బ్రహ్మముడి అక్టోబర్ 21 ఎపిసోడ్: కావ్య డ్రామాకు పడిపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు అప్పు బలి.. స్వరాజ్‌ను అడ్డం పెట్టి రచ్చ

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ లో దుగ్గిరాల, కావ్య ఫ్యామిలీ దీపావళి వేడుకలు చూడొచ్చు. అయితే ఈ వేడుకలు కాస్తా రుద్రాణి కుట్రతో విషాదం నింపుతాయి. చివరికి రాజ్ ను కావ్య కాలర్ పట్టుకొని నిలదీసే పరిస్థితి వస్తుంది.

Oct 21, 2025, 07:10:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి ఈరోజు అంటే 857వ ఎపిసోడ్ కావ్య పుట్టింట్లో దీపావళి వేడుకల చుట్టూ తిరిగింది. అయితే రుద్రాణి కుట్ర ఈసారి వర్కౌట్ అయింది. ఆమె నకిలీ టపాసుల కుట్రకు అప్పు బలి కాగా.. మొత్తానికి రాజ్ ను నిలదీసి కావ్య నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి అక్టోబర్ 21 ఎపిసోడ్: కావ్య డ్రామాకు పడిపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు అప్పు బలి.. స్వరాజ్‌ను అడ్డం పెట్టి రచ్చ
బ్రహ్మముడి అక్టోబర్ 21 ఎపిసోడ్: కావ్య డ్రామాకు పడిపోయిన రాజ్.. రుద్రాణి కుట్రకు అప్పు బలి.. స్వరాజ్‌ను అడ్డం పెట్టి రచ్చ

ఇంట్లోకి రాజ్.. రుద్రాణి నకిలీ టపాసులు..

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ రాజ్, ఇందిరాదేవి సీన్ తో మొదలవుతుంది. నేను తొందరపడి కమిట్ అయ్యానేమో.. సాయంత్రం వరకు కావ్యను ఒప్పించగలనా అని రాజ్ అంటాడు. నువ్వు ఏదైనా చేయగలవు రా అని చెబుతూ అతన్ని లోనికి తీసుకెళ్తుంది ఇందిరా దేవి. అటు రుద్రాణి నకిలీ టపాసుల కుట్ర చేస్తుంది. రాహుల్ తో వాటిని తెప్పిస్తుంది. కానీ వీటిని వాళ్లతో కాల్పించడం ఎలా అని ఆలోచిస్తుండగా స్వరాజ్ కనిపిస్తాడు.

రుద్రాణి అతని దగ్గరికి వెళ్లి ఈరోజు పండుగ కదా.. మరి క్రాకర్స్ కాల్చవా అని అడుగుతుంది. అతడు కాలుస్తాను అంటాడు. తన దగ్గర బోలెడన్ని ఉన్నాయంటూ తీసుకెళ్తుంది. మొదట సరే అని చెప్పినా.. అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు అప్పుడు నన్ను తిట్టావు కదా.. నీ క్రాకర్స్ అవసరం లేదు.. మా మామయ్యతో తెప్పించుకుంటానని స్వరాజ్ వెళ్లిపోతాడు. రాజ్ తెచ్చే వాటిలో తమ నకిలీవి కలిపేస్తే సరి అని రుద్రాణి, రాహుల్ అనుకుంటారు.

రాజ్‌కు కనకం కొత్త బట్టలు.. కావ్య డ్రామాకు పడిపోయిన రాజ్

అటు దీపావళి వేడుకల కోసం కనకం అల్లుడు రాజ్ కు కొత్త బట్టలు తీసుకొస్తుంది. ఇవ్వమని కావ్యకు ఇస్తుంది. అయితే తన మీద కోపంగా ఉండటంతో అతడు తీసుకోడని సందేహించిన కావ్య కొత్త డ్రామా ఆడుతుంది. ఆ బట్టలు ఇందిరా దేవికి ఇచ్చి అంతకుముందు వాళ్లు తెచ్చిన బట్టలు తాను తీసుకుంటుంది.

