంచుకొని బాలుపై చేయి చేసుకుంటాడు. ఆమె మన ఇంటి వియ్యపురాలు.. మీ తమ్ముడి అత్తగారు అని బాలుతో అంటాడు. ఆ తర్వాత మీ సాయం అవసరం లేదు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లండని శోభతో అంటాడు.

బాలును నానా మాటలు అన్న ఇంట్లో వాళ్లు

ఏరికోరి ఇలాంటి ఇంటికి వచ్చావు అనుభవించు అంటూ శృతితో చెప్పి శోభ వెళ్లిపోతుంది. అయితే ఆమె పెట్టిన చిచ్చు తర్వాత కూడా కొనసాగుతుంది. ప్రభావతితో మొదలుకొని మనోజ్, రోహిణి, రవి, శృతి.. అందరూ బాలునే నిందిస్తారు. రౌడీయిజం చేస్తున్నావా.. రవి, శృతిని ఇంట్లో నుంచి వెళ్లగొడదామనుకుంటున్నావా.. తల్లికి, భార్యకు విలువ ఇవ్వని మొరటోడులాంటి మాటలు అనడంతో బాలు ఏమీ అనలేక బాధపడుతూ ఉంటాడు.

రవి, శృతి మధ్య గొడవ

ఇక ఆపండి అంటూ సత్యం గట్టిగా అరుస్తాడు. అతని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆమె నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా మాట్లాడింది.. మీ అమ్మ తాను పుట్టింటి నుంచి తీసుకొచ్చానంటున్న ఇల్లు కేవలం హాలు, కిచెన్ మాత్రమే.. మిగతాదంతా లోన్ తీసుకొని కట్టాను.. అత్తారింటి ఆస్తి తీసుకోవడం ఎంత బుద్ధి తక్కువ పనో ఇప్పుడు తెలిసొచ్చింది అని సత్యం అని వెళ్లిపోతాడు.

ఆ తర్వాత గదిలోకి వెళ్లినా బాలు మాటలు తలుచుకొని శృతి రగిలిపోతుంది. అయితే రవి మాత్రం బాలుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. బాలు అన్నయ్య అన్నదాంట్లో తప్పులేదు.. మీ అమ్మ మాట్లాడింది కరెక్టా అని శృతిని నిలదీస్తాడు. తప్పే అని అనడంతో మరి అప్పుడెందుకు మాట్లాడలేదు.. మీ అమ్మతో ఈ ఇంటి విషయాలు చెప్పకు అని గట్టిగా మందలించి వెళ్తాడు.

మీనా దగ్గరికి వచ్చి బాధపడిన సత్యం

అటు మీనా డాబాపై నిల్చొని బాధపడుతూ ఉంటుంది. సత్యం ఆమె దగ్గరికి వచ్చి తాను చేసిన పనికి కుమిలిపోతాడు. భార్య, వదిన, మరదలు ముందే వాడిపై చేయి చేసుకోవడం తన తప్పే అంటాడు. ఆయనను మందలించే అధికారం మీకు ఉంది.. మీపై ఎలాంటి కోపం లేదు అని మీనా అంటుంది. బాలు ఎక్కడికి వెళ్లాడు అని అడిగితే.. తెలియదు అని చెబుతుంది.

తాగి ఇంటికి వచ్చిన బాలు.. తండ్రితో మాట్లాడకుండా..

అటు బాలు రాజేష్ తో కలిసి ఫుల్లుగా తాగుతాడు. ఇంట్లో జరిగిన గొడవ విషయంలో బాధ పడతాడు. మా నాన్న కొట్టడం కంటే కూడా ముగ్గురు కొడుకులం ఉన్నా కూడా ఒక్క గది కట్టించలేకపోతున్నామని బాలు బాధపడతాడు. అందరూ సంస్కారం ముసుగులో మాట్లాడకున్నా ఉన్నా.. తాను మాత్రం తన తండ్రిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయానని బాలు అంటాడు.

ఆ తర్వాత తప్పతాగి ఇంటికి వెళ్తాడు. మీనా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నం పెడతాను రండి అని బాలుకి చెప్పి వెళ్తుంది. అతడు తూలి పడిపోతుండగా సత్యం వచ్చి పట్టుకుంటాడు. కానీ అతనితో బాలు మాట్లాడడు. దీంతో సత్యం మరింత బాధపడతాడు.

మరుసటి రోజు ఉదయం బాలు ఉదయాన్నే లేచి, స్నానం చేసి పూజ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ తొక్కలో గొడవలు అవసరం లేదు.. మాకు చేతనైనప్పుడు ఆ రూమ్ మేమే కట్టించుకుంటాం అని బాలు అంటాడు. ఇలాగే నీ భార్య కూడా నువ్వు తెచ్చిన తర్వాతే నగలు వేసుకుంటానని శపథం చేసింది.. ఇప్పటి వరకూ అదే నెరవేరలేదు.. ఇక ఇప్పుదు రూమా అంటూ మనోజ్, రోహిణి ఎగతాళి చేస్తారు. దీంతో రూమ్ కట్టాల్సిందే అని బాలుతో అంటూ మీనా శపథం చేస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More