అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ రిలీజ్.. బాలయ్య మాస్ స్టెప్పులు

బాలకృష్ణ అఖండ 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ అంటూ వచ్చేసింది. ఈ మధ్యే తాండవం పేరుతో ఫస్ట్ సింగిల్ రాగా.. దానికి పూర్తి భిన్నంగా ఈ సెకండ్ సింగిల్ రావడం విశేషం. ఈ రెండు పాటలూ సినిమా కథ ఎంత ప్రత్యేకంగా ఉండబోతోందో చెబుతున్నాయి.

Published on: Nov 18, 2025, 20:59:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. వరుస పాటలతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా మంగళవారం (నవంబర్ 18) జాజికాయ జాజికాయ అంటూ తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ రిలీజ్.. బాలయ్య మాస్ స్టెప్పులు
అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ రిలీజ్.. బాలయ్య మాస్ స్టెప్పులు

జాజికాయ జాజికాయ సాంగ్ రిలీజ్

బాలకృష్ణ అఖండ 2 నుంచి ఈ మధ్యే వచ్చిన తాండవం సాంగ్ ఎలా ఉందో చూశారు కదా. అందులో బాలయ్య ఓ రకమైన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అదే మూవీ నుంచి జాజికాయ జాజికాయ అంటూ మరో పాట రిలీజైంది. ఇందులో బాలకృష్ణ, సంయుక్త మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

ఈ పాటను కాసర్ల శ్యామ్ రాగా.. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ పాటను వైజాగ్ లోని జగదాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. తొలి పాటను ముంబైలో రిలీజ్ చేయగా.. ఈ రెండో పాటను వైజాగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.

అఖండ 2 గురించి..

2021లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లోనే వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. సరిగ్గా నాలుగేళ్లకు ఈ సీక్వెల్ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమాలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కూడా నటిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు పాటలు రిలీజ్ చేయడం ద్వారా మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More