విభూదిని టన్నుల కొద్ది వాడాం.. శివ తత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. ఇటీవల అఖండ 2 సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రామ్ లక్ష్మణ్ పంచుకున్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమానే అఖండ 2 తాండవం. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేశారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో అఖండ 2 సినీ విశేషాలను పంచుకున్నారు రామ్ లక్ష్మణ్.

బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం ఎలాంటి రిస్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు?
-బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అభిమానులకు రియల్‌గా కనిపించాలి, అభిమానుల్ని అలరించాలనే తపనతో ప్రతి షాట్ ఆయనే చేశారు. ఇందులో 99% ఆయనే చేశారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది. ఆయనే చేయాలి.
-ఈ సినిమా కోసం విభూది కొన్ని టన్నులు వాడి ఉంటాము. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు మన మీద విభూది వర్షం కురిసినట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియెన్స్ మంచి వైబ్రేషన్‌తో ఉంటారు. శివ తత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు ఒక ధైర్యాన్ని ఫీల్ అవుతాం.
యాక్షన్‌లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి?
-ఇందులో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం మూడు క్యారెక్టరైజేషన్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ అత్యంతం అలరిస్తుంది.
ఇప్పుడు ఇండియన్ సినిమా యాక్షన్స్‌లో రకరకాల ఫార్మేట్స్ వచ్చాయి కదా.. మీరు ఎలా అప్డేట్ అవుతుంటారు?
-ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్‌గా ఉన్నాం కాబట్టే మీరు మాతో ఇప్పుడు మాట్లాడుతున్నారు (నవ్వుతూ). ఇప్పుడు మా ఎమోషన్‌లో అప్డేటెడ్ వెర్షన్‌గా మా అబ్బాయి కూడా వస్తున్నాడు. తన పేరు రాహుల్. త్వరలోనే యాక్షన్ డైరెక్టర్‌గా తనని పరిచయం చేస్తున్నాం. తను కూడా చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటాడు.
అఖండలో చక్రం తిప్పే సీన్ చాలా హైలెట్ అయింది కదా అలాంటిది ఈ సినిమాలో ఉంటుందా?
-కచ్చితంగా అంతకుమించిన యాక్షన్ ఈ సినిమాలో ఉంటుంది. మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో జనానికి నచ్చిన అంశాలు ఏంటి తర్వాత ఇలాంటి కొత్తదనం ఇవ్వాలనిదాని గురించి ఆలోచన చేస్తాము. అలా ఆలోచిస్తున్నప్పుడు అఖండలో ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్‌కైతే కనెక్ట్ అయ్యారో అంతకుమించి యాక్షన్ ఈ సినిమాలో కంపోజ్ చేయడం జరిగింది.
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫీలో చాలా కాంపిటేషన్ వచ్చింది కదా.. ఎలా ఫీల్ అవుతున్నారు?
-ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉండాలి. మనం ఒక్కరమే ఉంటే అహంకారం వస్తుంది. పక్కోడు కూడా ఉంటే భయం వస్తుంది. కొత్త కొత్త స్టైల్స్ రావాలి. దాని నుంచి మేము అప్డేట్ అవ్వాలి. అక్కడి నుంచే క్రియేటివిటీ వస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


