బ్రహ్మముడి అక్టోబర్ 16 ఎపిసోడ్: అల్లుడికి క్లాస్ పీకిన కనకం.. కావ్య ఇంటి ముందు రాజ్ నాటకం.. మళ్లీ మీడియా వాళ్ల రచ్చ

బ్రహ్మముడి సీరియల్ గురువారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ రాజ్, కావ్య చుట్టే తిరిగింది. కావ్యను విడాకుల పేరుతో రాజ్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆమె ఇంటి ముందు నిరాహార దీక్ష అంటూ కొత్త నాటకానికి తెరతీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Updated on: Oct 16, 2025, 07:11:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 853వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీని కావ్య కాపాడటం, ఆ తర్వాత విడాకులంటూ రుద్రాణి కొత్త నాటకం మొదలుపెట్టడం, ఆమె ఉచ్చులో రాజ్ పడిపోవడం, అటు అల్లుడికి కనకం క్లాస్ పీకడంలాంటి సీన్లతో సాగిపోయింది.

బ్రహ్మముడి అక్టోబర్ 16 ఎపిసోడ్: అల్లుడికి క్లాస్ పీకిన కనకం.. కావ్య ఇంటి ముందు రాజ్ నాటకం.. మళ్లీ మీడియా వాళ్ల రచ్చ
బ్రహ్మముడి అక్టోబర్ 16 ఎపిసోడ్: అల్లుడికి క్లాస్ పీకిన కనకం.. కావ్య ఇంటి ముందు రాజ్ నాటకం.. మళ్లీ మీడియా వాళ్ల రచ్చ

రాజ్ ఫ్యామిలీకి మహిళా సంఘం నేతల వార్నింగ్

బ్రహ్మముడి సీరియల్ గురువారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మహిళా సంఘం నేతలు రాజ్ కు, ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. ఏం చేస్తారో చేసుకోండి.. మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్తే మేమూ వెళ్తాం అంటూ రుద్రాణి కావాలని వాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీంతో అపర్ణ జోక్యం చేసుకొని రుద్రాణి నోరు మూయిస్తుంది. అయినా వాళ్లు మాత్రం ఊరుకోరు. మీ అందరినీ జైలుకు పంపిస్తామని గట్టి వార్నింగ్ ఇస్తారు.

రాజ్‌ను ఆదుకున్న కావ్య.. నిలదీసిన రుద్రాణి

అప్పుడే సీన్లోకి కావ్య ఎంటరవుతుంది. ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇంట్లోకి వస్తుంది. మహిళల తరఫున మీరు పోరాడుతుండటం నాకు సంతోషంగా ఉంది.. ఈ విషయంలో నేనెప్పుడూ మీకు మద్దతుగానే ఉంటాను.. కానీ నా విషయంలోనే మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు అని కావ్య వాళ్లతో చెబుతుంది. మరి మీ పుట్టింటికి ఎందుకు వెళ్లారు అని అడిగితే.. భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామనే కదా.. నిజంగా ఏదైనా సమస్య ఉంటే నేనే మీ దగ్గరికి వస్తాను అని కావ్య వాళ్లకు చెప్పి పంపిస్తుంది.

రాజ్‌కు క్లాస్ పీకి వెళ్లిపోయిన కావ్య

వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రాజ్ కు కావ్య క్లాస్ పీకుతుంది. నేను మీ నిర్ణయం నచ్చక ఇంట్లో నుంచి వెళ్లిపోయాను.. కానీ ఇది ఎప్పుడూ నా అత్తారిల్లే.. ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా నేను కచ్చితంగా వస్తాను.. అంత మాత్రాన నేను మీ నిర్ణయాన్ని సమర్థించినట్లు కాదు అని కావ్య వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ మాట విని అందరూ సంతోషిస్తారు.

కానీ స్వప్న స్పందిస్తూ.. మాపై ఇంత ప్రేమ ఉన్న నువ్వు మళ్లీ ఎందుకు వెళ్తున్నావ్.. ఇక్కడే ఉండొచ్చుగా అని అంటుంది. భార్యభర్తలు ఒకే మాట మీద ఉండాలి.. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.. మరి ఇక్కడ ఉండటం వల్ల ఏం లాభం అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.

రాజ్, కావ్య విడాకుల పేపర్లు రెడీ చేసిన రుద్రాణి

అటు రుద్రాణి తన ప్లాన్ ఫెయిలైందని బాధగా గదిలో కూర్చుంటుంది. దీంతో రాహుల్ వెళ్లి ఆమెను మరింత ఆటపట్టిస్తాడు. మనకు ఓడిపోవడం అలవాటే కదా అని అంటాడు. కానీ రుద్రాణి మాత్రం ప్లాన్ ఎ ఫెయిలైనా ప్లాన్ బి ఉందంటూ బీరువాలో నుంచి విడాకుల పత్రాలు బయటకు తీస్తుంది.

