బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌కు అన్నం పెట్టిన మామ కృష్ణమూర్తి.. తండ్రి ద్వారా నిజం రాబట్టేలా కావ్య ప్లాన్

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ ఆకలితో అలమటిస్తుంటాడు. అది చూసిన కావ్య చలించిపోయి తండ్రి కృష్ణమూర్తితో భోజనం పెట్టిస్తుంది. అలాగే, రాజ్ నుంచి నిజం రాబట్టమని చెబుతుంది. కృష్ణమూర్తి అలాగే చేస్తాడు. తిని పడుకున్న రాజ్‌కు దిండు పెట్టి దుప్పటి కప్పుతుంది కావ్య.

Oct 19, 2025, 08:47:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్ నిరాహార దీక్ష చేస్తూ ఆకలితో అలమటిస్తుంటాడు. రాత్రి రాజ్‌కు దోమలు కుడుతుంటాయి. అది చూసి కావ్య చలించిపోతుంది. దిండు, దుప్పటి ఇచ్చేందుకు వెళ్తుంది. కానీ, అది చూసిన కనకం కావ్యను ఆపుతుంది. నీ భర్త దారిలోకి రావాలంటే కాస్తా కష్టపడాలని చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

నా దగ్గర ఐడియా ఉంది

నువ్వు ఇలా అన్ని సేవలు చేస్తే అల్లుడు గారు ఎక్కడ దిగొస్తారు. అల్లుడి గారి మనసు మారాలంటే నా దగ్గర ఓ ఐడియా ఉందని కనకం చెబుతుంది. ఏంటదని కావ్య అడుగుతుంది. నాటు కోడి కూర చేశాను అని, అది అల్లుడి గారి ముందు ఊరిస్తూ తినమని కావ్యకు చెబుతుంది కనకం.

తల్లి చెప్పినట్లుగానే కావ్య చేస్తుంది. రాజ్ ముందు లొట్టలేసుకుంటూ కావ్య చికెన్ తింటుంది. తాను వండిన వంట గురించి చెబుతు కనకం మరింత ఊరిస్తుంది. అదంతా విన్న రాజ్ భర్త ఆకలితో ఉన్నాడని కూడా లేకుండా ఎలా తింటుందో చూడు అని కావ్యను తిట్టుకుంటాడు. కావ్య, కనకం ఎంత ఊరించిన రాజ్ లొంగడు.

తర్వాత, కనకం, సత్యమూర్తి భోజనం చేస్తారు. రాజ్‌ను ఆకలికి నిద్రపోకుండా అవస్థలు పడటం చూసి కావ్య బాధపడుతుంది. ఏంట్రా ఈరోజు ఆకలి దంచేస్తుంది. నా పరిస్థితి ఏంట్రా ఇలా మారిపోయింది అని రాజ్ తనలో తానే మాట్లాడుకుంటాడు. అదంతా కావ్య వింటుంది. భర్త ఆకలితో బాధపడటం చూడలేకపోతుంది.

కృష్ణమూర్తికి తెలియకుండా ప్లాన్

దాంతో ఓ ప్లాన్ వేస్తుంది. తండ్రికి చెప్పి రాజ్‌కు భోజనం పెట్టించేలా చూస్తుంది. అలాగే, భోజనం పెట్టక రాజ్ నిజం బయటపెట్టేలా తండ్రి కృష్ణమూర్తికి తెలియకుండానే అతనితో ప్లాన్ చేస్తుంది కావ్య. తండ్రి దగ్గరికి ప్లేట్‌లో భోజనం పట్టుకెళ్తుంది. అది చూసిన కృష్ణమూర్తి నేను ఇందాకే భోజనం చేశా కదమ్మా అని అంటాడు. ఇది మీకోసం కాదు నాన్న మీ అల్లుడి గారి కోసం అని కావ్య అంటుంది.

అల్లుడి గారి కోసమా అని ఆశ్చర్యపోతాడు కృష్ణమూర్తి. ఆయన్ని నా కారణంగా పస్తులు ఉంచడం నాకు ఇష్టం లేదు. ఆయనకు నా బిడ్డ అక్కర్లేకపోవచ్చు. కానీ, నాకు ఆయన కావాలి నాన్న అని కావ్య చెబుతుంది. నీలాంటి భార్య, తల్లి ఎవరు ఉండరమ్మా. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని మురిసిపోతాడు కృష్ణమూర్తి. కావ్య చెప్పినట్లుగానే రాజ్‌కు అన్నం తీసుకెళ్తాడు కృష్ణమూర్తి.

మీకోసం అన్నం తీసుకొచ్చాను తినండి అల్లుడు గారు అని కృష్ణమూర్తి అంటే రాజ్ వద్దంటాడు. నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. అది చాలా నిజాయితీగా చేస్తున్నాను అని బెట్టు చేస్తాడు రాజ్. అదంతా చూసిన కావ్య వీటికేం తక్కువ లేదు అని అనుకుంటుంది. అబ్బా ఏం కాదులెండి అల్లుడు గారు. అదంతా నేను చూసుకుంటాను. మీరు తినడం ఎవరికి తెలియదు కదా అని కృష్ణమూర్తి అంటాడు.

మీకోసం భోజనం తెచ్చాను

నేను తినడం ఎవరికి తెలియదా. అత్తయ్యకి, కళావతికి కూడా తెలియదా అని రాజ్ అంటాడు. అందరూ పడుకున్నాక మీకోసం భోజనం తీసుకొచ్చాను. లాగించేయేసేయండి అని కృష్ణమూర్తి అంటాడు. అలా అయితే ఓకే అని రాజ్ అన్నం తింటాడు. అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. రాజ్‌ను అలాగే చూస్తుంటాడు కృష్ణమూర్తి. ఏంటీ మావయ్య నావైపే చూస్తున్నారు. మీరు తినలేదా అని రాజ్ అంటాడు.

నా కూతురు కోసం ఇంతల కష్టపడుతూ అంతలా ప్రేమిస్తున్నా మీరు ఆ నిజమేంటో చెప్పలేకపోతున్నారని చూస్తున్నాను అని కృష్ణమూర్తి అంటాడు. నాకైనా ఆ నిజం చెప్పండి అల్లుడు గారు. నేను ఎవరికి చెప్పను అని కృష్ణమూర్తి చాలా అడుగుతాడు. అయినా కూడా రాజ్ చెప్పడు. దాంతో కృష్ణమూర్తి వెళ్లిపోతాడు. అలా కావ్య వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.

అన్నం తిన్న రాజ్ ఎలాగోలా అక్కడే టెంట్ కింద పడుకుంటాడు. దోమలతో ఇబ్బందులు పడతాడు. అది చూసిన కావ్య రాజ్‌కు దిండు పెట్టి దుప్పటి కప్పుతుంది. నిద్రలోనే ఆ దుప్పటి కప్పుకుంటాడు రాజ్.

అంతపెద్ద రహస్యమా

ఏసీ గదుల్లో మహారాజులా పడుకోవాల్సిన మీకు ఇలాంటి కర్మ ఏంటండి మీకు. అంతపెద్ద రహస్యమా అది. ఇంత ఇష్టపడుతున్న నాకు అది తెలుసుకునే అర్హత కూడా లేదా అని కావ్య ఎమోషనల్‌గా అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More