గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతి తల్లికి మీనా చురకలు- పండుగ పూట తాగొచ్చిన బాలు- ప్రభావతికి ఇచ్చిపడేసిన మీనా
గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 23 ఎపిసోడ్‌లో బాలు, మీనాకు తన విషయం తెలియలేదని రోహిణి సంతోషిస్తుంది. ఇంటిల్లిపాది కలిసి పూజ చేసి, క్రాకర్స్ కాల్చి, భోజనం చేసి కూర్చొంటారు. శ్రుతి తల్లి శోభన వచ్చి బెడ్ రూమ్ గురించి ఐదు లక్షల చెక్ ఇస్తుంది. దానికి మీనా చురకలు వేస్తుంది. బాలు పంచ్‌లు వేస్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విద్య ఇంట్లో ఉన్న రోహిణికి మనోజ్ కాల్ చేస్తాడు. ఇంతకాలం ఆడిన నాటకానికి తెర దించేయ్. వాళ్లు అడక్కముందే నిజం చెప్పేయ్ అని విద్య అంటుంది. మరోవైపు బాలు, మీనా కోసం సత్యం ఎదురుచూస్తాడు. ప్రభావతి ఏదో ఒకటి అంటుంది. రోహిణి కూడా లేదని, ఫోన్ కట్ చేస్తుందని మనోజ్ అంటాడు.

అత్తింటికి వెళ్లినట్లు
ఇంతలో బాలు, మీనా వస్తారు. పూలు ఇవ్వడానికి వెళ్లినట్లు మీనా చెబుతుంది. దాంతో ప్రభావతిని శ్రుతి అంటుంది. నేను అత్తింటికి వెళ్లాలని చెప్పిందా అని బాలు అంటే.. అబ్బా ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువులను ఇప్పుడు చూస్తున్నాను అని శ్రుతి అంటుంది. ఇద్దరు ఉంటే నోము చేయిస్తానన్నావ్‌గా అమ్మా చేయించు అని రవి అంటాడు. ఏంటీ గొప్పింటి ఇద్దరు కోడళ్లతోనే పూజ చేయిస్తానందా అని బాలు అంటాడు.
అవును అన్నయ్య అని రవి అంటాడు. చూశావా నాన్న అమ్మ అసలు స్వరూపం అని బాలు అంటాడు. పూలకొట్టి, పార్లర్ ఒక్కటేనా అని ప్రభావతి అంటే.. కాదు. మీనా ఓనర్. పార్లరమ్మా ఒకరి కింద పనిచేస్తుంది అని బాలు అంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. బాలు అంతా చెప్పేశాడు అని భయపడుతుంది. బాలు డైనింగ్ టేబుల్‌ను కోర్ట్ బోన్ పెట్టకముందే నిజం ఒప్పుకోవడం మంచిది అని లోపలికి వస్తుంది రోహిణి.
పార్లర్‌కు ఒకరి కింద పనిచేయడానికి వెళ్లావా. చెప్పు పార్లరమ్మా అని బాలు నిలదీస్తాడు. నా భార్యను నిలదీస్తావేంట్రా అని మనోజ్ అంటే ఇందాకా నా భార్యను అంటే ఏమైందిరా ఆ నోరు అని బాలు అంటాడు. సరే కాళ్లు కడుకుని రండని సత్యం చెబుతాడు. ముగ్గురు కోడళ్లు వెళ్లిపోతారు. బాలు నిజం చెప్పలేదా. బాలు నోట్లో ఏది ఆగలేదే. అది కూడా నా గురించి అని రోహిణి అనుకుంటుంది.
నా గొడవకి సంబంధం లేదా
వెళ్లి బాలు, మీనా మాట్లాడుకుంటుంటే చాటుగా వింటుంది రోహిణి. అక్కడి విషయం మర్చిపోతానని మాటిచ్చారు. మర్చిపోయారా అని మీనా అంటుంది. అందుకే సైలెంట్‌గా ఉన్నా అని బాలు అంటాడు. ఏమని చెబుతారు. దారిలో ముసలావిడను గుద్దితే పోలీస్‌లకు పట్టించానని, ఆ కోపంతో నన్ను కిడ్నాప్ చేశారని చెబుతారా అని మీనా అంటుంది. అది విన్న రోహిణి వీళ్ల గొడవకి నా గొడవకి సంబంధం లేదా అని రోహిణి సంతోషిస్తుంది.
నా గురించి తెలియదన్నమాట. ఇక రిలాక్స్ అవ్వొచ్చు అని రోహిణి అనుకుంటుంది. నువ్వు మీనావి కాదు నా ముద్దుల సత్యభామవి అని బాలు పొగుడుతాడు. అంతా నోముకు కూర్చుంటారు. ప్రభావతి చెప్పినట్లుగా ముగ్గురు కోడళ్లు పూజ చేస్తారు. తర్వాత అంతా క్రాకర్స్ కాలుస్తుంటారు. అనంతరం అంతా కలిసి భోజనం చేస్తారు. మనోజ్‌కు లడ్డు పెడతాడు బాలు.
