బ్రహ్మముడి నవంబర్ 17 ఎపిసోడ్: దెబ్బలతో ఇంటికి రాహుల్- దొంగతనం నిజమని సుభాష్ సాక్ష్యం- కావ్యతో స్వప్న పశ్చాత్తాపం
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్‌లో రాహుల్‌కు 20 లక్షలు చెక్ ఇచ్చి డబ్బులు విత్ డ్రా చేసుకుని రమ్మని రాజ్ పంపిస్తాడు. కానీ, అక్కడ రాహుల్ నుంచి 20 లక్షల క్యాష్ బ్యాగ్ దొంగతనం చేస్తారు. టెండర్ ఆఫీస్‌కు వెళ్లడు. దాంతో ఇంట్లోవాళ్లు రాహుల్‌ను తప్పు బడతారు. రాహుల్ దెబ్బలతో ఇంటికి వస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాసిరకం చీర కట్టావేంటీ. అస్సలు బాగోలేదని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు బాగుంది. ఈ చీర రాహుల్ నాకు తెచ్చిన చీర అని స్వప్న చెబుతుంది. నా భర్త తన కష్టార్జితంతో తెచ్చిన చీర. అందుకే కట్టుకున్నా అని స్వప్న అంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి వేరే చీర కట్టుకోమని చెబుతాడు.

11 గంటలకు టెండర్
ఎవరు ఏం చెప్పిన వినను. చీర మార్చుకోను. నిన్ను డిసప్పాయింట్ చేయను అని స్వప్న అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఈరోజు 11 గంటలకు టెండర్ ఉంది. అక్కడ 20 లక్షల డిపాజిట్ కట్టాలి. నువ్ టైమ్‌కు బ్యాంక్‌కు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకుని టైమ్‌కు టెండర్ ఆఫీస్‌కు వెళ్లు అని చెక్ ఇస్తాడు రాజ్. రాహుల్ డౌట్ పడుతుంటే ముందు ఈ ఆఫీస్ పనులు చూడు అని రాజ్ అంటాడు.
దానికి రాహుల్ ఎందుకు అని డౌట్ పడతారు. వాడే చేయాలి అని రాజ్ గట్టిగా చెబుతాడు. థ్యాంక్స్ చెబుతాడు రాహుల్. ప్రతి మనిషి మారడానికి అవకాశం ఇవ్వాలని కావ్య చెప్పిందని రాజ్ అంటాడు. ఎవరు డౌట్ పడకండి. రాహుల్ తనకు ఇచ్చిన పని పూర్తి చేస్తాడు అని కావ్య అంటుంది. టైమ్‌కు టెండర్ పూర్తి చేయాలి. లేకుంటో చాలా నష్టం వస్తుందని రాజ్ అంటాడు.
నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని రాహుల్ వెళ్తాడు. ప్రకాశం కూడా వెళ్లిపోతాడు. వేరే పని ఉందని సుభాష్ బయటకెళ్లిపోతాడు. కావ్య దగ్గరికి వెళ్లిన స్వప్న రాహుల్‌ను నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది. నా సమస్యను చిటికెలా తీర్చేశావ్. చెల్లివి అంటే నువ్వేనే అని స్వప్న అంటుంది. తాను ఇన్నిరోజులు పడిన ఆవేదన చెప్పుకుంటుంది స్వప్న.
క్యాష్ బ్యాగ్ దొంగతనం
ప్రకాశం టెండర్ ఆఫీస్‌కు వెళ్లి క్యాష్ వస్తుంది, ముందు పేపర్ వర్క్ చూద్దాం పదా అని మేనేజర్‌తో అంటాడు. మరోవైపు రాహుల్ దగ్గరి నుంచి క్యాష్ బ్యాగ్ కొట్టేస్తారు ఇద్దరు దొంగలు. వాళ్ల వెంట రాహుల్ పరుగెడతాడు. ఒకరి నుంచి మరొకరు క్యాష్ బ్యాగ్ విసిరేసుకుంటూ తప్పించుకుంటారు. వారిలో ఒకడు బైక్‌పై క్యాష్ బ్యాగ్ పట్టుకుని వెళ్లిపోతాడు.
