గెటప్ వేసుకోడానికి 2 గంటలు, తీయడానికి గంట పట్టేది.. హిందీ డబ్బింగ్ కూడా నేనే చెప్పా.. అఖండ 2పై బాలకృష్ణ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Nov 30, 2025, 09:24:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా అట్రాక్ట్ చేయనున్నాడు. అలాగే, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది.

గెటప్ వేసుకోడానికి 2 గంటలు, తీయడానికి గంట పట్టేది.. హిందీ డబ్బింగ్ కూడా నేనే చెప్పా.. అఖండ 2పై బాలకృష్ణ కామెంట్స్
గెటప్ వేసుకోడానికి 2 గంటలు, తీయడానికి గంట పట్టేది.. హిందీ డబ్బింగ్ కూడా నేనే చెప్పా.. అఖండ 2పై బాలకృష్ణ కామెంట్స్

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 5న గ్రాండ్‌గా అఖండ 2 థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ మాట్లాడుతూ.. "సనాతన ధర్మం మనదే. భారతదేశానికి మూలాలు. ఆనాడు చత్రపతి శివాజీ గారి సైన్యంలో కూడా అఘోరాలు ఉండేవారు. గొప్ప పోరాటం చేసేవారు. నా సినిమా ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రసాలు ఉండాలి. ఈ సినిమాలో సంయుక్త గారు చేసిన పాట కూడా చాలా మంచి సందర్భంలో వస్తుంది" అని అన్నారు.

వాళ్ల నాన్నతో కూడా చేశా

"ఆది పినిశెట్టి చాలా చక్కని పాత్ర చేశారు. నేను వాళ్ల నాన్న గారితో కూడా సినిమాలు చేశాను. సంగీతం రోగాలను నయం చేస్తుంది. సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమా హిట్ కాదు పేలిపోతున్నాయ్. తమన్ అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇదంతా ఒక సమిష్టి కృషి. తమన్‌తో చేసిన నాలుగు సినిమాలు వరుసగా హిట్లు. ఇప్పుడు అఖండ 2 కూడా అద్భుతమైన విజయం సాధించబోతోంది" అని బాలయ్య జోస్యం చెప్పారు.

"మురళీమోహన్ గారు ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడు అనేదే ఈ సినిమా. అఖండ 2 అద్భుతంగా వచ్చింది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు" అని బాలకృష్ణ తెలిపారు.

పొంగిపోలేదు-కృంగిపోలేదు

"నిర్మాతలు రామ్, గోపి గారు లెజెండ్‌తో మా ప్రయాణం మొదలైంది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వారి బ్యానర్‌లో చేయడం జరిగింది. మేము మారలేదు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు అపజయాలకు కృంగిపోలేదు. నా అభిమానులు కూడా అంతే" అని బాలయ్య చెప్పుకొచ్చారు.

"అఖండ 2లో గెటప్ వేసుకోవడానికి రెండు గంటలు, తీయడానికి గంట పట్టేది. మేకప్ అమ్మాయి విధి, కాస్ట్యూమర్ సంచారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాని జార్జియాలో చాలా చలి ప్రదేశాల్లో, ఎన్నో అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. మా నాన్నగారు క్రమశిక్షణ నేర్పారు. సినిమా అనుకునే సమయంలో పూర్తి చేయాలి. నేను అదే చేస్తున్నాను. పరిశ్రమ కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను" అని బాలకృష్ణ కోరారు.

హిందీలో డబ్బింగ్ కూడా

"ఈ సినిమాకి హిందీలో డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు. ఈ వేడుక వచ్చిన అభిమానులందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. జైహింద్" అని నందమూరి బాలకృష్ణ తన స్పీచ్ ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More