బ్రహ్మముడి నవంబర్ 24 ఎపిసోడ్: కావ్యను మోసం చేసిన స్వప్న- రాజ్ ఫోన్‌తో బయటపడిన కొత్త కంపెనీ బాగోతం- నిజం ఒప్పుకున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 24 ఎపిసోడ్‌లో సుభాష్, అపర్ణల 30వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అపర్ణకు ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది కావ్య. దాంతో అపర్ణ ఎమోషనల్ అవుతుంది. కావ్యను మోసం చేసిన స్వప్న గదిలోకి వెళ్లి రాజ్ ల్యాప్‌ట్యాప్ తీసుకొస్తుంది. కానీ, అందులో ఏముండదు. కానీ, ఫోన్‌లో ఉంటుంది.

Published on: Nov 24, 2025, 07:16:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సుభాష్, అపర్ణల 30వ రోజు పెళ్లి రోజు జరిపిస్తారు దుగ్గిరాల ఇంటి సభ్యులు. అపర్ణ, సుభాష్‌ల బరువు గురించి కామెడీగా మాట్లాడుకుంటారు. అపర్ణను ఎలా చూసుకుంటారో మగ పెళ్లి వారి తరఫున రాజ్ చాలా గొప్పగా చెబుతాడు. కానీ, అదంతా కావ్య గురించి చెబుతున్నట్లు ఉంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 24 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 24 ఎపిసోడ్

ఒకరిగురించి మరొకరు గొప్పగా

సుభాష్‌ను ఎలా చూసుకుంటారో చెప్పమని అడిగితే కావ్య చెబుతుంది. కావ్య కూడా రాజ్ గురించి చెబుతుంది. తర్వాత సుభాష్, అపర్ణలు దండలు మార్చుకుంటారు. అంతా గిఫ్ట్స్ ఇస్తారు. కావ్య మాత్రం అపర్ణ చిన్నప్పటి ఫొటోలన్నింటిని ఆల్బమ్‌గా చేసి ఇస్తుంది. అందులో అపర్ణ చిన్ననాటి ఫొటోలు ఉంటాయి. అవి చూసి అపర్ణ చాలా ఎమోషనల్ అవుతుంది.

కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ. నేను నా ఫొటోల కోసం ఎంతో ట్రై చేశాను. కానీ, కుదర్లేదు. నువ్వు తీసుకొచ్చావ్ అని కావ్యను మెచ్చుకుంటుంది అపర్ణ. మీ అబ్బాయికి కూడా చెప్పండి. కొన్ని మీ అబ్బాయే తెప్పించారు అని కావ్య చెబుతుంది. సుభాష్‌కు సీతారామయ్య ఇచ్చిన మొదటి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు రాజ్. దానికి సుభాష్ తెగ ఆనందపడతాడు.

దొంగచాటుగా స్వప్న

మరోవైపు స్వప్న దొంగచాటుగా వెళ్లి రాజ్ బ్యాగ్ చూస్తుంది. అపర్ణ, సుభాష్‌లకు బాసింగాల కోసం అని కావ్య పైకి వస్తుంది. అక్కడ స్వప్నను చూసి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. స్టిక్కర్స్ కోసం వచ్చానని స్వప్న అబద్ధం చెబుతుంది. కావ్య ముందు స్టిక్కర్స్ తీసుకుంటుంది స్వప్న. కావ్య ముందు రాజ్ ల్యాప్‌ట్యాప్ తీసుకెళ్లలేను. రాహుల్ చెప్పేది అబద్ధమైతే అనవసరంగా దీన్ని బాధపెట్టినదాన్ని అవుతాను అని స్వప్న అనుకుంటుంది.

కావ్య వెతుకుతున్న బాసింగాలను స్వప్న ఇస్తుంది. త్వరగా కిందకు రమ్మని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. చీరకొంగులో రాజ్ ల్యాప్‌ట్యాప్ పట్టుకుని రాహుల్ దగ్గరికి వెళ్తుంది స్వప్న. థ్యాంక్స్ స్వప్న. నీ చెల్లి దగ్గర అబద్ధం చెప్పి మరి తీసుకొచ్చావ్ అని రాహుల్ అంటాడు. కావ్యను మోసం చేయాలని లేదు. కానీ నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని తీసుకొచ్చాను అని స్వప్న అంటుంది.

రాజ్ ఫోన్‌లో ఉండొచ్చు

ల్యాప్‌ట్యాప్‌కు పాస్‌వర్డ్ ఉందని, రాంగ్‌గా ఎంటర్ చేస్తే మొత్తం పోతుంది, రాజ్‌కు వేరే వాళ్లు వాడారని డౌట్ వస్తుందని రాహుల్ చెబుతాడు. 9126 పాస్‌వర్డ్. ఇది కావ్య బర్త్ డే డేట్. కావ్యకు ఓసారి రాజ్ చెబుతుండగా విన్నాను అని స్వప్న చెబుతుంది. ల్యాప్‌ట్యాప్‌లో ఆర్ కంపెనీకి సంబంధించి ఏం లేదు. అంటే బాగా సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నాడు అని రాహుల్ అంటాడు.

ఇది ఫైల్స్ విషయం కాబట్టి రాజ్ ఫోన్‌లో ఉన్నాయనుకుంటా. రాజ్ ఫోన్‌ను నేను తీసుకొస్తా అని చెప్పి స్వప్న వెళ్తుంది. మరోవైపు సుభాష్, అపర్ణ కేక్ కట్ చేస్తుంటారు. దాన్ని రాజ్ ఫొటోలు తీస్తుంటాడు. రాజ్ దగ్గరికి స్వప్న వచ్చి తన ఫోన్ హ్యాంగ్ అయిందని, అర్జంట్‌గా ఇవ్వమని చెబుతుంది. దాంతో స్వప్నకు తన ఫోన్ ఇచ్చి కల్యాణ్ మొబైల్‌తో ఫొటోలు తీస్తుంటాడు రాజ్.

నిజం ఒప్పుకున్న రాజ్

సైలెంట్‌గా స్వప్న పైకి వెళ్తుంది. కింద అంతా సెల్ఫీ తీసుకుంటారు. తర్వాత అంతా కలిసి డ్యాన్స్ చేస్తారు. రాజ్ మొబైల్‌తో కొత్త కంపెనీ బాగోతం బయటపడుతుంది. అది చూసిన స్వప్న వచ్చి కింద పెద్ద గొడవ చేస్తుంది. కొత్త కంపెనీ గురించి స్వప్న, రుద్రాణి నిలదీస్తారు. అత్త చెప్పింది నిజమే అని నిజం ఒప్పుకుంటాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More