బ్రహ్మముడి అక్టోబర్ 30 ఎపిసోడ్: కొడుకును కొట్టిన రుద్రాణి- ఇల్లు వదిలి కుయిలి చెంతకు రాహుల్- తాత, బామ్మలుగా రాజ్ కావ్య
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో స్వప్నతో విడాకులు కావాలని రాహుల్ అంటాడు. ఆ విషయం ఇంట్లో అందరికి చెబుతుంది స్వప్న. దాంతో అంతా రాహుల్‌ను తిడతారు. రుద్రాణి చెంప దెబ్బ కొడుతుంది. రాహుల్ ఇల్లు వదిలేసి కుయిలి దగ్గరికి వెళ్లిపోతాడు. తాత, బామ్మలుగా గెటప్స్ వేసుకుని రాజ్, కావ్య రంగంలోకి దిగుతారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌కు స్వప్న వల్ల వచ్చిన సమస్య గురించి చెబుతుంది కావ్య. రాహుల్ ఎవరినో తగులుకున్నాడు. ఇప్పుడు పాప పుట్టడంతో ఏం చేయాలో అక్కకు తెలియట్లేదు. తనతోనే తిరుగుతాను, తనతోనే ఉంటాను. అక్క అలా ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండాలి అని కావ్య చెబుతుంది.

స్వప్నకు రాహుల్ విడాకులు
రాహుల్‌తో నేను మాట్లాడుతాను. నువ్వు ముందు టిఫిన్ తిను అని కావ్యను బుజ్జగిస్తాడు రాజ్. మరోవైపు స్వప్న బాధపడుతూ ఉంటే రాహుల్ వచ్చి సెటైర్లు వేస్తాడు. ఈ తప్పులన్నింటికి మన మధ్య తెర దించుదాం. నేను నీతో కలిసి ఉండలేను అని డివోర్స్ పేపర్స్ ఇస్తాడు రాహుల్. దానికి స్వప్న షాక్ అవుతుంది. ఈ విడాకుల పేపర్స్‌పై ఒక్క ఆటోగ్రాఫ్ చేస్తే మన మధ్య బంధం తెగిపోతుంది. అప్పుడు నేను నా కొయిలితో ఉండిపోతాను అని రాహుల్ అంటాడు.
నీ చెంప పగులగొడతాను. విడాకుల పేపర్స్‌పై సంతకం పెట్టను. నిన్ను బయటకు కూడా వెళ్లనివ్వను అని స్వప్న అంటుంది. నా మదిలో కుయిలి ఉంటే నువ్వేంటే నన్ను ఆపేది అని రాహుల్ అంటాడు. నేను నిన్నటి స్వప్నను అయితే సంతకం పెట్టేదాన్ని. కానీ మన మధ్యలో పాప ఉంది. తండ్రి లేకుండా నా కూతురు పెరగడం ఇష్టం లేదు అని రాహుల్ అంటాడు.
అదంతా నాకు సంబంధం లేదు. సంతకం పెట్టు అని బలవంతంగా స్వప్నతో రాహుల్ సంతకం చేయించాలని చూస్తాడు. రాహుల్‌ను తోసేస్తింది. ఈ విషయం వెంటనే ఇంట్లోవాళ్లకు చెబుతాను అని హాల్లోకి వెళ్లి రుద్రాణి ముందు డివోర్స్ పేపర్స్ పడేస్తుంది. ఇంకోదాన్ని పెళ్లి చేసుకుంటాడట. నన్ను విడాకులు ఇవ్వమని సంతకం పెట్టమంటున్నాడు అని జరిగింది అంతా చెబుతుంది స్వప్న.
రాహుల్ సెటైర్లు
రాహుల్ కిందకు వస్తే రాజ్ అడుగుతాడు. రాహుల్ సెటైర్లు వేస్తాడు. నా భార్య పోస్ట్ నుంచి రిటైర్ తీసుకోమంటున్నాను. మీ అక్క మీద ఇష్టం చచ్చిపోయింది. నా రిలేషన్‌కు పుల్‌స్టాఫ్ పెట్టాలనుకుంటున్నాను అని రాహుల్ అంటాడు. దాంతో సుభాష్, ప్రకాశం తిడతారు. ఇందిరాదేవి తిడుతుంది. స్వప్న అంటే ఇష్టంలేనప్పుడు ఎందుకు అంతలా తిరిగి మోసం చేసి బిడ్డను కన్నావ్ అని అపర్ణ నిలదీస్తుంది.
