శివ సినిమా చూసి ఏఎన్నార్ ఏమన్నారంటే? మళ్లీ భార్య అమలతో కలిసి నటించాలనుంది: నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్లు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల అక్కినేని నటించిన 'శివ' సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్‌పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా శివ సినిమా చూసి ఏఎన్నార్ ఏమన్నారో కూడా చెప్పారు. 

Published on: Nov 12, 2025 5:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఐకానిక్ చిత్రం 'శివ' (1989) నవంబర్ 14న థియేటర్లలో మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. నాగార్జున, అమల అక్కినేని, రఘువరన్ నటించిన ఈ క్లాసిక్ చిత్రాన్ని రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రెస్‌తో మాట్లాడిన నాగార్జునను.. ఈ సినిమా రీమేక్‌లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని నటిస్తారా అని అడగ్గా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సినిమా చూసి నాన్న ఏమన్నారో కూడా నాగార్జున వెల్లడించారు.

నాగ చైతన్య, నాగార్జున, అఖిల్
నాగ చైతన్య, నాగార్జున, అఖిల్

నాన్న ఏమన్నారంటే?

‘శివ’లో తనను మొదటిసారి చూసినప్పుడు తన తండ్రి (దివంగత నాగేశ్వరరావు) ఎలా స్పందించారో నాగార్జున గుర్తుచేసుకున్నారు. “సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత మా నాన్న ఆ సినిమా చూశారు. అప్పుడు రకరకాల కామెంట్లు వస్తున్నా, ఆయన నన్ను డ్రైవ్‌కు తీసుకెళ్లి సినిమా పెద్ద హిట్ అని చెప్పారు” అని నాగార్జున తెలిపారు.

ఆర్జీవీకి థ్యాంక్స్

'శివ' లాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు ఆర్జీవీకి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ “కొన్ని రోజుల క్రితం నేను మళ్లీ 'శివ' చూసినప్పుడు అదొక కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. అది నిజంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అనుభవం. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు ఆర్జీవీకి థ్యాంక్స్” అని నాగార్జున అన్నారు.

శివ రీమేక్

ఈ సినిమా రీమేక్‌లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ నటిస్తారా అని అడిగినప్పుడు, నాగార్జున నవ్వి.. “'శివ'ను రీమేక్ చేసేంత దమ్ము చైతూ, అఖిల్‌కు లేదు” అని సమాధానమిచ్చారు. అలాగే తన భార్య అమలతో కలిసి మళ్లీ ఒక సినిమాలో నటించాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు.

శివ గురించి

1989లో వచ్చిన 'శివ' చిత్రాన్ని రీమాస్టర్ చేసి, 4K టెక్నాలజీతో నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ చిత్రంతో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఈ సినిమాలో నాగార్జున, అమల విద్యార్థులుగా శివ, ఆశ పాత్రలలో నటించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నాగార్జున కెరీర్‌లో ఇది ఒక బ్రేక్‌త్రూ చిత్రంగా చెప్తారు. నాగార్జున చివరిసారిగా లోకేష్ కనగరాజ్ 'కూలీ'లో కనిపించారు. చైతన్య చివరిగా చందూ మొండేటి 'తండేల్'లో, అఖిల్ సురేందర్ రెడ్డి 'ఏజెంట్'లో నటించారు.