బ్రహ్మముడి అక్టోబర్ 17 ఎపిసోడ్: తుస్సుమన్న అల్లుడు- రాజ్, రుద్రాణి ఇద్దరికి పెద్ద షాక్- ఆకలితో అలమటించిన రాజ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో రాజ్ తీసుకొచ్చిన విడాకుల పేపర్స్‌పై కావ్య సంతకం చేస్తుంది. దాంతో వాటిని రాజ్ ముక్కలు చేస్తాడు. అత్తింటి ముందు టెంట్ వేసుకుని రాజ్ నిరహార దీక్ష చేస్తాడు. అది తెలిసి రుద్రాణి షాక్ అవుతుంది. రాజ్‌కు ఓ తాగుబోతు సపోర్ట్ చేస్తూ మీడియాను పిలుస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఇంటికెళ్లిన రాజ్ విడాకుల పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. నాతో కలిసి ఉండాలంటే ఇప్పుడే రా. లేదా నీకు నీ బిడ్డే కావాలన్నప్పుడు నేనెందుకు. ఈ పేపర్స్‌పై సంతకం చేయు అని రాజ్ అంటాడు. వీటిపై ఎందుకు మీకు గతంలోనే విడాకుల పేపర్స్‌పై సంతకం చేసి ఇచ్చాగా. అవి పోయాయా అని కావ్య అంటుంది.

బెడిసికొట్టిన విడాకుల డ్రామా
ఏంటీ కావ్య ఇది అని కృష్ణమూర్తి అంటే.. మీరు ఆగండి నాన్నా అని చెప్పిన కావ్య పెన్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్లిపోతుంది. దీన్ని భయపెడదామని విడాకుల డ్రామా ఆడితే సంతకం చేస్తానని పెన్ కోసం లోపలికి వెళ్తుందేంటీ అని రాజ్ కంగారుపడతాడు. ఇంతలో పక్కింటావిడ చక్కెర కోసం వస్తుంది. పండుగకు అల్లుడు వచ్చినట్లున్నాడు అంటుంది
కావ్య వచ్చి విడాకుల పేపర్స్‌పై సంతకం చేస్తుంది. సంతకాల మీద సంతకాలు పెడుతున్నావ్. మీ ఆయన ఆస్తులు ఇస్తున్నాడా అని ఆవిడ అంటుంది. లేదు విడాకుల పేపర్స్‌పై సంతకం చేస్తున్నా అని కావ్య అనగానే అమ్మో మీరేదో ఫ్యామిలీ డిస్కషన్‌లో ఉన్నట్లున్నారు. తర్వాత వస్తానని భయపడి వెళ్లిపోతుంది పక్కింటావిడ. సంతకం చేస్తే వెళ్లిపోతానన్నారుగా. వెళ్లండి అని కావ్య అంటుంది.
ఆ విడాకుల పేపర్స్‌ను చించి ముక్కలు చేసిన రాజ్ ఎక్కడికి వెళ్లేది. నిన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లను అని అంటాడు. అల్లుడు గారు ఏంటీ రాకెట్‌ల పైకి లేచి చివరికి చించేసి తుస్సుమన్నాడు. ఎంతైనా నా కూతురు అంటే ప్రేమే అని కనకం అనుకుంటుంది. మీరేంటో నాకు బాగా తెలుసు ఈ విడాకుల డ్రామాలు, అమ్మమ్మ హార్ట్ ఎటాక్‌లు ఆపండి అని కావ్య అంటుంది.
టెంట్ వేసి నిరాహార దీక్ష
నువ్వు రానంటే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను. టెంట్ వేసుకుని నినాదాలు చేస్తాను అని రాజ్ అంటాడు. చాలా సంతోషం అని కావ్య వాళ్లు లోపలికి వెళ్లిపోతారు. రాజ్ చిటికేయగానే టెంట్ వచ్చేస్తుంది. అయితే, విడాకుల డ్రామా ఆడమని రాజ్‌ను రుద్రాణి ఉసిగొలిపి పంపిస్తే.. నిరాహార దీక్ష చేస్తూ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు రాజ్. అది తెలియక మరోవైపు తన ప్లాన్ వర్కౌట్ అయిందని డ్యాన్స్ చేస్తుంటుంది.
రాహుల్ వచ్చి సాంగ్ ఆపుతాడు. ప్లాన్ వేశాం. కానీ సక్సెస్ కాలేదు అని రాహుల్ అంటాడు. మన ప్లాన్ కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఐదు నిమిషాల్లో గుడ్ న్యూస్ వింటాం అని రుద్రాణి అంటుండగా.. ఇందిరాదేవి కింద అందరిని పిలుస్తుంది. దాంతో సంతోషంతో కిందకు వస్తుంది రుద్రాణి. విడాకులు కాదు అత్తాగారి ఇంటి ముందు నిరహార దీక్షకు కూర్చున్నాడట అని ఇందిరాదేవి అంటుంది.
