బ్రహ్మముడి నవంబర్ 4 ఎపిసోడ్: గోల్డ్ బాబుతో బెడ్‌రూమ్‌లో సెటిలైన కుయిలీ.. రాహుల్ కళ్లు తెరిపించిన రాజ్.. కోట్ల నష్టం

బ్రహ్మముడి మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ మొత్తం రాహుల్, కుయిలీ, రాజ్, కావ్య చుట్టే తిరిగింది. అయితే చివరికి గోల్డ్ బాబు ఎంట్రీతో రాహుల్ కళ్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి.

Published on: Nov 4, 2025, 07:05:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 869వ ఎపిసోడ్ లో రాజ్, కావ్య మారువేషాల్లో రాహుల్ కళ్లు తెరిపించే ప్రయత్నం చూడొచ్చు. అటు వాళ్లను ఆ ఇంట్లో నుంచి వెనక్కి తీసుకురావడానికి రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. దీంతో కంపెనీకి కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి నవంబర్ 4 ఎపిసోడ్: గోల్డ్ బాబుతో బెడ్‌రూమ్‌లో సెటిలైన కుయిలీ.. రాహుల్ కళ్లు తెరిపించిన రాజ్.. కోట్ల నష్టం
బ్రహ్మముడి నవంబర్ 4 ఎపిసోడ్: గోల్డ్ బాబుతో బెడ్‌రూమ్‌లో సెటిలైన కుయిలీ.. రాహుల్ కళ్లు తెరిపించిన రాజ్.. కోట్ల నష్టం

కుయిలీ, రాహుల్‌తో ఆడుకున్న రాజ్, కావ్య

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ కుయిలీని మంగతాయారు రూపంలో ఉన్న కావ్య టార్చర్ పెట్టే సీన్ తో మొదలవుతుంది. ఆమెతో ఇంట్లో అన్ని పనులు చేయిస్తుంది కావ్య. పదేపదే కొడుతూ, తిడుతూ ఉంటుంది. అటు రాహుల్ తో లింగరాజుగా మాట్లాడుతూ రాజ్ కూడా ఆడుకుంటాడు. గోల్డ్ బాబు వస్తున్నాడని, నీ కుయిలీ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుందని రాహుల్ తో చెబుతాడు రాజ్. ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చినట్లుగా గోల్డ్ బాబు వస్తాడు.

సీన్‌లోకి గోల్డ్ బాబు ఎంట్రీ

రాహుల్ కు అన్నయ్యను అంటూ గోల్డ్ బాబు వస్తాడు. ఎన్నో ఏళ్లుగా తాను దుబాయ్ లోనే ఉన్నానని, వేల కోట్లు సంపాదించానని చెబుతాడు. అతన్ని చూసిన కుయిలీ మనసు పారేసుకుంటుంది. దుబాయ్ లో తనకు గోల్డ్ బావులు ఉన్నాయని, ఇక్కడ తన కంపెనీని చూసుకోవడానికి మనుషుల కోసం వచ్చానని అనడంతో కుయిలీ, ఆమె భర్త తాము రెడీ అంటారు. కుయిలీని బుట్టలో వేసుకోవడానికి ఓ గోల్డ్ రింగ్ తీసి ఆమెకు గిఫ్ట్ గా ఇస్తాడు.

కుయిలీని లైన్‌లో పెట్టిన గోల్డ్ బాబు

దీంతో గోల్డ్ బాబుకు కుయిలీ పడిపోతుంది. ఇక్కడే ఉండండి.. మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అంటూ కుయిలీ అతన్ని కోరుతుంది. అటు రాహుల్ ను కూడా ఒప్పిస్తుంది. తర్వాత బెడ్ రూమ్ చూపిస్తానంటూ అతన్ని లోనికి తీసుకెళ్తుంది. అతడు కావాలనే తన వెంటనే తెచ్చి గోల్డ్ బిస్కెట్లను కుయిలీ చూసేలా చేస్తాడు. దీంతో కుయిలీ మొత్తంగా అతని బుట్టలో పడిపోతుంది. రాహుల్ ను వదిలి బావ గారు అంటూ గోల్డ్ బాబు చుట్టూ తిరుగుతుంది.

రుద్రాణికి ఫోన్ చేసిన రాహుల్.. కొత్త ప్లాన్

ఇటు రాజ్, కావ్య మొత్తం చెడగొట్టేలా ఉండటంతో రుద్రాణికి ఫోన్ చేస్తాడు రాహుల్. వీళ్లను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చెబుతాడు. తాను పిలిస్తే వాళ్లు రారు అని, ఏదైనా కొత్త ప్లాన్ వేయాల్సిందే అని రుద్రాణి అంటుంది. కంపెనీకి కోట్ల లాభం తెచ్చి పెట్టే ఓ ప్లాన్ ను రాజ్ రెడీ చేసి పెట్టాడని, దానిని కనిపించకుండా చేస్తే అతడే పరుగెత్తుకుంటూ వస్తాడని రుద్రాణి అంటుంది. ఆఫీసులో తమ వ్యక్తులతో ఆ పని చేయించమని రాహుల్ చెబుతాడు. సరే అని ఆమె ఫోన్ పెట్టేసి ఆఫీసులోని తమ వ్యక్తులకు ఫోన్ చేసి ఆ పని చేయమని చెబుతుంది.

గోల్డ్ బాబుతో రాజ్, కావ్య గేమ్

ఇటు గోల్డ్ బాబు దగ్గరికి వెళ్లిన రాజ్, కావ్య.. ఎలాగైనా ఆ కుయిలీ బండారం బయటపెట్టమని చెబుతారు. అది తన బుట్టలో పడిపోయిందని, మైదా బిస్కెట్లు చూసి గోల్డ్ బిస్కెట్లు అనుకుందని, గోల్డ్ బావులున్నాయంటే నమ్మిందని అతడు అంటాడు. ఎంతటి ఓవరాక్షన్ చేసైనా సరే రాహుల్ కు కుయిలీని దూరం చేయాలి రాజ్, కావ్య అతనికి చెబుతారు. అతడు సరే అంటాడు.

ఇటు ఆఫీసులో రుద్రాణి ప్లాన్ వర్కౌటై ఆ ఫైల్ కనిపించకుండా పోతుంది. దీంతో పీఏ కంగారు పడుతూ రాజ్, కావ్యలకు ఫోన్ చేసినా కలవదు. దీంతో సుభాష్ కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. మరో గంటలోనే మీటింగ్ ఉందని అనడంతో ఇంట్లో వాళ్లందరూ కంగారు పడతారు. కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.

అటు కుయిలీ మెల్లగా గోల్డ్ బాబు ట్రాప్ లో పడిపోయి అతనితో బెడ్ రూమ్ లో సెటిలవుతుంది. అది చూసిన రాహుల్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దీంతో కుయిలీ కేరాఫ్ కోట్లు కాదు కేరాఫ్ ఫుట్‌పాత్ అని రాజ్, కావ్య ఆమె నిజ స్వరూపాన్ని రాహుల్ ముందు బయటపెడతారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More