బ్రహ్మముడి నవంబర్ 3 ఎపిసోడ్: కుయిలికి రాజ్, కావ్య టార్చర్- మరో 10 లక్షల అప్పు- గోల్డ్ బాబుతో రాహుల్‌కు క్లారిటీ ప్లాన్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 3 ఎపిసోడ్‌లో హోటల్ నుంచి తెచ్చిన ఫుడ్ బాగోలేదని వంకలు పెడతారు రాజ్, కావ్య. దాంతో కుయిలినే వంట చేయడానికి ఒప్పుకుంటుంది. కుయిలికు చుక్కలు చూపిస్తూ టార్చర్ పెడతారు. వాళ్లది మోసం అని తెలిసి గోల్డ్ బాబుతో రాహుల్‌కు క్లారిటీ వచ్చేలా ప్లాన్ చేస్తాడు రాజ్.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కుయిలి ఇంట్లో భోజనానికి కావ్య, రాజ్ కూర్చొంటారు. వడ్డించడానికి పనివాళ్లు లేరా అని కావ్య అడిగితే.. కుయిలి, రంజిత్ షాక్ అవుతారు. ఇంటి సీక్రెట్స్ బయట వాళ్లకు చెబుతున్నారని, తీసేసామని రంజిత్ కవర్ చేస్తాడు. కుయిలినే కావ్య, రాజ్‌కి వడ్డిస్తుంది.

ఎలా ఉంటావురా
అది తిన్న కావ్య, రాజ్ ఊంచేసి అస్సలు బాగాలేదని, కాకా హోటల్ నుంచి తీసుకొచ్చారా అని, ఇలాంటి దానితో ఎలా ఉంటావురా అని డ్రామా చేస్తారు. వాళ్లకు భయపడి రాహుల్ కూడా అస్సలు వంట బాగోలేదని అంటాడు. దాంతో మీకోసం పెద్ద హోటల్ నుంచి తెప్పిస్తామని కుయిలి అంటాడు. ఇంకా పెద్ద హోటలా అని రంజిత్ భయపడతాడు.
అంటే లోపల అంత డొల్లేనా అని రాజ్ అంటాడు. ఫైవ్ స్టార్ హోటలేగా తెప్పించేద్దాం అని రంజిత్ అంటాడు. ఇలా రోజు హోటల్ ఫుడ్ నుంచి తెప్పించి మా మనవడిని ఏం చేద్దామనుకుంటున్నారు అని కావ్య అంటే.. రాహుల్‌ను చంపేద్దామనుకుంటున్నారు అని రాజ్ అంటాడు. కుయిలికి వంట రాదా అని కావ్య అంటుంది. దాంతో కుయిలి వంట నేర్చుకుంటానంటుంది.
బామ్మ వంట నేర్పిస్తుంది అని కుయిలి అంటుంది. తట్టుకుంటావా అని రాజ్ అడుగుతాడు. అన్ని పనులు నేర్చుకుని, వంట చేసి మిమ్మల్ని సాటిస్‌ఫై చేస్తాను అని కుయిలి అంటుంది. ఇక నీకుంటుంది మ్యూజిక్ అని రాజ్ అంటాడు. తర్వాత వద్దంటునే అంతా తినేసారు. ముసలోళ్లు కాదు ముదుర్లు అని కుయిలి అంటుంది.
అప్పులు పెరిగిపోయాయి
మన పని అయిపోయిందే. ఫుడ్ బిల్ 30 వేలు అయింది. మాములు హోటల్ నుంచి తెస్తేనే 30 వేలు అయింది. స్టార్ హోటల్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అప్పులు పెరిగిపోయాయని రంజిత్ అంటాడు. నాలుగు రోజులు భరిద్దాం. మహా అయితే 2 లక్షలు అవుతాయ్. ఆ తర్వాత కోట్ల ఆస్తి లాగేయొచ్చు. నాలుగు రోజుల తర్వాత అందరిని కట్టకట్టి భయటకు తోసేయొచ్చు అని కుయిలి అంటుంది.
