బ్రహ్మముడి ప్రోమో: రాహుల్ నుంచి 20 లక్షల దొంగతనం- స్వప్న, కావ్యల నమ్మకం గోవిందా- రాజ్ కంపెనీకి కోట్లల్లో నష్టం!
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాహుల్ మారిపోయాడని, అంతా కలిసి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఇంట్లోవాళ్లతో స్వప్న గొడవ పెట్టుకుంటుంది. దాంతో కోట్ల టెండర్ ప్రాజెక్‌ను పూర్తి చేసుకుని రమ్మని, 20 లక్షలు డ్రా చేసి టెండర్‌కు డిపాజిట్ చేయమని రాజ్ చెబుతాడు. కానీ, రాహుల్ నుంచి 20 లక్షలు చోరీకి గురవుతాయి.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో స్వప్న నాసిరకం చీర కట్టుకుని కిందకు వస్తుంది. అది చూసి ఏంటీ స్వప్న ఇలాంటి చీరలు నువ్వు కట్టవు, ఇప్పుడెందుకు కట్టావ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు ఈ చీర కట్టడం చాలా సంతృప్తిగా ఉందని కాస్టా కోపంగా సమాధానం ఇస్తుంది స్వప్న.

రాహుల్ కష్టపడిన డబ్బు
ఇప్పుడు ఏమన్నాను స్వప్న కోప్పడుతున్నావ్. ఇలాంటి చీరలు కట్టడమేంటీ అని అడిగా అంతేగా అని ధాన్యం అంటుంది. ఇది నా భర్త రాహుల్ కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బుతో కొనింది. దీనికంటే ఎంత కాస్ట్‌లీ చీర కట్టుకున్న సంతృప్తిగా ఉండదు అని స్వప్న అంటుంది.
ఏంటీ రాహుల్ కష్టపడి పని చేశాడా. అని తను చెబితే నువ్వు నమ్మావా. రాహుల్ కష్టపడి పనిచేసి నమ్మాడు అంటే మేము నమ్మం. ఎవరినైనా మోసం చేసి డబ్బులు కొట్టేశాడంటే నమ్ముతాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీపై విరుచుకుపడుతుంది స్వప్న.
అసలు ఏమనుకుంటున్నారు. రాహుల్ ఎప్పుడు అలాగే ఉంటారనుకుంటున్నారా. తను చాలా మారిపోయాడు. తన దగ్గరికి 20 లక్షల ఆఫర్ వచ్చిన కంపెనీకి నష్టం తేకూడదని వద్దనుకున్నాడు. ఇంతకుముందులా రాహుల్ లేడు. రాహుల్ రెస్టారెంట్‌లో బేరర్‌గా పని చేసి ఈ చీర కొనిచ్చాడు అని స్వప్న జరిగింది చెబుతుంది.
రెస్టారెంట్‌లో బేరర్‌గా
అప్పుడే కిందకు వచ్చిన రాజ్, కావ్య అవును అంటారు. ఏంటీ మీరనేది అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును చిన్నత్తయ్య. రాహుల్ మేము వెళ్లిన రెస్టారెంట్‌లో బేరర్‌గా పని చేస్తున్నాడు. దీనికంటే నిజాయితీ పని లేదని చెప్పాడు అని కావ్య చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ, ప్రకాశం, సుభాష్ వాళ్లంతా నమ్ముతారు.
రాహుల్‌లో మార్పు రావడం మంచిదేగా అంటారు. రాహుల్‌లో మార్పు వస్తే సరిపోదు. ఆయన మారిపోయినప్పుడు మీరు కూడా ఓ అవకాశం ఇచ్చి చూడాలి. ఆయన అలా బేరర్‌గా కష్టపడటం నాకు నచ్చట్లేదు. ఇప్పుడు రాహుల్ మారాడు కాబట్టి కంపెనీలో ఏదైనా వర్క్ చేసే ఛాన్స్ ఇవ్వండి అని స్వప్న అంటుంది.
దానికి ముందు ఎవరు ఒప్పుకోరు. స్వప్న వాదిస్తుంది. అందరితో గొడవ పడుతుంది. ఈ గొడవ అంతా చూసిన రాజ్ రాహుల్‌కు ఒక్క అవకాశం ఇస్తున్నాను అని చెబుతాడు. ఇప్పుడు మనకు కోట్ల టెండర్ ప్రాజెక్ట్ ఉంది. వాళ్లకు మనం 20 లక్షల క్యాష్ డిపాజిట్ చేయాలి. ఆ 20 లక్షల క్యాష్‌ను నువ్వు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని టెండర్ దగ్గర ఉన్న బాబాయ్‌కు ఇచ్చేయ్ అని రాహుల్‌కు చెబుతాడు రాజ్.
రాహుల్ నుంచి 20 లక్షలు గోవిందా
నువ్వు బాబాయ్ ఇద్దరు కలిసి ఈ టెండర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయండి అని అంటాడు రాజ్. బాబాయ్ నువ్వు టెండర్ జరిగే ప్లేస్‌కు వెళ్లు, రాహుల్ క్యాష్ తీసుకొస్తాడు అని రాజ్ చెబుతాడు. దాంతో ప్రకాశం, రాహుల్ ఇద్దరు వెళ్లిపోతారు. రాహుల్ బ్యాంక్‌లో 20 లక్షల క్యాష్ డ్రా చేసుకుని వస్తుంటాడు.
అది చూసిన దొంగల ముఠా ప్లాన్ చేసి రాహుల్ నుంచి 20 లక్షలు దొంగతనం చేస్తారు. ఇద్దరు రాహుల్‌ను కన్‌ఫ్యూజ్ చేసి 20 లక్షలు ఎత్తుకెళ్లిపోతారు. మరోవైపు రాహుల్ ఇంకా రాలేదని ప్రకాశం కంగారు పడుతుంటాడు. ఇంతలోనే రాహుల్ కాల్ చేసి 20 లక్షలను ఎవరో చోరీ చేశారని చెబుతాడు. అది విని ప్రకాశం షాక్ అవుతాడు.
ఇది తెలిసి రాహుల్ మళ్లీ తన బుద్ధి చూపించాడని ఇంట్లో అంటారు. దాంతో రాహుల్‌పై స్వప్న, కావ్య పెట్టుకున్న నమ్మకం పోతుంది. అలాగే, రాజ్ కంపెనీకి కోట్లల్లో నష్టం వస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


