అఖండ 2 మాస్ సర్జికల్ స్ట్రైక్స్.. ఈ దేశం విశ్వరూపాన్ని చూసుండవ్.. అదిరిపోయిన బాలయ్య, బోయపాటి మూవీ ట్రైలర్

అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్, దేశం విశ్వరూపం అంటూ బాలయ్య నోట పవర్‌ఫుల్ డైలాగ్స్ చూడొచ్చు.

Published on: Nov 21, 2025, 20:46:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్, పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగులు కామనే. అయితే అఖండ 2 ట్రైలర్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. ఈసారి ఆ మాస్ స్టోరీకి దేశభక్తి, సనాతన ధర్మం టచ్ ఇచ్చి మరో లెవెల్ కు తీసుకెళ్లారు. అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ పై సర్జికల్ స్ట్రైక్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

అఖండ 2 మాస్ సర్జికల్ స్ట్రైక్స్.. ఈ దేశం విశ్వరూపాన్ని చూసుండవ్.. అదిరిపోయిన బాలయ్య, బోయపాటి మూవీ ట్రైలర్
అఖండ 2 మాస్ సర్జికల్ స్ట్రైక్స్.. ఈ దేశం విశ్వరూపాన్ని చూసుండవ్.. అదిరిపోయిన బాలయ్య, బోయపాటి మూవీ ట్రైలర్

అఖండ 2 ట్రైలర్ రిలీజ్

బాలకృష్ణ, సంయుక్త లీడ్ రోల్స్ లో నటిస్తున్న అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. రెండు వారాల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం (నవంబర్ 21) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిసారి అఘోరా రూపంలో బాలయ్య నట విశ్వరూపం చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కష్టం వచ్చినా దేవుడు రాడు అని జనం నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అవుతుందన్న డైలాగుతో అఖండ 2 ట్రైలర్ మొదలవుతుంది.

ఆ తర్వాత సీన్ మహా కుంభమేళాకు మళ్లుతుంది. బాలయ్య ఎంట్రీ తర్వాత విలన్ రూపంలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ లుక్ రివీల్ చేశారు. బాలకృష్ణకు అదే స్థాయిలో విలనీని ఆది పండించినట్లుగా కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ రెండు వేర్వేరు రోల్స్ లోనూ చాలా శక్తివంతంగా కనిపించాడు. ముఖ్యంగా అఘోరా రూపంలో అతడు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.

సర్జికల్ స్ట్రైక్స్ అంటూ..

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడో మతం కనిపిస్తుంది.. మా దేశంలో మాత్రం ధర్మం కనిపిస్తుంది.. సనాతన హైందవ ధర్మం అనే డైలాగుతోపాటు.. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. ధర్మం జోలికి వస్తే మేం ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బాలయ్య అనడం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో మరో పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. ఇంతకాలం ప్రపంచపటంలో ఈ దేశం రూపాన్ని మాత్రమే చూసుంటావ్.. మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్.. మేమంతా ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అనే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది.

ఈసారి బోయపాటి శ్రీను తన సినిమాకు దేశభక్తి, సనాతన ధర్మం అనే హాట్ టాపిక్స్ జోడించి అఖండ 2ను మరింత ఆసక్తికరంగా మార్చాడు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ సాధించిన ఈ జోడీ.. అఖండ 2తో ఆ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. తమన్ మరోసారి బీజీఎంతో ఆకట్టుకున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More