బ్రహ్మముడి ప్రోమో: కావ్యను బతికించేందుకు ప్రకృతి వైద్యం- తల్లి, బిడ్డ క్షేమం- కంపెనీకి దూరంగా రాజ్- రాహుల్‌కే హస్తగతం!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య ఇద్దరు గుడికి వెళ్లారు. దర్శనం తర్వాత వస్తుండగా కావ్య కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది. రాజ్ పట్టుకుని మెట్లపై కూర్చోబెడతాడు. కావ్య అబార్షన్ గురించి విన్న పంతులు కేరళలోని అలప్పి అడవిలో వరసిద్ధి ఆచార్యుల వారు ప్రకృతి వైద్యం అందిస్తున్నారని చెబుతాడు.

Published on: Nov 30, 2025, 10:09:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. మేనేజర్ సతీష్ గురించి రాజ్ అడుగుతాడు, జాగ్రత్తగా చెప్పాలి అని రాహుల్ అనుకుంటాడు. రాహుల్ వచ్చి కూర్చుని తింటుంటాడు. రాహుల్ డల్‌గా ఉండటం చూసి అంతా ఓకేనా అని అడుగుతాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వ్యక్తి కదా అని

అంతా ఓకే రాజ్. కానీ, మీ కంపెనీ మేనేజర్ సతీష్ నా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తానన్నాడు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వ్యక్తి కదా నాకు ఉపయోగపడతాడని నేను కూడా వద్దనలేదు. ఈ విషయం నీకు చెప్పలేదు. నన్ను క్షమించు అని అబద్ధం చెబుతాడు రాహుల్.

దానికి ఏముందిరా. సతీష్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న పర్సన్ నీ దగ్గర ఉంటే నీకు ఎలా చేయాలో తెలుస్తుంది. నీకు మంచి గైడెన్స్ ఇస్తాడు. సతీష్ నీ దగ్గర ఉండటమే కరెక్ట్ అని రాజ్ అంటాడు. థ్యాంక్స్ రాజ్ నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావని నేను అనుకోలేదని రాహుల్ డ్రామా ఆడతాడు.

నీ కంపెనీ పతనం కోసమే

మనసులో మాత్రం నీ ఆలోచన పెద్ద తప్పు అని నిరూపిస్తా రాజ్. సతీష్ అనుభవాన్ని నా కంపెనీ డెవలప్‌మెంట్ కోసం కాదు నీ కంపెనీ పతనం కోసం వాడతాను. అందుకు మొదటి అడుగు రేపే పడబోతుంది అని రాహుల్ అనుకుంటాడు. అంతా భోజనం చేసి ఎవరి గదికి వారు వెళ్లిపోతారు.

రాజ్‌ను ఉదయం గుడికి తీసుకెళ్లమని మారం చేస్తుంది కావ్య. బకెట్ లిస్ట్ అయిపోయింది, సమస్యలు అయిపోయాయి, ఇక గుడి ఒక్కటి మిగిలిందా అని రాజ్ సెటైర్లు వేస్తాడు. ఇద్దరు వాదించుకుంటారు. కాసేపటికి కావ్యను గుడికి తీసుకెళ్లేందుకు రాజ్ ఒప్పుకుంటాడు.

మంచి బిడ్డ పుడుతుంది

మరుసటి రోజు ఉదయం రాజ్, కావ్య గుడికి వెళ్తారు. అక్కడ దేవుడిని దర్శించుకుంటారు. అక్కడున్న ఓ గురువు వారితో మాట్లాడతారు. రాజ్, కావ్యల గురించి మంచిగా చెబుతాడు. కావ్యకు మంచి బిడ్డ పుడుతుందని చెబుతాడు. దానికి రాజ్, కావ్య ఇద్దరు సంతోషించి బయలుదేరుతుంటారు.

ఇంతలో కావ్య కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది. రాజ్ పట్టుకుంటాడు. తర్వాత కాసేపటికి కావ్య కుదుటపడుతుంది. ఇద్దరు మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటారు. నీరసంగా ఉందని కావ్య అంటుంది. ఇదంతా ప్రెగ్నెన్సీ వల్లే. నన్ను అర్థం చేసుకుని అబార్షన్ చేయించుకుని ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండేదా చెప్పు అని బాధగా అంటాడు రాజ్.

నా భార్య చనిపోతుంది

ఆ మాటలు విన్న గురూజీ ఏమంటున్నావు బాబు అని సమస్య గురించి అడుగుతాడు. తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసిన క్షణం నా భార్య చనిపోతుంది పంతులు గారు అని రాజ్ చెబుతాడు. దాంతో పంతులు షాక్ అవుతాడు. బిడ్డ కావాలనుకుంటే భార్య దక్కదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు అని బాధగా చెబుతాడు రాజ్.

డాక్టర్లు చెప్పడం కాదు దీనికి మంచి ప్రకృతి వైద్యం ఉంది. కేరళలోని అలప్పి దగ్గర అడవిలో సింధూర అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వరసిద్ధి ఆచార్యుల వారు ఈ సమస్యకు ప్రకృతి వైద్యం అందించారు. మీరు కూడా వెళ్లి ఆయన్ను కలవండి. కచ్చితంగా మీ సమస్య తీర్చి తల్లి, బిడ్డ ఇద్దరిని క్షేమంగా ఉంచేలా చేస్తారు అని పంతులు చెబుతారు.

రాహుల్ చేతికి రాజ్ కంపెనీ

దానికి తెగ సంతోషించిన రాజ్, కావ్య కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోతారు. ఇద్దరు కేరళ వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటారు. అదే విషయం ఇంట్లో చెబుతారు. దానికి అంతా ఓకే అంటారు. కంపెనీని సుభాష్, ప్రకాశం చూసుకుంటారు. రాజ్ లేని సమయంలో తన కంపెనీని రాహుల్ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More