మూడు రోజుల పాటు శక్తివంతమైన గజకేసరి రాజయోగం, ఐదు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, ఇల్లు, వాహనాలతో పాటు అనేకం!

అక్టోబర్ నెలలో ఆఖరి మూడు రోజులు కూడా గజకేసరి రాజయోగం ఉంటుంది. గురువు, చంద్రుల కలయిక వలన ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో, ఆరోగ్యంలో సమస్యలు తీరిపోతాయి.

Published on: Oct 28, 2025, 12:00:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని సార్లు శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కూడా జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తాయి. గజకేసరి రాజయోగం చాలా శక్తివంతమైనది. ఈ యోగం ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)
గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు (pinterest)

గజకేసరి రాజయోగం

ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. అక్టోబర్ నెలలో ఆఖరి మూడు రోజులు కూడా గజకేసరి రాజయోగం ఉంటుంది. గురువు, చంద్రుల కలయిక వలన ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

ముఖ్యంగా ఈ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో, ఆరోగ్యంలో సమస్యలు తీరిపోతాయి. శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మరి గజకేసరి రాజు యోగం ఎవరికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.

గజకేసరి రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు:

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి ఏడవ ఇంట్లో చంద్రుని దృష్టి పడుతుంది. అలాగే గురువు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీంతో ఈ యోగం ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు, విజయాలను అందుకుంటారు. శత్రువుల నుంచి కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది.

2.మేష రాశి:

మేష రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. గురువు, చంద్రుల దృష్టి ఈ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. దీంతో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తిపరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి.

3.కన్యా రాశి:

కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ ఆస్తుల విలువ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది.

4.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఇది శుభ సమయం. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ప్రమోషన్ కూడా రావచ్చు.

5.మకర రాశి:

ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. శత్రువుల బాధలు కూడా తగ్గుతాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాధులు, రుణ బాధల నుంచి కూడా బయటపడతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More