గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు దొరికిపోయిన మాణిక్యం.. ఇరుక్కున్న రోహిణి.. మనోజ్ షాపులో బాలుకి అవమానం

గుండె నిండా గుడి గంటలు బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్ లో రోహిణి మరింత ఇరుక్కుంటుంది. మాణిక్యాన్ని చూసి మీనా వెంటపడటం, అతడు మనోజ్ షాపుకే వెళ్లడంతో ఈ ఎపిసోడ్ అంతా చాలా ఉత్కంఠగా సాగింది. తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Oct 15, 2025 7:57 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 532వ ఎపిసోడ్ మొత్తం రోహిణి, మాణిక్యం, మీనా, బాలు చుట్టూనే తిరిగింది. మాణిక్యం విషయంలో రోహిణి ఇంట్లో వాళ్లకు దొరికిపోయేలా కనిపించింది. అయినా మీనాలో అనుమానం మొదలవుతుంది. దీంతో రోహిణి కొత్త నాటకం మొదలుపెడుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు దొరికిపోయిన మాణిక్యం.. ఇరుక్కున్న రోహిణి.. మనోజ్ షాపులో బాలుకి అవమానం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు దొరికిపోయిన మాణిక్యం.. ఇరుక్కున్న రోహిణి.. మనోజ్ షాపులో బాలుకి అవమానం

మీనాకు రోహిణి ఫోన్.. పూలు ఆర్డర్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్ షాపులో వర్కర్స్ కు మనోజ్ క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. కస్టమర్లను వదిలేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చొన్న వర్కర్స్ కు మనోజ్ క్లాస్ పీకుతాడు. వాళ్ల బట్టలు నీట్ గా లేవని తిడతాడు. ఐరన్ చేసుకేనేంత స్థోమత తమకు లేదని వాళ్లు అంటారు. దీంతో అందరికీ ఒక్కో ఐరన్ బాక్స్ ఇచ్చి వచ్చే జీతంలో కట్ చేస్తాననడంతో వాళ్లు షాక్ తింటారు.

అటు రోహిణి దగ్గరికి విద్య వస్తుంది. మనోజ్ పరువు తీసేలా మాట్లాడుతుంది. దీంతో మనోజ్ కూడా కొత్త బిజినెస్ ప్లాన్ అంటూ బయట బొమ్మలా విద్యను నిలబెడదామని అంటాడు. తాను దేవుడి ఫొటోను తీసుకొచ్చానని, రోజూ పూజ చేయాలని అనడంతో మీనాకు రోహిణి ఫోన్ చేస్తుంది. పూలు ఆర్డర్ ఇవ్వడంతోపాటు పూజ చేయడానికి రావాలని పిలుస్తుంది. ఆమె సరే అంటుంది.

బీరువా కోసం మనోజ్ షాపుకి బాలు, రాజేష్

అటు మనోజ్, అతని ఫ్రెండ్ రాజేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లోకి ఓ బీరువా కావాలని తన భార్య పోరు పెడుతోందని రాజేష్ అంటాడు. కానీ తన దగ్గర డబ్బులు లేవని చెబుతాడు. దీంతో బాలు తాను బీరువా ఇప్పిస్తానని, ఈఎంఐలో తీసుకోమని అంటాడు. తన అన్న మనోజ్ ఫర్నీచర్ షాపు పెట్టాడు కదా.. అక్కడ బీరువాలు కూడా ఉంటాయి అక్కడికి వెళ్దామంటూ రాజేష్ ను తీసుకొని వెళ్తాడు.

మలేషియా మామయ్య వెంట పడిన మీనా..

అటు మీనాకు రోడ్డుపై మాణిక్యం కనిపిస్తాడు. ఇతడేంటి మలేషియా మామయ్యలా ఉన్నాడనుకుంటుంది. ఆమెను చూసిన మాణిక్యం అక్కడి నుంచి పారిపోతాడు. మీనా తన బండిపై అతని వెంట పడుతుంది. చూసీ చూడనట్లు అతడు వెళ్లిపోతాడు. అటు ఇటూ తప్పించుకొని తిరుగుతూ చివరికి రోహిణి షాపుకే వస్తాడు మాణిక్యం. దీంతో అతన్ని చూసి రోహిణి, విద్య షాక్ తింటారు.

రోహిణి షాపుకే మీనా.. బీరువాలో దాక్కున్న మాణిక్యం

నువ్వేంటి ఇక్కడ అని మాణిక్యాన్ని నిలదీస్తారు రోహిణి, విద్య. మీ తోటికోడలు తనను చూసిందని, పారిపోయి వచ్చానని అంటాడు. అప్పుడే మీనా కూడా షాపుకి వస్తుంది. దీంతో రోహిణి మరింత కంగారు పడుతుంది. అతన్ని ఎక్కడో ఓ చోట దాచేయాలని విద్యకు చెబుతుంది.