నేను ఇవి ఇస్తే తీసుకోడు.. అప్పుడు మా అమ్మ తెచ్చినవి మీరు ఇవ్వండి అని కావ్య అంటుంది. వాళ్లు సరే అంటారు. కావ్య చెప్పినట్లే రాజ్ ఆమె ఇచ్చిన బట్టలు తీసుకోడు. దీంతో ఇందిరాదేవి కనకం తెచ్చిన బట్టలు ఇస్తుంది. వాటిని అతడు ఆనందంగా వేసుకుంటాడు.

కావ్యలో టెన్షన్.. రాజ్ అబార్షన్ చేయిస్తాడేమో అని ఆందోళన

అయిలే కావ్య మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి కదా మళ్లీ ఎందుకు ఆందోళన అని అపర్ణ, ఇందిర, కనకం ఆమెను అడుగుతారు. రాజ్ తనను సాయంత్రం వరకు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశారంటే తనకు ఆందోళనగా ఉందని, గతంలో అబార్షన్ కు ట్రై చేసినట్లు ఈసారి కూడా అలాంటి ప్లాన్ ఏదైనా వేశాడేమో అని కావ్య అంటుంది. అలా చేస్తే కాళ్లు, చేతులు విరిచేస్తామని ఇందిరా దేవి చెప్పినా కావ్యలో మాత్రం టెన్షన్ తగ్గదు.

రాజ్‌ను పొగిడి క్రాకర్స్ అడిగిన స్వరాజ్‌

అటు క్రాకర్స్ కోసం మెల్లగా రాజ్ దగ్గరకు వెళ్తాడు స్వరాజ్. మామయ్య నువ్వు సినిమా హీరోలా ఉన్నావు అంటూ అతన్ని పొగుడుతాడు. అప్పుడే రాజ్ కు అనుమానం వచ్చి నన్ను పొగుడుతున్నావంటే నీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఈరోజు పండుగ కదా క్రాకర్స్ కావాలి అని అతడు అంటాడు. వాటిని కాలిస్తే పొల్యూషన్.. సౌండ్ కు పక్షులు కూడా చనిపోతాయి.. వద్దు అని రాజ్ వారిస్తాడు. అలా అయితే నామీద నీకు ప్రేమ లేదా అని స్వరాజ్ అంటాడు. చివరికి రాజ్ సరే.. ఇప్పిస్తాను లే అని అంటాడు. అది విని రుద్రాణి, రాహుల్ తమ ప్లాన్ వర్కౌట్ అవుతోందని సంతోషిస్తారు.

మొదలైన దీపావళి సెలబ్రేషన్స్.. పడిపోయిన అప్పు

ఇటు ఇంట్లో దీపావళి సంబరాలు మొదలవుతాయి. రాజ్ చెప్పినట్లుగానే క్రాకర్స్ తీసుకొస్తాడు. అందరినీ క్రాకర్స్ కాల్చడానికి తీసుకెళ్తాడు. అందరూ బయటకు వెళ్లగానే రుద్రాణి, రాహుల్ తాము తెచ్చిన నకిలీ టపాసులను రాజ్ తెచ్చిన వాటిలో కలిపేస్తారు. అందరూ బయట క్రాకర్స్ కాలుస్తుండగా.. అప్పు, కల్యాణ్ వస్తారు. తాను కూడా కాలుస్తానని అప్పు అంటుంది. ఆ తర్వాత రుద్రాణి తెచ్చిన వాటిని తీసుకొని బయటకు వెళ్తుంది.

అవి నకిలీవి కావడంతో విష వాయువులు ఎక్కువగా ఉంటాయి. వాటిని పీల్చి అప్పు పడిపోతుంది. డాక్టర్ వచ్చి చూసి మీరు కాల్చిన టపాసుల్లో ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయో తెలుసా అని అడుగుతుంది. ఆ క్రాకర్స్ తెచ్చింది నువ్వే కదా రాజ్ అని అందరి ముందే రుద్రాణి నిలదీస్తుంది. దీంతో కావ్య ఎందుకిలా చేస్తున్నావ్ అని రాజ్ ను అడుగుతుంది. పదేపదే అడగటంతో అలా చేయకపోతే నువ్వు చస్తావ్ కాబట్టి అని అసలు నిజం చెప్పేస్తాడు. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More