గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోడ్డుపైనే బాలుకి మీనా ముద్దు.. రెండుసార్లు మోసపోయిన మనోజ్.. మళ్లీ లక్షలు లాస్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ లో మనోజ్ మరోసారి దారుణంగా మోసపోతాడు. ఫర్నీచర్ తోపాటు లక్షలు నష్టపోతాడు. అటు ఇంట్లో గది కోసం ప్లాన్ చేస్తున్న బాలుకి రోడ్డుపైనే మీనా ముద్దు పెడుతుంది.

Published on: Oct 28, 2025, 08:17:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 541వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా, బాలు రొమాన్స్ తోపాటు భార్య శృతి కాళ్లు రవి పట్టడం, అటు రోహిణితో రొమాన్స్ ఆఫర్ ను కాదనుకొని షాపులోనే ఉన్న మనోజ్ దారుణంగా మోసపోయి లక్షలు కోల్పోవడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోడ్డుపైనే బాలుకి మీనా ముద్దు.. రెండుసార్లు మోసపోయిన మనోజ్.. మళ్లీ లక్షలు లాస్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోడ్డుపైనే బాలుకి మీనా ముద్దు.. రెండుసార్లు మోసపోయిన మనోజ్.. మళ్లీ లక్షలు లాస్

రూమ్ విషయంలో బాలు, మీనా చర్చ

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ బాలు, మీనా గది విషయంలో చర్చించుకునే సీన్ తో మొదలవుతుంది. శపథం చేసి వచ్చావు కదా.. మరి గది ఎలా కడదామని మీనాతో బాలు అంటాడు. కొత్త కారు కొని అద్దెకు ఇద్దాం.. దానితో వచ్చిన డబ్బుతో చిట్టీ కడదాం.. ఆ డబ్బుతో గది కట్టుకుందాం అని అంటుంది. కారు కొనడానికి డబ్బు ఎలా అని బాలు అడిగితే.. అత్తయ్యకి ఇచ్చిన బంగారం తాకట్టు పెడదామని మీనా అంటుంది. మొహాన కొట్టిన నగలు ఎలా అడుగుతావని అంటే.. నా కోసం కాదు కదా అని మీనా చెబుతుంది.

షాపులో మనోజ్, రోహిణి రొమాన్స్

అటు షాపులోనే మనోజ్, రోహిణి రొమాన్స్ నడుస్తుంది. బాంబే నుంచి వచ్చిన తెలిసిన వాళ్లు రిసార్టులో పార్టీ ఇస్తున్నారని, మనకు ఇన్విటేషన్ వచ్చిందని, మనకు ప్రత్యేకంగా గది కూడా ఇస్తారని మనోజ్ తో రోహిణి చెబుతుంది. రాత్రంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది. మొదట షాపు గురించి ఆలోచించిన మనోజ్ తర్వాత సరే అని చెబుతాడు.

అయితే అప్పుడే మనోజ్ కు ఓ ఫోన్ వస్తుంది. తాము కట్టే అపార్ట్‌మెంట్లో 10 ఫ్లాట్స్ కి ఫర్నీచర్ కావాలని అవతలి వ్యక్తి అంటాడు. రేపే మొత్తం డబ్బు ఇచ్చి ఫర్నీచర్ తీసుకెళ్తామని చెబుతాడు. దీంతో మనోజ్ ఎగిరి గంతేసి ఒకేసారి మనకు రూ.లక్ష లాభం వస్తుందని రోహిణితో అంటాడు. రిసార్ట్ ప్లాన్ క్యాన్సిల్ చేస్తాడు.

గది కోసం బాలు ఇటుకలు.. రోడ్డుపైనే మీనా ముద్దు

ఇటు గది కోసం బాలు ఇటుకలు తీసుకొస్తాడు. తన కస్టమర్ ఇటుకల వ్యాపారి అని, డ్రాప్ చేసిన తర్వాత డబ్బు బదులు ఇటుకలు తీసుకున్నట్లు మీనాతో చెబుతాడు. ప్రతిసారీ ఇలాగే చేసి గది కోసం ఇటుకలు సిద్ధం చేద్దామని అంటాడు. అటు మీనా తన కస్టమర్ సిమెంట్ వ్యాపారి అని, తానూ అలాగే చేస్తానని అంటుంది. తన కోసం గది కడుతున్న బాలుకి నడిరోడ్డుపై మీనా ముద్దు పెడుతుంది. ఇటుకలు తెస్తేనే ముద్దు పెడుతున్నావంటే.. గది కడితే ఇంకా ఏం చేస్తావో అని అంటాడు.

