బ్రహ్మముడి నవంబర్ 5 ఎపిసోడ్: రాజ్‌ను కాపాడిన కావ్య.. రుద్రాణికి షాక్.. గోల్డ్ బాబు బుట్టలో పడిన కుయిలీ.. ప్లాన్ సక్సెస్
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ లో రాజ్ ను, దుగ్గిరాల కుటుంబాన్ని కావ్య మరోసారి కాపాడుతుంది. అటు కుయిలీ పూర్తిగా గోల్డ్ బాబు బుట్టలో పడిపోవడంతో రాహుల్ ఆమె గురించి అసలు నిజం తెలుసుకుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 870వ ఎపిసోడ్ లో రాహుల్ కళ్లు తెరిపించే ప్రయత్నంలో రాజ్, కావ్య సక్సెస్ సాధించడానికి దగ్గరవుతారు. అలా జరగకుండా ఉండటానికి రుద్రాణి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. రాజ్ ను, దుగ్గిరాల ఫ్యామిలీ బిజినెస్ ను కావ్య మరోసారి కాపాడుతుంది.

రుద్రాణి ప్లాన్ సక్సెస్.. రాజ్‌లో టెన్షన్
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ రాజ్ కు ప్రకాష్ ఫోన్ చేసి డిజైన్ ఫైల్స్ మిస్ అయిన విషయం చెప్పడంతో మొదలవుతుంది. అవి సమయానికి అందకపోతే రూ.50 కోట్ల నష్టం వస్తుందని ఇంట్లో వాళ్లందరూ టెన్షన్ పడుతుంటారు. దీంతో వెంటనే రాజ్ ను రమ్మని రుద్రాణి ఒత్తిడి తెస్తుంది. అదే విషయం చెప్పడానికి ప్రకాష్ ఫోన్ చేయడంతో రాజ్ కూడా టెన్షన్ పడతాడు. అక్కడి నుంచి వెళ్లాల్సిందే అని అనుకుంటాడు. అది విన్న రుద్రాణి తెగ మురిసిపోతుంది.
రాజ్‌ను కాపాడిన కావ్య
రాజ్ వస్తున్నాడా అని పదే పదే రుద్రాణి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావని ఇందిరా దేవి అడిగితే.. నా కొడుకు వల్ల ఈ ఫ్యామిలీకి నష్టం జరగకూడదు.. వాడు ఏమైనా సరే అని నాటకం ఆడుతుంది. అటు కావ్యను పిలిచిన రాజ్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని, అక్కడి తాను చేసిన డిజైన్ కనిపించడం లేదని చెబుతాడు. దీంతో కావ్య ఆ ఫైల్ ఎక్కడికీ పోలేదని, తన దగ్గర మరో కాపీ ఉందని చెబుతుంది.
మీరు డిజైన్ చూడమని తనకు ఫైల్ పంపారు కదా.. అందులో మార్పులు కూడా చెప్పాను.. ఆ ఫైల్ నా దగ్గరే ఉంది.. చిన్న మామయ్యకు ఫోన్ చేసి నా ల్యాప్‌టాప్ లో చూడమని చెబితే చాలు అని అని ప్రకాష్ కు ఫోన్ చేస్తుంది. అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రుద్రాణి షాక్ తింటుంది.
కుయిలీని మరింత ఇరికించిన గోల్డ్ బాబు
ఇటు కుయిలీని మరింత ఇరికించడానికి గోల్డ్ బాబు ప్లాన్ చేస్తాడు. తనకు పబ్ కు వెళ్లే అలవాటు ఉందని, తన ఫ్రెండ్ పిలుస్తున్నాడని, వాడితో బిజినెస్ కూడా మాట్లాడాలని కుయిలీతో చెబుతాడు. తనకు ఫారిన్ మందు, డ్యాన్స్ చేయడానికి పార్ట్‌నర్ కావాలని అంటాడు. అది విన్న కుయిలీ.. బయటికి ఎందుకు.. ఇక్కడే పార్టీ ఏర్పాటు చేస్తామని అంటుంది. దీనికి కనీసం రూ.లక్ష ఖర్చవుతుందని లోలోపల అనుకొని బాధపడుతుంది.
కుయిలీ వెంటనే వెళ్లి రంజిత్ తో ఆ విషయం చెబుతుంది. ఇప్పటికే రూ.10 లక్షల అప్పు వెంటనే తిరిగి ఇవ్వాలని తనను వేధిస్తున్నారని, మళ్లీ రూ.లక్ష ఎక్కడి నుంచి తేవాలని అంటాడు. ఏది ఏమైనా సరే ఈరోజు గోల్డ్ బాబుకు పార్టీ ఇచ్చి.. అతనిలోని గోల్డ్ లాగేసుకొని బాబును రోడ్డున పడేయాల్సిందే అని కుయిలీ అంటుంది. దీంతో రంజిత్ సరే అంటూ ఆ ఏర్పాట్లలో ఉంటాడు.
రాజ్‌కు అపర్ణ వీడియో కాల్
రాజ్ కు అపర్ణ వీడియో కాల్ చేస్తుంది. రాజ్, కావ్య వేషాలు చూసి అపర్ణ, ఇందిరా దేవి నవ్వుకుంటారు. వాళ్లను ఆటపట్టిస్తారు. అయితే స్వప్న మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. అదే విషయం రాజ్ తో చెబుతుంది అపర్ణ. రాహుల్ మారడని, అతని కోసం మీరు ఇలా మారు వేషాల్లో అక్కడ ఉండటం తనకు నచ్చడం లేదని స్వప్న అంటుంది. కుయిలీలో మాయలో ఉన్నాడని, ఆమె గురించి అసలు నిజం తెలిస్తే రాహుల్ మారతాడని, తాము మారుస్తామని రాజ్, కావ్య ఆమెకు ధైర్యం చెబుతారు. రేపటిలోగా అతన్ని తీసుకొస్తామని స్పష్టం చేస్తారు. ఆమె సరే అంటుంది.
రాహుల్‌ను రెచ్చగొట్టిన రాజ్, కావ్య
ఇటు గోల్డ్ బాబు కోసం ఇంట్లోనే పబ్ లాంటి అరేంజ్‌మెంట్స్ చేస్తుంది కుయిలీ. అది చూసి రాహుల్ షాక్ తింటాడు. రాజ్, కావ్య అతన్ని మరింత రెచ్చగొడతారు. నీకోసం కుయిలీ ఎప్పుడైనా ఇంత ఖర్చు చేసిందా.. గోల్డ్ బాబు దగ్గర ఉన్న గోల్డ్ చూసి ఇలా చేయిందని అంటారు. దీంతో రాహుల్ లో అనుమానం మొదలవుతుంది. అటు కుయిలీ కూడా ఓ అదిరిపోయే మోడ్రన్ డ్రెస్సులో వస్తుంది. అది చూసి రాహుల్ మరింత కుళ్లకుంటాడు.
అందరి ముందూ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావా అని కుయిలీని తిడతాడు. అప్పుడే గోల్డ్ బాబు అక్కడికి వస్తాడు. తనకోసం చేసిన ఏర్పాట్లతోపాటు కుయిలీని అలా చూసి తెగ పొగిడేస్తాడు. రాహుల్ గాడికి ఇలాంటి ఫిగర్ పడిందని తాను ఈర్శ్య పడుతున్నానని అంటాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో గోల్డ్ బాబు, కుయిలీ బెడ్ పై పడుకోవడం రాహుల్ చూస్తాడు. ఆ తర్వాత ఆమె గురించి అసలు నిజం తెలుసుకున్నట్లుగా చూపించారు.

E-Paper












