బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్: రుద్రాణితో రంజిత్ 2 కోట్ల డీల్- కుయిలి ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన కావ్య-కోర్టుకు రాహుల్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌లో కుయిలిని రాహుల్ హత్య చేశాడని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. రాహుల్ మళ్లీ మోసం చేశాడని స్వప్న బాధపడుతుంది. రుద్రాణికి కుయిలి భర్త రంజిత్ కాల్ చేసి 2 కోట్ల డీల్ మాట్లాడుకుంటాడు. కుయిలి ఇంట్లో కావ్య ముందే సీక్రెట్ కెమెరా పెట్టిందని రాజ్ చెబుతాడు.

Published on: Nov 08, 2025 6:57 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు ఉదయం రాహుల్ డల్‌గా ఉంటే రాజ్ అడుగుతాడు. జరిగింది మర్చిపోకపోతే భవిష్యత్తుపై భయం ఉండదుగా అని స్వప్న సెటైర్ వేస్తుంది. కిచెన్‌లో కావ్యతో రాజ్ రొమాన్స్ చేస్తాడు. ఖాలీగా ఉండేబదులు ఆఫీస్‌లో పని చేసుకోవచ్చుగా అని రాహుల్‌తో అంటుంది ఇందిరాదేవి.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 8 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 8 ఎపిసోడ్

కొట్టడం వల్లే చనిపోయింది

దానికి ఇక ఆ పనులు అయినట్లు అని సుభాష్ అంటాడు. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు. రాహుల్ ఎవరని అడుగుతారు. రాహుల్ లేచి నిల్చుంటే కానిస్టేబుల్స్‌తో అరెస్ట్ చేయమంటారు. ఏం చేశాడని రాజ్ అడిగితే.. మర్డర్ చేశాడని ఎస్సై చెబుతాడు. కుయిలి అనే అమ్మాయి చనిపోయింది, ఇతను కుయిలిని కొట్టడం వల్లే చనిపోయిందని ఆమె భర్త కేస్ పెట్టాడు, ఆధారాలతోనే అరెస్ట్ చేస్తున్నామని ఎస్సై అంటాడు.

నీకు కుయిలి తెలుసా, నీకు కుయిలికి గొడవ జరిగిందా, కొట్టావా లేదా అని ఎస్సై అడిగితే.. తెలుసు, గొడవ జరిగింది. కానీ నేను జస్ట్ తోసేసాను అంతే. దానికే ఎలా చనిపోతుందని రాహుల్ అంటాడు. అయితే, కోర్టులో తేల్చుకో. ఇతను నిర్దోషి అయితే జడ్జ్ గారే వదిలేస్తారు అని రాహుల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. వాడు ఒక మనిషి ప్రాణం తీస్తాడనుకోలేదు. ఎలా కాపాడమంటావ్ అని రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది.

వాడు మారాడని సంతోషించాలో, చంపాడని బాధపడాలో తెలియట్లేదు అని అపర్ణ అంటుంది. కాసేపు ఎవరు మాట్లాడకండి. కళావతి పదా అని రాజ్ అంటాడు. రాత్రి ఈ విషయం చెప్పలేదు. వీడిని ఎలా బయటకు తీసుకురావాలని రుద్రాణి ఆలోచిస్తుంది. మరోవైపు స్వప్న వెళ్లి ఏడుస్తుంటే కావ్య, రాజ్ ఓదారుస్తారు. ఇంకోసారి నేను మోసపోయినందుకు బాధపడుతున్నాను అని స్వప్న అంటుంది.

అన్యాయంగా ఇరికించి

నువ్వు అనుకుంది నిజం కాదనిపిస్తుంది, నాకు అనుమానంగా ఉందని, హత్య చేశాడనిపించట్లేదు. కంగారుపడకు అని చెబుతున్నాం అని కావ్య అంటుంది. మరోవైపు రుద్రాణికి రంజిత్ కాల్ చేసి తాను కుయిలి భర్తను అని పరిచయం చేసుకుంటాడు. నా కొడుకును అన్యాయంగా ఇరికించింది కాకుండా నన్ను బెదిరించడానికి ఫోన్ చేశావా అని రుద్రాణి అంటుంది.

