బ్రహ్మముడి నవంబర్ 21 ఎపిసోడ్: స్వప్న ఉక్రోషం, రుద్రాణి రచ్చ- రాహుల్ రివర్స్ డ్రామా- కొత్త కంపెనీ పెడుతున్న రాజ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో రాహుల్‌కు జరిగిన అవమానం గురించి స్వప్న వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఉక్రోషంగా మారుతుంది. దానికి వత్తాసు పలుకుతూ రుద్రాణి రచ్చ చేస్తుంది. ఇంతలో వచ్చిన రాహుల్ రివర్స్ డ్రామా ఆడతాడు. మరోవైపు రాజ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్లు రాహుల్‌కు తెలుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు జరుగుతుంటాయి. రుద్రాణి అన్నదానికి అపర్ణ లేచి నడిచి చూపిస్తుంది. మేము అడిగినవి కూడా అబ్బాయి చేయాలి అని ధాన్యలక్ష్మీ, కావ్య అంటారు. దాంతో సుభాష్ చాలా గొప్పోడు అన్నట్లుగా కావ్య, ప్రకాశం మాట్లాడుతారు.

పేషంట్ అయిన డీసెంట్‌గా
సుభాష్ ఒంట్లో షుగర్, ఫ్యాట్ ఉందని ప్రకాశం అంటాడు. అబ్బాయి పేషంట్ అయిన డీసెంట్‌గా ఉన్నాడు, నచ్చాడు అని అపర్ణ అంటుంది. అనాధిగా పెళ్లి చూపుల్లో అమ్మాయిలనే ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు అని కావ్య అడిగితే దాని వెనుక ఉన్న కారణాన్ని ఇందిరాదేవి గొప్పగా చెబుతుంది. అందరూ చప్పట్లు కొడతారు. అంతా పొగుడుతారు.
ఇంతలో స్వప్న వచ్చి అంతా వెలిగిపోతుంది. చాలా బాగుంది అని స్వప్న అంటుంది. ఇప్పుడు ఏమైందని అంత ఉక్రోషంగా మాట్లాడుతున్నావ్ అని సుభాష్ అంటాడు. మీరే మారారని అంటున్నాను. అందరిముందు అందలం ఎక్కించి చాటుగా అథఃపాతాళానికి తొక్కేవాళ్లను మిమ్మల్నే చూశాను అని కావ్య, రాజ్‌ను అంటుంది స్వప్న.
ఏమైందని రాజ్ అడిగితే.. ఆదరించే చోట చీదరిస్తే నీ భార్య ఊరుకుంటుందా, గౌరవించాల్సిన చోట అవమానిస్తే నీ భార్య సహిస్తుంది. ఇప్పుడు రాహుల్ అదే పరిస్థితిలో ఉన్నాడు. కింది స్థాయి ఉద్యోగులు వినట్లేదు. రాహుల్ ఆర్డర్స్ లెక్కచేయట్లేదు. అసలు దీనంతటికి కారణం ఎవరు అని స్వప్న అంటుంటే.. ఇంకెవరు నీ మొగుడే. గౌరవమర్యాదలు మనం అడుక్కుంటే రావు. మన క్యారెక్టర్‌ను బట్టి వస్తాయని సుభాష్ అంటాడు.
అనామకున్ని చేశారు
వాడి గురించి తెలిసే అలా బిహేవ్ చేస్తున్నారని ప్రకాశం అంటాడు. అతను మారాడు అంటే అందరికి నమ్మడానికి టైమ్ ఉండదు. లేకుంటే ఇచ్చిన అవకాశాన్ని లాగేసుకోవడం కాదు. అధికారం ఇచ్చారు అనామకున్ని చేశారు. మీరు రాహుల్‌కి ఇచ్చిన పోస్ట్, దాని పవర్ గురించి చెబుతుంది స్వప్న. ఆఫీస్‌లో జరిగింది చెబుతుంది స్వప్న.
ఇదే నా నా భర్తకు ఇచ్చిన పోస్ట్, అధికారం అని నిలదీస్తుంది స్వప్న. ఇంట్లో ఉండి అన్ని మీరే చేస్తుంటే నా భర్తను ఆఫీస్‌కు ఎందుకు పంపించినట్లు నిలదీస్తుందని స్వప్న. దానికి రుద్రాణి మరింత ఆజ్యం పోస్తుంది. కాస్తా నేను చెప్పేది వినండి అని రాజ్ అంటాడు. ఏం చెబుతావురా. 20 లక్షలు ఇచ్చి దొంగను చేశారు. ఇప్పుడు ఆఫీస్‌కు పంపించి వాడి బతుక్కి తూట్లు పొడుస్తున్నారు అని రుద్రాణి అంటుంది.
ఇంతలో వచ్చిన రాహుల్ వచ్చి రుద్రాణిని తిడతాడు. రాజ్, కావ్యను ఏమైనా అంటే తల్లిని అని కూడా చూడను. మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషపడాలి. ఆఫీస్ మనది అవమానాలు, గౌరవాలు అన్ని ఉంటాయి. అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి అని రాహుల్ రివర్స్ డ్రామా ఆడతాడు. అక్కడ ఏదో జరిగిందని కాదు రాజ్, కావ్య మనసేంటో ఆలోచించు అని స్వప్నను అంటాడు రాహుల్.
రాహుల్ సారీ
ఇంట్లోవాళ్ల మీద మా అమ్మ అరవచ్చు కానీ నువ్వు మాత్రం అనొద్దు. ఎందుకంటే రాజ్ నన్ను మార్చి నీకు జీవితాన్ని ఇచ్చాడు అని రాహుల్ అంటాడు. దాంతో స్వప్న వెళ్లిపోతుంది. స్వప్న కోపంలో ఉంది. నేను బాగున్నా. తన తరఫున నేను సారీ చెబుతున్నాను అని రాహుల్ అంటాడు. వెళ్లి స్వప్నను ఓదార్చినట్లు నటిస్తాడు రాహుల్.
నేను ఎక్కడైనా పని చేయగలను. కానీ, ఆఫీస్‌కు మాత్రమే ఎందుకు వెళ్లానంటే నువ్వు చెప్పావని. వీళ్లందరి ముంది నా నిజాయితీని నిరూపించుకోవాలని. నీ మాట నిలబెట్టుకోవాలని. అయినా అన్నది రాజ్, కావ్యనే కదా అని రాహుల్ అంటాడు. కావ్య, అప్పుకు గౌరవం ఇస్తారు. నాపై జాలి చూపిస్తున్నారు అని స్వప్న అంటుంది.
నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. నువ్వు నన్ను ఇంతలా వెనుకేసుకొస్తుంటే బాగుందని రాహుల్ అంటాడు. మరోవైపు మన పెళ్లి గందరగోళంగా జరిగింది కదా. మనం మళ్లీ సాంప్రాదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకుంటే ఉంటది అని కావ్యతో రాజ్ అంటాడు.
రాజ్ కొత్త కంపెనీ
మరోవైపు రాజ్ సర్ ఆర్ అనే పేరు మీద మరో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫైల్ ఇది అని రాహుల్‌తో మేనేజర్ చెబుతాడు. చాలా పెద్ద వ్యవహారమే నడుపుతున్నావ్. నేను ఏంటో చూపిస్తాను అని రాహుల్ అనుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












