అతని దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ పవర్‌కి శివుని శక్తి తోడైతే ఇంకెలా ఉంటుంది:ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్

టాలీవుడ్‌లో క్రేజీ ఫైట్ మాస్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్ లక్ష్మణ్. ఈ అన్నదమ్ములు కలిసి యాక్షన్ కొరియోగ్రఫీ వహించిన సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండకు సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 ది తాండవం మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు రామ్ లక్ష్మణ్.

Published on: Nov 27, 2025, 11:42:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.

అతని దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ పవర్‌కి శివుని శక్తి తోడైతే ఇంకెలా ఉంటుంది:ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్
అతని దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ పవర్‌కి శివుని శక్తి తోడైతే ఇంకెలా ఉంటుంది:ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్

ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ విషయాలు

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందించిన అఖండ 2 ది తాడవం టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

'అఖండ 2' ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి ?

-అఖండకి మించిన అంచనాలు 'అఖండ 2పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారు.

-భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీ కొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి గారు కూడా అద్భుతంగా నటించారు.

నెగెటివ్, పాజిటివ్ ఎనర్జీ

-డైరెక్టర్ గారు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని (ఆది పినిశెట్టి) దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్‌ని చాలా కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది.

-అఖండకి మించిన స్పాన్, కాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో తీయాలని డైరెక్టర్ గారు మొదటి నుంచే మనసులో పెట్టుకొని ప్రతిదీ చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. చాలా హోంవర్క్ చేశారు. ప్రతి చిన్న విషయంలో 100% ఎఫర్ట్ పెట్టారు.

వెయ్యి శాతం అందుకునేలా

-అందరం ప్రేక్షకులకి ఒక గొప్ప సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రేక్షకులు అభిమానులు 100% అంచనాలు పెట్టుకుంటే వెయ్యి శాతం ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది.

-అఖండ 2 టీజర్, ట్రైలర్‌లో గన్ త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌ని చూసే ఉంటారు. మామూలుగా గన్‌కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్‌కి ఒక త్రిశూలం మరో పవర్. దానికి శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్‌ని కంపోజ్ చేయడం జరిగింది.

శివ శక్తిని గుండెల్లె నింపుకుంటే

-ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా జరుగుతుందనే విషయాన్ని డైరెక్టర్ బోయపాటి గారు చాలా అద్భుతంగా చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More