గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ లక్ష లాభంతో రోహిణి గోవా ప్లాన్- సుశీల 75వ బర్త్ డే- కరిగిపోయిన మీనా నగలు
గుండె నిండా గుడి గంటలు నవంబర్ 3 ఎపిసోడ్‌లో మనోజ్ లక్ష లాభం సంపాదించడని ఇంట్లో అందరికి చెబుతూ షో చేస్తుంది రోహిణి. దాంతో రోహిణి గోవా ప్లాన్ చేస్తుంది. సుశీల 75వ బర్త్ డే రావడంతో ఇంట్లో వేడుకలు చేయాలనుకుంటారు. ప్రభావతికి తాకట్టు పెట్టిన మీనా నగలను కరిగించారని చెబుతాడు మనోజ్. ప్రభావతి వణికిపోతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన చేపల పులుసు తినడానికి రెడీ అవుతారు. ప్రభావతిని మీనా రమ్మంటుంది. ఇంతలో మనోజ్ వస్తాడు. బయటకు వెళ్లి మాట్లాడుతారు. ఇచ్చావా, తెచ్చావా, సమస్య రాదుగా అని ప్రభావతి అంటే.. నాకైతే రాదు. అదే మనకేం రాదు అని మనోజ్ అంటాడు. ఏదో జరుగుతుంది అని మీనా డౌట్‌గా అంటుంది.

మళ్లీ ఏం మింగావురా
దాంతో మనోజ్‌ను లక్షలు మింగినోడా. మళ్లీ ఏం మింగి చచ్చావురా అని బాలు పిలుస్తాడు. ప్రభావతి, మనోజ్ వస్తారు. బయట ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడితే ఏమైందని మీనా అడుగుతుంది. మళ్లీ కొంప మీదకు ఏం తీసుకొచ్చారు అని సత్యం అంటాడు. ఏం లేదని చెప్పిన ప్రభావతి రోహిణిని తీసుకురమ్మని మనోజ్‌కు చెప్పి పంపిస్తుంది.
మరోవైపు రోహిణి సంతోషపడుతుంటుంది. మనోజ్ రాగానే నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మడం ఏంటీ. లక్ష లాభం రావడం ఏంటీ సంతోషిస్తుంది. దానికి మనోజ్ షాక్ అవుతాడు. బిజినెస్‌లో పండిపోయావ్ అని రోహిణి అంటే పండానో, ఎండిపోయానో అని మనోజ్ అనుకుంటాడు. లాభం వచ్చిన లక్ష ఏది అని రోహిణి అడిగితే తీసి ఇస్తాడు మనోజ్.
అబ్బా ఇలాంటి రోజు.. రోజు రావాలి. ఈ లక్షతో గోవాకు వెళ్దాం. నిన్ను తక్కువ చేసినవాళ్లకు ఈ లక్ష చూపించి నోళ్లు మూయించాలి. ముఖ్యంగా బాలుకు అని కిందకు మనోజ్‌ను తీసుకెళ్తుంది రోహిణి. వంట గురించి ప్రభావతిని తిడుతూ మీనాను పొగుడుతాడు సత్యం. ఇంతలో రోహిణి వచ్చి సర్‌ప్రైజ్ అని చెబుతుంది. రోహిణి పెద్ద షో చేసి లక్ష చూపిస్తుంది.
లక్ష లాభమంటూ రోహిణి షో
నాలుగు లక్షల ఫర్నిచర్ సేల్ చేసి లక్ష లాభం తెచ్చాడు అని రోహిణి అంటుంది. ప్రభావతికి పొలమారుతుంది. లక్ష లాభం అంటే నాలుగు లక్షలకు వచ్చిందా. మొత్తం ఐదు లక్షల అని మీనా అడుగుతుంది. అంతేగా అని రోహిణి అంటుంది. కాదు. నాలుగు లక్షల్లో మిగిలిన లక్ష లాభం అని మనోజ్ అంటాడు. ప్రభావతి సైలెంట్‌గా ఉండేసరికి అందరికి అనుమానం వస్తుంది.
లేదు. నాకు ఇందాకే చెప్పాడు. దిష్టి తగులుతుందని మనసులోనే దాచుకున్నాను అని ప్రభావతి అంటుంది. అత్తయ్య మీరు స్లీపింగ్ పార్టనర్ కదా. ఇది మీ లాభం అని ఆ లక్ష ప్రభావతికి ఇస్తుంది రోహిణి. అది తీసుకుని మనోజ్‌ను ఏంట్రా ఇదంతా. ఇవి మీనా నగలు అమ్మి తీసుకొచ్చినవని తెలిస్తే చేపలు కోసినట్లు కోస్తారు. భయంతో వణికి చస్తున్నాను అని ప్రభావతి అంటుంది.
మరుసటి రోజు ఉదయం కాఫీ పెట్టి అందరిని పిలవాలని తెలియదా అని మీనాపై అరుస్తుంది ప్రభావతి. దాంతో బాలు విజిల్ ఊదుతు అందరిని పిలుస్తాడు. దాంతో భరించేక అందరూ కిందకు వస్తారు. బాలు జరిగింది చెబుతాడు. ఇకనుంచి ఇలాగే అందరిని పిలు అని మీనాకు బాలు చెబితే సరేనంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. సుశీల కాల్ చేస్తుంది.
సుశీల 75వ బర్త్ డే
నాకు తెలుసు నువ్వెందుకు కాల్ చేశావో. నీకు 75వ పుట్టినరోజు వస్తుంది అని సత్యం మాట్లాడుతాడు. బాలు తీసుకుని మాట్లాడుతాడు. ప్రభావతిపై కౌంటర్స్ వేస్తుంటారు. ఆరు పుష్కరాలు చూశాను. వచ్చే ఏడాదికి ఉంటానో ఉండనో. మీ అందరితో పుట్టినరోజు జరుపుకోవాలని ఉంది. అందరిని తీసుకురా సత్యం అని సుశీల అంటుంది. అందరూ సైలెంట్ అవుతారు.
అందరికి కుదరాలిగా అని సత్యం అంటాడు. తలో ఒకరు కారణం చెబుతారు. అందరం రావడానికి బదులు మీరు ఒక్కరే వస్తే బాగా పుట్టినరోజు జరుపుకోవచ్చు అని మీనా చెబుతుంది. సత్యం, బాలు, శ్రుతి కూడా అదే అంటారు. దాంతో సుశీల వస్తానని ఒప్పుకుంటుంది. అయ్యయ్యో ఈవిడేంటీ ఇంత ఈజీగా ఒప్పుకున్నారు. మళ్లీ అత్త పోరు తప్పదా అని ప్రభావతి మనసులో భయపడుతుంది.
కరిగిన మీనా నగలు
తర్వాత బామ్మ పుట్టినరోజుకు మంచి గొలుసు చేయిద్దామనుకున్నాను. ఈ పుట్టినరోజుకు ఇస్తే బాగుంటుంది అని బాలు చెబితే అత్తయ్య దగ్గర పెట్టిన మన నగలను తాకట్టు పెట్టి అమ్మమ్మకు చైన్ కొనివ్వండి అని మీనా చెబుతుంది. ఆ మాటలు విన్న మనోజ్ వెళ్లి ప్రభావతికి చెబుతాడు. వెంటనే నగలు తీసుకురారా అని ప్రభావతి అంటే నగలను కరిగించేశారట అని మనోజ్ చెబుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


