బ్రహ్మముడి ప్రోమో: కొత్త కంపెనీ గురించి రాజ్‌ను నిలదీసిన స్వప్న- ఒక్కటైన అత్తాకోడలు- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన స్వరాజ్!
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాహుల్ చెప్పిన మాట విని రాజ్ ల్యాప్‌ట్యాప్ నుంచి కొత్త కంపెనీకి సంబంధించిన ఆధారాలు చూస్తుంది స్వప్న. కొత్త కంపెనీ గురించి రాజ్, కావ్యను నిలదీస్తుంది. అత్తా కోడలు కలిసి రాజ్‌ను ఏకిపారేస్తారు. ఇంట్లోవాళ్లు కూడా అడగడంతో రాజ్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి అక్కడికి వెళ్లి ఆరాలు తీస్తాడు రాహుల్. అక్కడ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత స్వరాజ్ గ్రూప్ నుంచి భారీ మొత్తంలో గోల్డ్, డబ్బు తరలిస్తున్నారు. వీటిని ఏ లెక్కల్లో చూపించలేదు. బాగా దొరికావ్ రాజ్ నేనేంటో చూపిస్తా అని అనుకుంటాడు రాహుల్.

పెళ్లి రోజు వేడుకలు
మరోవైపు అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. రాహుల్ కోపంగా రావడం చూసి రుద్రాణి అడుగుతుంది. కానీ, తల్లి రుద్రాణిపైనే చిరాకు పడతాడు రాహుల్. అదంతా పైనుంచి స్వప్న చూస్తుంది. రాహుల్ కోపంగా ఉంటే స్వప్న వెళ్లి ఏమైందని అడుగుతుంది.
రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి స్వప్నకు రాహుల్ చెబుతాడు. గోల్డ్, డబ్బు కొత్త కంపెనీకి తరలిస్తున్నారని, అడిగితే నన్నే తప్పు పడతావా అని రాజ్ కోప్పడతాడేమో అని, సరైనా ఆధారాలు తెలియకుండా వాళ్లను ఎలా నిలదీయాలి అని రాహుల్ అంటాడు. సరైన ఆధారాలు దొరికితే అడగడంలో తప్పులేదని స్వప్న అంటుంది.
రాజ్ పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లో ఏమైనా ప్రూఫ్ దొరకొచ్చు. కానీ, అది మనం ఎలా చూడగలం. చూసిన తప్పు అవుతుంది కదా అని రాహుల్ అంటాడు. అలా ఏం కాదు. నేను తీసుకొస్తాను అని స్వప్న వెళ్తుంది. నువ్వు ఇలా చేయాలనేగా నేను ఇదంతా చేసింది అని అనుకుంటాడు రాహుల్.
మరింత తగలబెట్టు
ఇంతలో రుద్రాణి వస్తే నీ కోడలితో చిన్న చిచ్చు ప్లాన్ చేశాను. తను రగిలిస్తది. నువ్వు నీ పర్ఫామెన్స్‌తో మరింత తగలబెట్టు అని రుద్రాణితో రాహుల్ అంటాడు. రుద్రాణి చూస్తావుగా నా పర్ఫామెన్స్ అని అంటుంది. అందరు కింద సుభాష్, అపర్ణ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో సరదాగా, సంతోషంగా గడుపుతుంటారు.
ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్న స్వప్న వెళ్లి రాజ్ పర్సనల్ ల్యాప్‌ట్యాప్, బ్యాగ్ చూస్తుంది. అందులో కొత్త కంపెనీకి సంబంధించిన ఆధారాలు, గోల్డ్, మనీని తరలించిన రికార్డ్స్ ఉంటాయి. అవి చూసి షాక్ అయిన స్వప్న వాటిని దొంగతనం చేసి తీసుకొస్తుంది. అందరూ సంతోషంగా పాటలకు డ్యాన్స్ చేస్తుంటే స్వప్న వచ్చి ఫ్లవర్ వాజ్ కింద పడేస్తుంది.
ఆ సౌండ్ విని అంతా షాక్ అయి చూస్తారు. ఏమైంది అక్క. ఎందుకు అలా చేశావ్ అని కావ్య అడుగుతుంది. నానా రచ్చ చేస్తుంది. ఇష్టమొచ్చిన మాటలు అంటుంది స్వప్న. అసలు ఏమైంది స్వప్న. ఎందుకు అలా అంటున్నావ్ అని రాజ్ అడుగుతాడు. నువ్ చేసిన దాని గురించే అడుగుతున్న రాజ్. నమ్మించి ఇంత మోసం చేస్తావ్ అనుకోలేదు అని స్వప్న అంటుంది.
ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటీ
ఇంతకీ ఏమైందో చెప్పుగా అని రాజ్ అంటాడు. ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటీ అని రాజ్‌ని నిలదీస్తుంది స్వప్న. స్వరాజ్ గ్రూప్‌కు సంబంధం లేకుండా సెపరేట్‌గా కొత్త కంపెనీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని మాటలతో నిలదీస్తుంది. కొత్త కంపెనీ గురించి స్వప్నకు తెలియడంపై రాజ్, కావ్య షాక్ అవుతారు.
స్వప్న మాటలతో ఇంట్లోవాళ్లందరికి ఆ నిజం తెలుస్తుంది. లెక్కలేని డబ్బును, కేజీల గోల్డ్‌ను కొత్త కంపెనీకి మళ్లిస్తున్నారు అని స్వప్న అంటుంది. ఇదేనా నిజాయితీ అంటే, ఇదేనా అందరిని సమానంగా చూసుకోవడం అంటే, ఎవరికి తెలియకుండా సెపరేట్‌గా కంపెనీ పెట్టి నిధులు దండుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది.
అత్తా కోడలు ఒక్కటై రాజ్, కావ్యను నిందిస్తుంటారు. వాళ్లిద్దరు ఇలా మాట్లాడుతుంటే సైలెంట్‌గా ఉంటావేంట్రా. దోషిలా అనిపించుకోవడం ఎందుకు అని సుభాష్ అంటాడు. అత్తయ్య చెప్పింది నిజమే నాన్న అని రాజ్ చెబుతాడు.
రాజ్ బిగ్ ట్విస్ట్
రాజ్ మాటతో ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. తర్వాత కొత్త కంపెనీ ఎందుకు పెట్టాడో చెప్పి పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తాడు స్వరాజ్. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


