బ్రహ్మముడి నవంబర్ 14 ఎపిసోడ్: ప్రకాశంను చితకబాదిన ధాన్యం- రెస్టారెంట్‌లో బేరర్‌గా రాహుల్-కావ్యను ఏడిపించిన నిజమైన రౌడీలు
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్‌లో ప్రకాశం లవ్ లెటర్ చాలా బాగా రాశాడని చదువుతుంది ధాన్యలక్ష్మీ. కానీ, చివరిలో లత అనే పేరు ఉంటుంది. ప్రకాశం చిన్నప్పటి లవ్ స్టోరీ బయటపడటంతో ధాన్యం చితకబాదుతుంది. కావ్యకు చీర కట్టి క్యాండిల్ లైట్ డిన్నర్‌కు రాజ్ తీసుకెళ్తాడు. అక్కడ బేరర్‌గా రాహుల్ పని చేస్తుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ ప్రేమలేఖను కావ్య, సుభాష్ లవ్ లెటర్‌ను అపర్ణ చదువుతారు. వీరిద్దరి కంటే మా ఆయన బాగా రాశారు అని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ధాన్యలక్ష్మీ చదువుతుంది. మంచి కవిత్వంతో ప్రేమలేఖలా ఉంటుంది. కానీ, చివరిలో ధాన్యలక్ష్మీ పేరుకు బదులు లత.. లత.. లత అని ఉంటుంది.

ప్రకాశంను బాదిన ధాన్యలక్ష్మీ
దాంతో లత ఎవరు అని ప్రకాశంను అంతా అడుగుతారు. ఇంత రాసింది ధాన్యం గురించి కాదన్నమాట అని అపర్ణ అంటుంది. ఎవత్తదీ అంటూ చీపురు కట్టతో ప్రకాశంను బాదుతుంది. అదెప్పుడో చిన్నప్పుడు కథే అని ప్రకాశం అంటే.. చిన్నప్పుడు అంత కథ నడిపారా అని మరింత బాదుతుంది ధాన్యం.
మరోవైపు రాహుల్ పని చేసేందుకు వెళ్తున్నట్లు రుద్రాణితో చెబుతాడు. నా కష్టార్జితంతో స్వప్నను పోషిస్తున్నట్లు చూపించాలి. మోసం చేసిన నిజాయితో చేయాలి. అందుకే నిజంగానే పనిచేస్తాను. కొడితో కుంభస్థలాన్నే కొట్టాలి. వెళ్లి రాజ్ ప్లేసులో కూర్చోవాలి అని రాహుల్ వెళ్లిపోతాడు. స్వప్న ఎక్కడికి అని అడిగితే నీ నమ్మకాన్ని కాపాడుకునేందుకు వెళ్తున్నా.. నీకో సర్‌ప్రైజ్ ఉంది. ఎదురు చూడు అని రాహుల్ అంటాడు.
మోసం వాడి రక్తంలోనే ఉంది
రాహుల్ మారడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. మోసం చేయడం వాడి రక్తంలోనే ఉంది అని ఇందిరాదేవి అంటుంది. ఏదో ఒకరోజు మీరంతా రాహుల్‌ని నమ్మే రోజు వస్తుందని స్వప్న అనుకుంటుంది. మరోవైపు రెస్టారెంట్‌కు తీసుకెళ్తా అని కావ్యకు చెబుతాడు రాజ్. భర్తను చీర కట్టమంటుంది కావ్య. నాకు విప్పడం తప్పా కట్టడం తెలియదే అని రాజ్ అంటాడు.
కావ్య మూతి ముడుస్తుంది. దాంతో కావ్యకు రాజ్ చీర కడతాడు. కావ్యకు కుచ్చిళ్లు పెట్టి కావ్య అందాన్నే చూస్తుండిపోతాడు రాజ్. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. రాజ్ ముద్దు పెట్టుకోబోతుంటే కావ్య ఆపుతాడు. ఇది కాదు చీర కట్టడం అని కావ్య అనేసరికి రాజ్ ఉలిక్కిపడతాడు. మనిషికి కంట్రోల్ ఉండాలని కావ్య అంటుంది. దాంతో కోపంగా కావ్యకు చీర కడతాడు రాజ్.
ప్రకాశంకు మందు రాసిన ధాన్యం
ఇదేదో చాపల చుట్టినట్లుందని కావ్య అంటుంది. రాజ్ వెళ్లిపోతాడు కావ్య చీర కట్టుకుంటుంది. మరోవైపు కొట్టిన దెబ్బలకు ప్రకాశంకు మందు రాస్తుంది ధాన్యలక్ష్మీ. చిన్నప్పటి గర్ల్‌ఫ్రెండ్ పేరు భలే గుర్తు పెట్టుకున్నారు అని అప్పు అంటుంది. దాంతో ప్రకాశంపై మళ్లీ తిరగబడుతుంది. అక్రమ సంబంధం గురించి చెప్పండని అంటుంది. అనుకోకుండా మావయ్యను ఇరికించినట్లున్నాను అని అప్పు అంటుంది.
కావాలనే ఇరికించినట్లు ఉందని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు ఆ లతను తీసుకొచ్చి మీకు దానికి అక్రమ సంబంధం లేదని నిరూపించాలి. అంతవరకు బెడ్డు లేదు, ఫుడ్ లేదని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు కారులో రాజ్, కావ్య వెళ్తుంటారు. రౌడీల నుంచి తనను కాపాడే కోరికను తీర్చాలని కావ్య అంటుంది. అందుకు డమ్మీ రౌడీలను ఏర్పాటు చేశాను అని రాజ్ అంటాడు.
కావ్యను ఏడిపించిన నిజమైన రౌడీలు
దానికి బదులు నిజమైన రౌడీల నుంచి నన్ను కాపాడొచ్చుగా అని కావ్య అంటుంది. అది వచ్చే జన్మలో చూద్దాం. ఇప్పుడు డమ్మీ రౌడీలతో కానిద్దాం అని రాజ్ అంటాడు. కావ్యకు క్యాండిల్ లైట్ డిన్నర్‌తో సర్‌ప్రైజ్ ఇస్తాడు రాజ్. రూమ్ అంతా రొమాంటిక్‌గా ఉంటుంది.
ఆ రెస్టారెంట్‌లో రాహుల్ బేరర్‌గా చేస్తాడు. అది చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఏంట్రా ఇది అని అడిగితే.. నేను ఇక్కడ బేరర్‌ను సర్ ఆర్డర్ ఇవ్వండని రాహుల్ అంటాడు. తర్వాత రెస్టారెంట్‌లో నిజమైన రౌడీలు కావ్యను ఏడిపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