ఈ ప్లాన్ కూడా గోవిందా అని రాహుల్ అనుకుంటాడు. రాజ్ చేసిన దానికి అంతా సంతోషిస్తారు. కావ్య కోసం ఇంత చేశాడని సంబరబడతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ముందు రాజ్ అలా కూర్చొంటే మన పరువు పోతుంది. రాజ్ ఇలా దిగజారి ప్రవర్తిస్తాడని అనుకోలేదు. వెంటనే కాల్ చేసి రమ్మనండి అని రుద్రాణి అంటుంది. నా మనవడి మనుసు మారుతున్నట్లుంది. భార్య కోసం వాడు ఇలా చేస్తుంటే వాడి ఔన్యత్వం మరింత పెరుగుతుంది అని ఇందిరాదేవి అంటుంది.
దొంగ నిరాహర దీక్ష చేయను
అపర్ణ స్వీట్స్ తీసుకొస్తానని వెళ్తుంది. రుద్రాణిని చూసిన రాహుల్ ఇంకా ఎలాంటి ప్లాన్ వేయకు. అవి వర్కౌట్ కావు. చూస్తూ ఉండటమే బెటర్ అని వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ నినాదాలు చేస్తుంటాడు. కావ్య ఆపిల్ తినుకుంటూ వచ్చి నిరాహార దీక్ష అని చెప్పి వెనుక నుంచి బిర్యానీలు తింటారుగా. మీరు కూడా అంతేనా అని కావ్య అడుగుతుంది. నేను అలాంటి దొంగ నిరహార దీక్ష చేయను అని రాజ్ అంటాడు.
ఇంతలో పక్కింటి నుంచి భార్య బాధితుడిని అంటూ వచ్చి రాజ్‌తో చేరుతాడు. రోజంతా కష్టపడి వచ్చిన మొగుడు కాస్తా మందు తాగకూడదా అని అని చెప్పిన ఆ తాగుబోతు నేను చాలా మందిని తీసుకొస్తానని వెళ్లిపోతాడు. రాజ్ వద్దన్నా వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు తెగ తింటుంది. అది చూసి కల్యాణ్ షాక్ అవుతాడు. మేము ఎంత ఇచ్చినా తినేదానివి కాదు. నీకు నువ్వే తింటన్నావ్. ఏంటీ చేంజ్ అని కల్యాణ్ అడుగుతాడు.
రాజ్ చేసినదానికి సంతోషంగా ఉందని అప్పు అంటుంది. అక్కను బావగారు వదులుకోరు. కచ్చితంగా అక్కను ఒప్పిస్తాడు అని అప్పు అంటుంది. తర్వాత కల్యాణ్ గుండెలపై వాలుతుంది అప్పు. మరోవైపు కావ్య కాఫీ తాగుతూ రాజ్‌ను ఊరిస్తుంది. దేవతలకు అమృతం ఎలాగో మనుషులకు కాఫీ అలాగా అని కావ్య మరింత రెచ్చగొడుతుంది. ఇంతలో తాగుబోతు వస్తాడు.
మీడియాను పిలిచిన తాగుబోతు
మన ఉద్యమాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాను. అందుకే వాళ్లను పిలిచాను అని మీడియాను చూపిస్తాడు తాగుబోతు. దాంతో రాజ్ భయపడిపోతాడు. వాళ్లనెందుకు పిలిచావురా అని అంటాడు. వాళ్లు అయితేనే ప్రచారం బాగా చేస్తారు. నీ పేరు చెప్పగానే వాళ్లు వెంటనే వచ్చారు. మీరు ఏమైనా సెలబ్రిటీనా అని తాగుబోతు అంటాడు. రాజ్ మొహం దాచుకుంటాడు.
ఇప్పటికైనా మీ దీక్ష ఆపి లోపలికి రండి అని కావ్య అంటుంది. లోపలికి రాజ్ వెళ్తుంటే మీడియా వచ్చి ప్రశ్నలు అడుగుతుంది. రాజ్‌కు బదులు తాగుబోతు ఆన్సర్స్ ఇస్తాడు. తర్వాత రాత్రిపూట రాజ్ ఆకలితో అలమటిస్తాడు. అది చూసిన కావ్య నాకోసం ఆయన పస్తులు ఉండటం ఇష్టం లేదు. భోజనం ఇవ్వండి అని కృష్ణమూర్తికి ఇచ్చి పంపిస్తుంది కావ్య.
కృష్ణమూర్తి తీసుకెళ్లి రాజ్‌కు భోజనం ఇస్తాడు. దాంతో రాజ్ తింటాడు. నా కూతురు కోసం ఇంత కష్టపడుతున్న మీరు బిడ్డను ఎందుకు వద్దంటున్నారో తెలియట్లేదు అని కృష్ణమూర్తి అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