దీంతో మాణిక్యం వెళ్లి అక్కడ ఉన్న ఓ బీరువాలో దాక్కొంటాడు. ఈలోపు మీనా లోనికి వస్తుంది. మలేషియా మామయ్యను చూశానని అంటుంది. రోహిణి కంగారు పడుతూ ఆయన ఇక్కడ ఎందుకు ఉంటాడు మలేషియాలో ఉన్నాడని చెబుతుంది. లేదు అతడు రాజమండ్రిలోనే ఉన్నాడని మీనా చెప్పినా రోహిణి విననట్లుగా నటిస్తుంది.

షాపుకి వచ్చిన బాలు, రాజేష్..

అటు మనోజ్ షాపుకి బీరువా కోసం బాలు, రాజేష్ వస్తారు. పూజ చేసి వెళ్లిపోతున్న మీనాకు ఎదురుపడతారు. బాలుని చూసిన రోహిణి ఆందోళన మరింత పెరుగుతుంది. రాజేష్ కు బీరువా కోసం వచ్చానని బాలు అంటాడు. మనోజ్ కూడా వస్తాడు. ఇంతలో మాణిక్యం దాక్కున్న బీరువానే కావాలని రాజేష్ చెబుతాడు. ఆ బీరువా తనకు బాగా నచ్చిందంటాడు. కానీ విద్య, రోహిణి కంగారు పడుతూ అది తప్ప ఇంకేదైనా సెలెక్ట్ చేసుకో అంటారు.

ఎందుకని అడిగితే ఈ బీరువా విద్యకు బాగా నచ్చిందని, ఆమె కొంటుందని రోహిణి అంటుంది. ఎవరు పూర్తిగా డబ్బు ఇస్తారో వాళ్లకు బీరువా ఇస్తానని మనోజ్ అంటాడు. రాజేష్ వాయిదాల్లో ఇస్తాడని బాలు అనడంతో విద్య మొత్తం ఒకేసారి ఇస్తుందని రోహిణి అంటుంది. దీంతో ఆమెకే ఇస్తానని మనోజ్ అనడంతో బాలు, రాజేష్, మీనా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

రోహిణికి ధైర్యం చెప్పి వెళ్లిన మాణిక్యం

ఆ తర్వాత మనోజ్ ను కూడా డీలర్ దగ్గరికి వెళ్లమని రోహిణి పంపించేస్తుంది. ఆ తర్వాత మాణిక్యం బయటకు వచ్చి రోహిణికి క్లాస్ పీకుతాడు. రాజమౌళి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అబద్ధం చెప్పావు కదా.. నువ్వు ఏదో సమస్యలో ఉన్నావని అర్థమవుతోంది.. ఇప్పుడు తప్పించుకున్నారు కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. విద్య నాకు ఎంతో సాయం చేసింది.. అందుకే మీకు సాయం చేస్తాను. కానీ ఓ కళాకారుడికి అబద్ధం చెప్పి ఇలా వాడుకోకండి అని చెప్పి మాణిక్యం వెళ్లిపోతాడు.

మీనాలో మొదలైన అనుమానం.. రోహిణి కొత్త నాటకం

అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీనాలో అనుమానం మరింత ఎక్కువవుతుంది. మాణిక్యం తనను చూసి పారిపోవడం, రోహిణి కంగారు పడటం గుర్తుకు తెచ్చుకుంటుంది. అటు బాలు ఇంటికి వచ్చి షాపులో తనకు జరిగిన అవమానం గురించి చెబుతున్నా పట్టించుకోదు.

మాణిక్యం గురించి మీనా ఇంట్లో చెప్పడంతో రోహిణి కొత్త నాటకం మొదలుపెడుతుంది. మాణిక్యానికి వీడియో కాల్ చేసి అతడు దుబాయ్ లో ఉన్నట్లుగా చెబుతుంది. కానీ బాలు మాత్రం మీ లొకేషన్ పంపించండి అంటూ అతన్ని ఇరుకునపెడతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు దొరికిపోయిన మాణిక్యం.. ఇరుక్కున్న రోహిణి.. మనోజ్ షాపులో బాలుకి అవమానం
News/Entertainment/గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు దొరికిపోయిన మాణిక్యం.. ఇరుక్కున్న రోహిణి.. మనోజ్ షాపులో బాలుకి అవమానం