అప్పుడు నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. వదిలేస్తున్నాను. నాకు స్వప్న ఇష్టం లేదు. నాకు తల్లి వద్దు పిల్ల వద్దు. నాకు కావాల్సిన డివోర్స్ ఇస్తే నా బతుకు నేను బతుకుతాను అని రాహుల్ వెళ్లిపోతాడు. రుద్రాణిని నిలదీస్తారు ఇందిరాదేవి, అపర్ణ. వాడు ఈ పని చేస్తాడు అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలా చేస్తాడని తెలియదు అని రుద్రాణి అంటుంది.
నీ వల్ల, రాహుల్ వల్ల స్వప్నకు చిన్న అన్యాయం జరిగిన నేను చూస్తూ ఊరుకోను అని సుభాష్ అంటాడు. తెలుసు అన్నయ్య. నేను మాట్లాడుతాను అని రుద్రాణి పైకి వెళ్తుంది. రాహుల్ బ్యాగ్ సర్దుకుంటాడు. ఎక్కడికి అని రుద్రాణి అడిగితే.. నాకు కావాల్సిన కరెన్సీ దగ్గరికి, కాబోయే ఫియాన్సీ దగ్గరికి అని రాహుల్ అంటాడు. దాంతో రాహుల్‌ను చెంప దెబ్బ కొడుతుంది రుద్రాణి.
కుయిలికి వందల కోట్ల ఆస్తి
నా పరువు అంతా తీశావ్. చెప్పుతో తీసి కొడతాను. నాకు చెప్పి చేయకుండా ఇలా చేశావ్. నేను కష్టపడుతుంది నిన్ను ఇలా వెళ్లిపోయేందుకు కాదు. ఈ ఆస్తి నీ చేతుల్లో పెట్టాలని నేను చూస్తుంటే నువ్వేంట్రా వేరే దాన్ని తగులుకోవడం ఏంట్రా. ఈ ఆస్తి విలువ ఎంతో తెలుసా అని రుద్రాణి తిడుతుంది. నాకు ఓపిక లేదు. ఈ ఇంట్లో తిట్లే తిన్నాను. డబ్బు కట్టలు ఉన్న వాడలేకోపోున్నాను అని రాహుల్ అంటాడు.
కానీ, నా కుయిలి మహారాణి. వందల కోట్ల ఆస్తి ఉంది. అదంతా నాకే అవుతుంది. మనకు మించి ఆస్తి ఉంటుంది అని రాహుల్ చెబుతాడు. నువ్వు చెబితే నమ్మబుద్ధి కావట్లేదు. ఎవరో తెలియని వ్యక్తి కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటానంటే నేను సపోర్ట్ చేయలేను అని రుద్రాణి అంటుంది. నాకు సపోర్ట్ చేయకు. అందరి ముందు నన్ను తిడుతున్నట్లు చేయి. స్వప్నతో ఎలాగైనా సంతకం పెట్టిస్తా అని రాహుల్ అంటాడు.
కుయిలి కోట్ల డబ్బు సొంతం కాగానే నువ్వు ఆశ్చర్యపోయేలా నిన్ను తీసుకుపోతాను. అంతా కనక వర్షమే అని రాహుల్ అంటాడు. దాంతో రుద్రాణి సైలెంట్‌గా ఒప్పుకున్నట్లుగా ఉంటుంది. మరోవైపు రాహుల్ గురించి కావ్య, రాజ్ మాట్లాడుకుంటారు. సమస్య వెనుక ఉన్న లోతేంటో తెలుసుకోవాలి. రాహుల్ అంత ధైర్యంగా ఉన్నాడంటే అవతలి వ్యక్తి వాన్ని బాగా మాన్యుపులేట్ చేసి ఉంటుంది. ఎందుకుంటే వీడి గురించి ఏం తెలుసు అని ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని రాజ్ అంటాడు.
తాత, బామ్మగా రాజ్, కావ్య
రాహుల్ కూడా వాడిని మాయ చేసే మాటలు చెప్పుంటాడు. పెళ్లయి పాప ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి కావాలనుకుంటుంది. రాహుల్‌ను బుట్టలో వేసుకున్న దాని పుట్టు పూర్వత్తరాలు తెలియాలి. మనమే రంగంలోకి దిగాలి. నా ఎగ్జిట్ ప్లాన్‌కు మీరు సపోర్ట్ చేయాలి అని కావ్య అంటుంది. సరే ఆలోచించాలి అని రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కుయిలి దగ్గరికి అందరిని వదిలేసి వచ్చానని రాహుల్ చెబుతాడు.
నాకు ఎవరు లేరు. ఎవరు రారు అని రాహుల్ అంటుండగా.. రాజ్, కావ్య తాత, బామ్మ గెటప్స్ వేసుకుని ఎంట్రీ ఇస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


