మేము మంచులో నాలుగైదు కోట్లు వేసుకునేవాళ్లం, బాలయ్య బాబు స్లీవ్‌లెస్‌లో యాక్షన్ చేసేవాళ్లు: ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్
ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. తాజాగా అఖండ 2 ది తాండవం సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు ఈ ఇద్దరు ట్విన్ బ్రదర్స్.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2 ది తాండవం. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలో బాలకృష్ణ నటనపై ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు.

మీ యాక్షన్ కంపోజిషన్ చూసిన తర్వాత బాలయ్య గారు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు?
-బాలయ్య బాబు గారితో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాము. మేము అంటే బాబు గారికి చాలా నమ్మకం. మేము సింహ లెజెండ్ లాంటి మాస్ క్యారెక్టర్స్‌కి ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి ఒక క్యారెక్టర్‌కి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీని తీసుకుని మేము ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశాం. సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి.
-బాలయ్య గారు ఒక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని సూట్‌కి వెళ్లేవాళ్లం. బాలకృష్ణ గారు క్యారెక్టర్‌కు తగ్గట్టు స్లీవ్ లెస్‌లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. ఒక పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ గారి లాంటి నటుడు మనకు ఉండడం మనందరికీ గర్వకారణం.
-ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి తప్పితే ఈ క్యారెక్టర్‌ని ఇంకెవరు చేయలేరని చెప్పొచ్చు. బాలయ్య గారిని షూటింగ్‌లో ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా ఉండేది.
నిర్మాతల గురించి?
-14 రీల్స్ గోపి గారికి రామ్ గారికి ధన్యవాదాలు. అఖండకు మించి డబల్ త్రిబుల్ స్పాన్ ఉన్న సినిమా ఇది. మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు.
-పాన్ ఇండియా లెవెల్‌లో అద్భుతంగా తీసుకు వెళ్లాలని ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ని గొప్పగా తీసేలా ప్రోత్సహించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడు శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది.
-ఈసారి జరిగిన కుంభమేళా హిందూ ధర్మానికి ఒక జ్యోతిలా వెలిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. అలాంటి కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం ఒక అద్భుతమైన అనుభూతి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