ఏంటివి అని అడిగితే.. విడాకుల పేపర్లు అని చెబుతుంది. వాటిని చూసి రాహుల్ మరింత నవ్వుతాడు. ఇవేమైనా మామిడాకులా నువ్వు ఇవ్వగానే రాజ్ తీసుకోవడానికి అంటాడు. రాజ్ ను రెచ్చగొట్టి పంపిస్తే ఆవేశంలో కావ్య వాటిపై సంతకం చేస్తుంది.. ఆ తర్వాత మనం నిజంగానే వాళ్లకు విడాకులు ఇప్పించొచ్చు అని అంటుంది.

రాజ్‌ను బుజ్జగించిన సీతారామయ్య

అటు రాజ్ దగ్గరికి సీతారామయ్య వస్తాడు. ఎందుకిలా చేస్తున్నావ్ అని నిలదీస్తాడు. కావ్యను తాను వెళ్లిపోమనలేదని రాజ్ అంటాడు. కానీ ఈ విషయంలో తప్పంతా నీదే.. నీవల్ల ఈ కుటుంబం ముక్కలవడాన్ని నేను అంగీకరించను.. నేను, మీ నాన్నమ్మ ఒకప్పుడు ఇద్దరమే.. ఇప్పుడు ఇంత మందిమి అయ్యాము.. మా మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు, సమస్యలు వచ్చాయి.. కానీ మేము వాటిని దూరం చేసుకున్నాం తప్ప మేము దూరం కాలేదు.. ఇప్పుడు నీ వల్ల అది జరగొద్దు.. వెళ్లి కావ్యను తీసుకురా అని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ఆ వెంటనే రాజ్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. విడాకులు ఇస్తానని కావ్యను బెదిరించు.. అప్పుడు ఆమె కచ్చితంగా తిరిగి వస్తుంది అని ఆ పేపర్లను బలవంతంగా రాజ్ చేతుల్లో పెడుతుంది రుద్రాణి. ఇష్టం లేకపోయినా వాటిని రాజ్ తీసుకుంటాడు.

కావ్యకు క్లాస్ పీకిన కనకం

అటు ఇంటికి వెళ్లి వచ్చిన కావ్యను కనకం తిడుతుంది. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని, ఆ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా నువ్వు వెళ్లకపోతే అల్లుడు దిగి వస్తాడని, అప్పుడే నీ కడుపులో బిడ్డను ఉంచడానికి అంగీకరిస్తాడని కావ్యకు కనకం క్లాస్ పీకుతుంది. కానీ తండ్రి కృష్ణమూర్తి మాత్రం చాలా మంచి పని చేశావంటూ కావ్యను మెచ్చుకుంటాడు.

కావ్య ఇంటికి రాజ్.. క్లాస్ పీకిన కనకం

వాళ్లు మాట్లాడుకుంటుండగానే రాజ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే కనకం ఆవేశంగా బయటకు వెళ్తుంది. ఎందుకొచ్చారు.. అప్పుడు అసలు విషయం తెలియదు కాబట్టి మీకు సపోర్ట్ చేశాను.. ఇప్పుడు అసలు విషయం తెలిసింది.. తోడుగా ఉండాల్సిన భర్తే ఇలా చేస్తే నా కూతురు ఏమైపోవాలి అని రాజ్ కు కనకం క్లాస్ పీకుతుంది.

అయితే కృష్ణమూర్తి ఆమెను అడ్డుకుంటాడు. మీ ఇంట్లో మా ముగ్గురు కూతుళ్లు సంతోషంగా ఉండటం చూసి ఎంతో సంతోషిస్తున్నాం.. మీరు శత్రువును కూడా ఓడించాలనుకుంటారు తప్ప హాని చేయరు.. అలాంటి మనస్తత్వం మీది.. కానీ కావ్య విషయంలో ఎందుకిలా చేస్తున్నారు.. ఆమె కడుపులో బిడ్డను ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతాడు. ఆ విషయం మాత్రం చెప్పును.. నా కారణాలు నాకు ఉన్నాయి అని అంటాడు.

దీంతో కావ్య స్పందిస్తూ.. చెప్పాను కదా ఆయన వినడు అని.. వదిలేయండి మనం లోపలికి వెళ్దాం అని తండ్రితో అంటుంది. అప్పుడు రాజ్ కావ్యను ఆపి.. అయితే వీటిపై సంతకం చేసి వెళ్లు అని అంటాడు. ఏంటవి అని అడిగితే.. విడాకుల పేపర్లు అని అంటాడు. దీంతో కావ్య, కనకం షాక్ తింటారు.

ఆ తర్వాత రాజ్ నిరాహార దీక్ష అంటూ కొత్త నాటకం మొదలుపెడతాడు. ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొంటాడు. అప్పుడే ఓ తాగుబోతు వచ్చి మీ పోరాటానికి తన మద్దతు కూడా ఉంటుందని, అందుకే మీడియా వాళ్లను పిలిచానని అనడంతో రాజ్ కంగారుపడతాడు. మళ్లీ వాళ్లను ఎందుకు పిలిచావని అంటాడు. ఇప్పటికైనా లోనికి రండి అంటూ కావ్య అంటుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More