సత్యం, ప్రభావతి ఒకరినొకరు తినిపించుకుంటారు. శ్రుతి తల్లి శోభన సత్యం ఇంటికి వస్తుంది. అంతా నవ్వుతుంటే ఈ నవ్వులు ఇంకాసేపటి తర్వాత ఉండనివ్వను అని శోభన అనుకుంటూ హ్యాపీ దీపావళి చెబుతుంది. శ్రుతి ఇక్కడే దీపావళి చేసుకోవాలని ఆశపడిందని శోభన అంటే.. అక్కడ మీరిద్దరే, ఇక్కడ ఇందరం ఉన్నామని రవి అంటాడు.
బెడ్ రూమ్ కట్టిస్తున్నారని
ఈ ఇందరి నుంచి మీ ఇద్దరిని వేరు చేయడమే నా ఉద్దేశం అని మనసులో అనుకుంటుంది శోభన. కానీ, చాలా ఇరుకుగా ఉందిగా. ఎలా సర్దుకుంటున్నారు. బెడ్ రూమ్ గురించి రోజుకో గొడవ అవుతుందని విన్నాను. పైన బెడ్ రూమ్ కూడా కట్టిస్తున్నారని విన్నాను అని శోభన అంటుంది. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందే అని సత్యం అంటాడు.
నాకు తెలియని పరిస్థితి మీది. అప్పట్లో ఇంటి పని చేయించుకోడానికి లోన్‌కు అప్లై చేస్తే మా ఆయనేగా లోన్ సాంక్షన్ చేయించంది. లేకుంటే ఈ మాత్రం ఇల్లు కూడా ఉండేది కాదు అని శోభన అంటుంది. దాంతో అందరికి కోపం వస్తుంది. ఆ లోన్ కూడా మీ ఆయన తీర్చారా మా మావయ్య తీర్చారా అని చురకలు వేస్తుంది మీనా. అబ్బో మీ తోటి కోడలు మంచి ప్రశ్నే అడిగిందని శోభన అంటుంది.
ఇప్పుడు జరగాల్సింది చూడండి. రూమ్ కట్టాలంటే ఎలాగు ఐదు లక్షల వరకు అవుతుంది. మా వంతు సాయంగా ఐదు లక్షల చెక్ తీసుకొచ్చాను. ఇదిగోండి వదిన గారు అని శోభన అంటుంది. ప్రభావతి సంతోషంగా తీసుకోవాలని సత్యంను చూస్తుంది. సత్యం ఆగ్రహంతో చూస్తాడు. మమ్మీ నేనేం నిన్ను సాయమడగలేదుగా అని శ్రుతి అంటుంది.
మీ పరిస్థితి తెలియదా
నువ్వు నోరు తెరిచి అడగాలా. మీ ఇంటి పరిస్థితి తెలుసుగా. వదిన తీసుకో అని శోభన అంటుంది. ఆగిపోయావేంటమ్మా తీసుకో అని బాలు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఐదు లక్షలతో మంచి రూమ్ కట్టించొచ్చు. రూమ్ కట్టిస్తే ఆవిడ, ఆవిడ భర్త గారు వచ్చి మన ఆ రూమ్‌లోనే ఉంటారు అని బాలు పెద్ద తిరకాసు పెడతాడు. మేమెందుకు ఉంటాం బాలు అని శోభన అంటుంది.
ఇప్పుడే కదా మనమంతా ఒక్కటే ఫ్యామిలీ అన్నారుగా అని బాలు అంటాడు. బాలు నువ్వు ఆగు. నా బ్యాంక్ లోన్ మీ ఆయన సాంక్షన్ చేయించలేదు. లోన్‌కు ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్ అడిగితే నెల రెండు నెలలు తిప్పించుకుని పై ఆఫీసర్‌తో ఫోన్ చేయిస్తే అప్పుడు ఇచ్చారు అని సత్యం అంటాడు. తర్వాత బాలు తాగి ఇంటికొస్తాడు. దానికి అంతా బాలును అంటారు.
మీ అమ్మ మాకు డబ్బులు ఇవ్వడమేంటీ డబ్బుడమ్మా. ఆ ఐదు లక్షలు నేనే ఇస్తాను అని బాలు అంటాడు. పూలమ్మీ ఇస్తారా అని ప్రభావతి అంటుంది. ఆవిడ ఇస్తే తీసుకుంటారా అని మీనా అంటుంది. ఏయ్ అని ప్రభావతి అంటే.. ఏయ్ ఏంటీ ఏయ్.. ఆవిడ ఇస్తే తప్ప రూమ్ కట్టలేమని చెప్పింది. తాగితేనే ఇంటి పరువు పోదు శ్రుతి. ఆయన (సత్యం)కు అవమానం జరిగిన పోతుంది అని ఇచ్చిపడేస్తుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