రాహుల్ కిందపడిపోయి ఆగిపోతాడు. మరోవైపు కావ్య కోసం స్కూటీ తీసుకొస్తాడు రాజ్. బండి నడపాలని అన్నావ్‌గా పదా అని రాజ్ అంటాడు. నేను నడపాలనుకుంది స్కూటీ కాదు. బుల్లెట్ అని కావ్య అంటుంది. దానికి షాక్ అయిన రాజ్ అది నడపడం చాలా కష్టమని రాజ్ అంటాడు. మీరున్నారుగా నేర్పించడానికి అని కావ్య అంటుంది. దాంతో అంతా రాజ్‌ను నేర్పించమంటారు.
ఇంతలో రాజ్‌కు ప్రకాశం కాల్ చేసి రాహుల్ ఇంకా టెండర్ ఆఫీస్‌కు రాలేదని చెబుతాడు. దానికి షాక్ అయిన రాజ్ నేను చూసుకుంటానంటాడు. ఇంట్లో వాళ్లు అడిగితే.. రాహుల్ టెండర్ ఆఫీస్‌కు వెళ్లలేదని చెబుతాడు. అనుకుందే జరిగిందని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవి మాటలు అంటారు. తొందరపడకండి అని కావ్య అంటుంది. రాహుల్‌ను నమ్మితే 20 లక్షలు పట్టుకుని మాయమయ్యాడు అని ఇందిరాదేవి అంటుంది.
20 లక్షల దొంగతనం
ధాన్యలక్ష్మీ నానా మాటలు అని అవమానిస్తుంది. స్వప్న ఫీల్ అవుతుంది. ఆ మాటలను రుద్రాణి ఫోన్‌లో వింటుంటాడు రాహుల్. మన ఎంట్రీకి రంగం సిద్ధమైందని రాహుల్ అనుకుని దెబ్బలతో, క్యాష్ బ్యాగ్‌తో రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. రాహుల్‌ని చూసి అంతా షాక్ అవుతారు. ఏమైందిరా అని రాజ్ అడుగుతాడు. టెండర్ ఆఫీస్‌కు టైమ్‌కు వెళ్లలేకపోయాను. ఇదిగో 20 లక్షలు అని జరిగిన దొంగతనం గురించి చెబుతాడు రాహుల్.
అతి కష్టం మీద దొంగలను పట్టుకుని ఒక్క రూపాయి పోకుండా డబ్బు తిరిగి తీసుకొచ్చాను అని రాహుల్ అంటాడు. ఇది నమ్మేలా ఉందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా దగ్గర మాత్రం సాక్ష్యం లేదని రాహుల్ అంటాడు. ఇదో కొత్తరకం నాటకం అయి ఉంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నాటకం కాదు. నిజమే అని సుభాష్ ఎంట్రీ ఇస్తాడు. రాహుల్ చెప్పింది నిజమే అని, వాళ్లను రాహుల్ వెంబడించడం నేను చూశాను అని సుభాష్ సాక్ష్యం చెబుతాడు.
రాహుల్ వెంట దొంగలు పడింది, అది సుభాష్ చూసింది, దొంగల నుంచి రాహుల్‌ను సుభాష్ కాపాడింది అంతా చెబుతాడు. దాంతో ఇంట్లోవాళ్లు రాహుల్‌ను నమ్ముతారు. తర్వాత రాహుల్‌కు ఇంకో అవకాశం ఇవ్వాలి కదా అని కావ్య అంటుంది. రాహుల్‌కు అవకాశం ఇస్తే వాడుకునే టైప్ కాదు ఆడుకునే టైప్ అని రాజ్ అంటాడు.
చోరీ చేసింది నా మనుషులు
దొంగతనం అంతా నిజమే. కానీ, ఆ దొంగతనం చేసింది నా మనుషులు అని సిగ్గు పడుతూ రుద్రాణితో చెబుతాడు రాహుల్. ఆ రాజ్ ఏమైనా అంత త్వరగా నమ్ముతాడు అనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