ప్రభావతి ఎగతాళి.. రూమ్ ప్లాన్ చేసేసిన బాలు, మీనా

ఆ తర్వాత ఇటుకలు లోనికి తీసుకొస్తున్న బాలు, మీనాలను చూసి ప్రభావతి ఎగతాళి చేస్తోంది. ఈ మాత్రం ఇటుకలతోనే గది కట్టేస్తారా అని అడుగుతుంది. తొలి అడుగు ఒంటరే.. తొలి ఇటుక ఒక్కటే అంటూ బాలు ఓ కవిత్వం చెబుతాడు. తాను గది కడతానని, మీనా రిబ్బన్ కడుతుందని, నువ్వే కట్ చేయాలని సత్యంతో బాలు అంటాడు. మరి నేనేం చేయాలని ప్రభావతి అడిగితే.. ఆ రిబ్బన్లతో జడలేసుకొని తిరుగు అని చెప్పి బాలు వెళ్లిపోతాడు.

తర్వాత పైన రూమ్ కట్టినట్లుగా బాలు, మీనా ఊహించేసుకుంటారు. ఆ గదిలో ఏది ఎక్కడ ఉండాలో కూడా ప్లాన్ చేస్తారు. తమకంటూ గది వస్తే ఏం చేయాలో కూడా అప్పుడే ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇద్దరూ కాసేపు మళ్లీ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు.

మనోజ్‌కు బ్లాక్ మనీ ఆఫర్

ఇటు మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ కొత్త కస్టమర్ కోసం ఎదురు చూస్తుంటాడు. వాళ్లు రాగానే డబ్బు తెచ్చేశాం.. ఫర్నీచర్ రెడీగా ఉంటే ఇప్పుడే తీసుకెళ్లిపోతాం అని అంటారు. బిల్లు రెడీ చేస్తామని మనోజ్ అంటే.. బిల్లు వద్దని అంటారు. దీంతో తనకు బ్లాక్ మనీ ఇస్తారా అని మనోజ్ అడుగుతాడు. బిజినెస్ లో ఇలాంటివి కామనే అని, మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి కూడా సమస్య రాదని వాళ్లు అనడంతో భారీ ఆఫర్ వద్దనలేక మనోజ్ సరే అంటాడు.

భార్య కాళ్లు పట్టిన రవి.. చూసేసిన ప్రభావతి

ఇటు ఇంట్లో శృతి బాగా అలిసిపోయి వస్తుంది. తన కాళ్లు పట్టమని రవిని అడుగుతుంది. సరే అని అతడు ఆమె కాళ్లు పడతాడు. అప్పుడే ప్రభావతి చూస్తుంది. ఆ తర్వాత నెయిల్ పాలిష్ కూడా పెట్టమని రవిని శృతి అడుగుతుంది. తనకు రాదని చెబుతున్నా.. ఏం కాదు పెట్టమంటుంది. అది కూడా చూసిన ప్రభావతి లోనికి వెళ్లి ఏం చేస్తున్నావమ్మా.. మరీ ఇలా కాళ్లు పట్టించుకొని, నెయిల్ పాలిష్ పెట్టించుకోవడం ఏంటని అడుగుతుంది.

అది చూసి బాలు కూడా తల్లి ముందే మీనా కాళ్లకు నెయిల్ పాలిష్ పెడతాడు. దీంతో ప్రభావతికి మరింత మండుతుంది. అటు షాపులో మనోజ్ దగ్గరికి విజిలెన్స్ నుంచి వచ్చామని, మీ దగ్గర నకిలీ నోట్లు ఉన్నాయని సమాచారం వచ్చిందని అంటారు. ఉదయం కస్టమర్లు ఇచ్చిన ఆ డబ్బును తీసుకొని వెళ్లిపోతారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫర్నీచర్ తెచ్చుకోవాలని చెబుతారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఫర్నీచర్ తీసుకెళ్లింది.. తర్వాత డబ్బు తీసుకెళ్లింది ఇద్దరూ దొంగలే అని, రెండుసార్లు మోసపోయావని ఎస్సై చెప్పడంతో మనోజ్ లబోదిబోమంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More