బెదిరించడానికి కాదు. డీల్ మాట్లాడటానికి చేశాను. నేను కూడా మీలాంటి వాన్నే. మీవాడు నా భార్యను చంపుతున్న వీడియో నా దగ్గర ఉంది. దాంతో మీవాడికి శిక్ష పడుతుంది. దానివల్ల నాకు లాభం లేదు. కానీ, మనిద్దరం లాభం పొందే డీల్ ఒకటి ఉందని రంజిత్ అంటాడు. కోర్టులో ఆ వీడియో చూపించకుండా ఉండేందుకు నీకు ఎంత కావాలి అని రుద్రాణి అడుగుతుంది.

నాకు మీరు రెండు కోట్లు ఇస్తే మీ కొడుకు నిర్దోషిలా బయటకొస్తాడు. ఈరోజు మీ వాడిని కోర్టులో ప్రవేశపట్టనున్నారు. ఈలోపు డిసైడ్ అవ్వండి అని రంజిత్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. రుద్రాణి కిందకు అరుస్తు వస్తుంది. రాహుల్ అరెస్ట్ అయినందుకు పిచ్చి పట్టిందా అని ప్రకాశం అంటాడు. అవును, వాడికోసం పిచ్చి ప్రయత్నాలు అన్ని చేస్తున్నాను అని రుద్రాణి అంటుంది.

రెండు కోట్ల డీల్

కుయిలి మొగుడు రంజిత్ కాల్ చేసి డీల్ గురించి, రెండు కోట్ల డిమాండ్ గురించి చెబుతుంది రుద్రాణి. ఇప్పుడు ఆ రెండు కోట్లు ఇస్తే రాహుల్‌కు శిక్ష పడకుండా చూడొచ్చు అని వేడుకుంటుంది రుద్రాణి. అమ్మాయిని హత్య చేస్తే డబ్బులు లంచం ఇచ్చి విడిపించాలా అని ఇందిరాదేవి అంటుంది. అందరిని బతిమిలాడుతుంది రుద్రాణి. ఇవేనా మీ విలువలు అంటూ గొడవ చేస్తుంది.

నిందలు వేసింది చాలు అత్త ఆపు. వాడికి డబ్బు ఇస్తే అమ్మాయిని రాహుల్ చంపినట్లే అని ఒప్పుకున్నట్లేగా. ఎప్పుడు సపోర్ట్ చేయని కళావతి కూడా రాహుల్ చంపలేదని నమ్ముతుంది. కన్న కొడుకును నువ్వు నమ్మట్లేదు. మేము వాడిని శిక్ష పడకుండా బయటకు తీసుకొద్దామని చూస్తున్నాం అని రాజ్ అంటాడు. రాహుల్ బయటపడాలంటే సాక్ష్యాలు కావాలి. మీరు రాకపోయిన ఆ రంజిత్‌ను కలిసి ఒప్పించి రాహుల్‌ను బయటకు తీసుకొస్తాను అని రుద్రాణి వెళ్లిపోతుంది.

స్వప్న అత్త రాహుల్‌ను కలిసి మాట్లాడేటప్పుడు నువ్వు కూడా పక్కనే ఉండు. రాహుల్‌ను బయటపడేసే సాక్ష్యం నేను తీసుకొస్తా అని రాజ్ అంటాడు. మేము వచ్చేవరకు రంజిత్‌ను అక్కడే ఉండేలా చూడమని కావ్య అంటుంది. అసలు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని ఇదంతా చేస్తున్నారు అని అపర్ణ, సుభాష్ అడుగుతారు.

సీక్రెట్ కెమెరా

మేము ఆ ఇంటికి వెళ్లినప్పుడే కళావతి ఆ ఇంట్లో కెమెరా పెట్టింది. ఎవరు చంపారో తెలిసిపోతుంది అని రాజ్ చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.