ఆ మాటలను రాజ్, కావ్య వింటారు. చూశారా వాళ్లిద్దరి దొంగలే. ఎలాంటి ఆస్తి లేదని కావ్య అంటుంది. మనకు క్లారిటీ వచ్చిందిగా ఇక రాహుల్ గాడికి క్లారిటీ ఇవ్వాలి. కానీ, మనం వాడు చెబితే వినడు. వాడిని కుయిలి మైకం నుంచి బయటపడేయాలి. వీళ్లను ఇంకా టార్చర్ పెట్టాలి. గోల్డ్ బాబు ఉన్నాడు. దుబాయ్ రిటర్న్. వీళ్లకు వాడే కరెక్ట్ అని రాజ్ అంటాడు.
మరోవైపు రంజిత్ ఫీల్ అవుతుంటే నువ్వేం బాధపడకు. కావాలంటే ఇంకో పది లక్షలు అప్పు చేద్దాం. ఆస్తి రాబడదాం అని కుయిలి అంటుంది. ఇంతలో వచ్చిన కావ్య నువ్వు పెళ్లి చేసుకునేది మావాడినా ఈ దరిద్రుడినా అని కావ్య అంటుంది. మీ రాహుల్‌నే అని కుయిలి అంటుంది. మరి వీడితో రాసుకునిపూసుకుని తిరగడం ఏంటీ. వీడి వరుస మావయ్యలా కాదు మొగుడిలా ఉంది అని కావ్య అంటుంది.
కుయిలితో ఊడిపించిన కావ్య
దాంతో ఇద్దరు షాక్ అవుతారు. సరే వంట నేర్చుకున్నావుగా రా. ముందు ఇల్లు క్లీన్ చేసి తర్వాత వంట చేయాలి అని కావ్య చెబుతుంది. దాంతో చీర కట్టుకుని కుయిలి రాజ్, కావ్య ముందుకు వస్తుంది. తానెప్పుడు పని చేయలేదని చెబుతుంది కుయిలి. కొంగును నడుముకు చుట్టు, జుట్టు ముడేసుకో, చీపురు తెచ్చి ఊడు అని కావ్య అంటుంది. అలాగే చేస్తుంది కుయిలి.
కుయిలితో ఇల్లు ఊడిస్తుంది కావ్య. క్లీన్ చేసిన చోట కవర్స్, తొక్కలు వేస్తూ కుయిలిని మరింత టార్చర్ చేస్తారు కావ్య, రాజ్. క్లీన్ చేసి వచ్చానని కుయిలి చెబుతుంది. తొక్క ఇచ్చి చెత్త డబ్బలో వేయమంటారు. కుయిలి వేస్తుంది. తర్వాత ఇల్లంత నీటితో తుడుస్తుంది కుయిలి. ఇంతలో రాహుల్ నడిచి వస్తాడు. దాంతో రాహుల్‌ను తిడుతుంది. నువ్వు ఊడుస్తున్నావేంటీ అని రాహుల్ షాక్ అవుతాడు.
రాహుల్ వద్దంటే.. కుయిలి తిట్టి పంపించేస్తుంది. రాహుల్‌ను కుయిలితోనే తిట్టిస్తారు రాజ్, కావ్య. సరే ఇల్లు త్వరగా ఊడు వంట చేయాలి అని కావ్య అంటుంది. అసలే మా గోల్డ్ బాబు వస్తున్నాడని రాజ్ చెబుతాడు. అతనెవరు అని రంజిత్ అనగానే గోల్డ్ బాబు ఎంట్రీ ఇస్తాడు.
గోల్డ్ బాబు సరసాలు
కోట్లకు పడగలెత్తి వచ్చాను. మీ డ్రెస్, మీ స్టైల్ బాగా నచ్చిందని కుయిలిని గిల్లుతాడు. కుయిలి మురిసిపోతుంది. రాహుల్ ముందే కుయిలితో సరసాలు ఆడుతాడు గోల్డ్ బాబు. దాంతో రాహుల్ ఉడుక్కుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


