గుండె నిండా గుడి గంటలు: రోహిణికి బదులు మీనా కిడ్నాప్- కొంపముంచిన సత్యం కొనిచ్చిన ఎర్ర చీర- దినేష్ ప్రతికారం- బాలు వేట
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సత్యం ఇంట్లో దీపావళి పండుగ సందడి నెలకొంటుంది. ఇంట్లో అందరికి సత్యం బట్టలు తీసుకొస్తాడు. రోహిణికి కాల్ చేసిన దినేష్ లక్ష రూపాయలు ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. విద్య ఇంటికి రోహిణి వెళ్తే ఎర్ర చీరలో ఉన్న మీనాను రోహిణి అనుకుని రౌడీలు కిడ్నాప్ చేస్తారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రభావతికి బాలు కాఫీ ఇవ్వకుండా ఊరిస్తాడు. దాంతో శాపం పెడుతుంది ప్రభావతి. ఇంతలో శ్రుతి తల్లి కాల్ చేసి దీపావళి పండుగకు ఇంటికి రమ్మంటుంది. నాకు చెప్పడం మర్యాద. నేను రాను. నువ్వు వెళ్లు అని రవి అంటాడు.

ప్రభావతికి మీనా చురకలు
మా అత్తగారు నాకే ఫోన్ చేసి రమ్మంటారు అని బాలు చెబితే ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. మేమంతా ఈ ఇంట్లో పడి తింటున్నామంటూ ప్రభావతికి చురకలు వేస్తుంది మీనా. ఇంతలో సత్యం వచ్చి ఏమైందని అడుగుతాడు. అమ్మకు మీనా చురకలు వేస్తుందని బాలు అంటాడు. అప్పుడప్పుడు ఆ చురకలు వేయకుంటే ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు అని సత్యం మీనాకు సపోర్ట్ చేస్తాడు.
దీపావళి పండుగ రోజున ఇల్లు ముంగిట అందంగా ముగ్గు వేస్తుంది మీనా. మనోజ్, రవి పూలదండలు కడతారు. తర్వాత సత్యం ఇంటికి బ్యాగ్‌తో వస్తాడు. ఏంటీ నాన్న అవన్నీ అని బాలు అంటే పండుగ కదరా.. అందరికి నా చేత్తో బట్టలు తెచ్చాను అని అందరికి ఇస్తాడు సత్యం. కొడుకులకు షర్ట్, ప్యాంట్‌లు, కోడళ్లకు ఒకే కలర్ ఎర్రచీరలు తీసుకొస్తాడు సత్యం.
ఆ బట్టలు వేసుకుని బాలు, మనోజ్, రవి వస్తారు. తర్వాత ఏర్ర చీర కట్టుకుని ముగ్గురు కోడళ్లు రోహిణి, మీనా, శ్రుతి కిందకు వస్తారు. వాళ్లను చూసి సంతోషిస్తాడు సత్యం. ఆహా.. ఆకాశం నుంచి ముగ్గురు అమ్మలు దిగొచ్చినట్లుంది అని సత్యం అంటాడు. దానికి రోహిణి, మీనా, శ్రుతి సంతోషిస్తారు. దేవుడికి పూజ చేసిన ప్రభావతి అందరికి హారతి ఇస్తుంది.
రోహిణికి దినేష్ వార్నింగ్
అంతా హారతి తీసుకుంటారు. మరోవైపు రోహిణి తనకు చేసింది తలుచుకుని రగిలిపోతాడు దినేష్. రోహిణిని ఏదోటి చేయాలని, లేదా డబ్బులు బాగా గుంజాలని అనుకుంటాడు. రోహిణికి దినేష్ కాల్ చేస్తాడు. కానీ, రోహిణి కాల్ కట్ చేస్తుంది. దినేష్ అదేపనిగా కాల్ చేస్తూనే ఉంటాడు. దాంతో వేరే నెంబర్ నుంచి రోహిణికి దినేష్ కాల్ చేస్తాడు.
తన పేరు చెప్పి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏంటీ అని దబాయిస్తాడు దినేష్. పోలీసులతో కొట్టించిన బుద్ధి రాలేదా అని రోహిణి అంటుంది. నన్నే పోలీసులకు పట్టించి కొట్టిస్తావా. ఇంత చేసిన నీకు పెనాల్టీ వేస్తున్నాను. లక్ష రూపాయలు కావాలి నాకు. తీసుకుని రా అని దినేష్ ఫోన్‌లో అరుస్తాడు.
లక్ష రూపాయలు కాదు కదా రూపాయి కూడా ఇవ్వను అని రోహిణి తెగేసి చెబుతుంది. అవునా, మీ అత్తగారింటికి వచ్చి నీ కాపురాన్ని ముక్కలు చేస్తాను అని బెదిరిస్తాడు దినేష్. దాంతో రోహిణి తెగ భయపడిపోతుంది. దాంతో తన ఫ్రెండ్ విద్య ఇంటికి వెళ్తుంది రోహిణి. దినేష్ వార్నింగ్ ఇచ్చిదంతా చెబుతుంది. నా కాపురం నిలబడాలంటే వాడు అడిగిన లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని రోహిణి బాధగా చెబుతుంది.
రోహిణిని ఫాలో అయిన రౌడీ
అయితే, రోహిణి ఫాలో చేయడానికి రౌడీలను పెడతాడు దినేష్. రోహిణిని ఫాలో అయిన ఓ రౌడీ వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో ఉందని దినేష్‌కు చెబుతాడు. దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి అని రౌడీలకు చెబుతాడు దినేష్. ఎర్ర చీర కట్టుకుని ఉంటుంది. బయటకు రాగానే ఎత్తుకొచ్చేయండి అని మిగతా రౌడీలకు చెప్పి రోహిణిని చూసిన రౌడీ వెళ్లిపోతాడు.
ఇదంతా జరిగిలోపే విద్య దగ్గరికి మీనా వెళ్తుంది. మీనా రావడంతో రోహిణి దాక్కుంటుంది. విద్యతో మాట్లాడిన తర్వాత మీనా బయటకు వస్తుంది. మీనాను ఎర్రచీరలో చూసిన రౌడీలు రెడ్ కలర్ సారీలో ఉంది తనే అని అనుకుంటారు. ఇంతలో మీనాకు బాలు కాల్ చేస్తాడు. ఏం పూలగంప ఎక్కడున్నావ్ అని బాలు అడుగుతాడు.
మీనా చెప్పేలోపే రౌడీలు వచ్చి తనే రోహిణి అనుకుని కిడ్నాప్ పట్టుకెళ్తారు పట్టుకుంటారు. ఎవర్రా మీరు వదలండి అని మీనా గింజుకుంటుంది. అదంతా బాలు ఫోన్‌లో వింటూ ఏమైందని అరుస్తాడు. మీనాను కారు డిక్కీలో పడేసి కిడ్నాప్ చేస్తారు రౌడీలు. బాలు కంగారు పడుతుంటాడు. సత్యం కొనిచ్చిన ఎర్ర చీర కొంప ముంచుతుంది.
రోహిణికి బదులు మీనా కిడ్నాప్
రోహిణి అనుకుని ఎర్ర చీరలో ఉన్న మీనాను కిడ్నాప్ చేస్తారు రౌడీలు. ఇక పూలగంప మీనా కోసం బాలు వేట (వెతకటం) ప్రారంభిస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


