బ్రహ్మముడి అక్టోబర్ 27 ఎపిసోడ్: బిడ్డకు జన్మనిచ్చి చనిపోతున్న కావ్య- తాళితో ఉరేస్తానని రాహుల్‌కు స్వప్న వార్నింగ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్‌లో కావ్యకు ఇంటిల్లిపాది జాగ్రత్తలు చెబుతారు. రాజ్‌తో కావ్య సంతోషంగా మాట్లాడుతంటే డాక్టర్‌తో ఎందుకు అబద్ధం చెప్పించావని రాజ్ నిలదీస్తాడు. అబార్షన్ టైమ్ అయిపోవడంతో తాను బిడ్డకు జన్మనిచ్చి చనిపోతానని, అప్పటివరకు మీ జ్ఞాపకాలతో నిండిపోవాలని కావ్య చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బిడ్డకు జన్మనిస్తే కావ్యకు ఏం కాదు అని డాక్టర్ చెప్పడంతో ఇంట్లోవాళ్లంతా సంతోషంగా ఉంటారు. వచ్చే వారసుడి గురించి మాట్లాడుకుంటారు. కావ్య ఎలా ఉండాలో ఇంటిల్లిపాది జాగ్రత్తలు చెబుతారు. కావ్య విశ్రాంతి తీసుకుంటుందని రాజ్‌ను గదిలోకి తీసుకెళ్లమంటారు.

ఇంత ప్రేమ నేను చూపించలేనండి
దాంతో కావ్యను రాజ్ తీసుకెళ్తాడు. నాకోసం మన బిడ్డను కాదనుకునేంత ప్రేమ ఉందా. నాకోసం ఎంతో చేశారు. రోడ్డు మీద కూర్చొన్నారు. ఇంత ప్రేమ నేను కూడా మీకు చూపించలేనండి. ఏదైతేనే మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడిపోయాను. మీ గుండెల్లోని బారం దిగిపోయిందిగా. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లకు వారసుడు వస్తే మీ గురించి చెబుతాను. మీరు గొప్ప ఫైటర్ అని చెబుతాను అని కావ్య అంటుంది.
రాజ్ సీరియస్‌గా ఉంటే ఏంటండి ఇంకా అలా డల్‌గా ఉన్నారేంటండి అని అడుగుతుంది కావ్య. డాక్టర్‌తో అబద్ధం ఎందుకు చెప్పించావ్ కళావతి అని రాజ్ అడుగుతాడు. డాక్టర్ అలా చెప్పేసరికి నేనే చెప్పించానని అనుకుంటున్నారా. అయినా మీరు డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు నేను స్పృహలోనే లేను కదండి అని కావ్య అంటుంది.
మేము డాక్టర్‌తో మాట్లాడింది నీకు చెప్పలేదు కదా కళావతి. కానీ, నువ్వు డాక్టర్‌తో మాట్లాడింది నేను చూశాను అని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. స్పృహలోకి వచ్చిన కావ్య డాక్టర్‌తో మాట్లాడటం రాజ్ వినేది చూపిస్తారు. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ గర్భసంచిలో ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. నెలక్రితం నువ్వు ఒప్పుకుంటే అబార్షన్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు అని అంటుంది.
చిన్న అబద్ధం చెప్పాలి
దాంతో రాజ్ షాక్ అవుతాడు. చాలా మంచి మాట చెప్పారు. నన్ను కాపాడుకోడానికి నా భర్త చేసిన ప్రయత్నమంటూ లేదు. ఈరోజుకు నన్ను బతికించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేదని చెప్పారు. నా బిడ్డను కనడానికి అడ్డు చెప్పరు. కాకపోతే మా అత్తారింటి వాళ్లకు మీరు నాకు ఏం కాదని ఒక చిన్న అబద్ధం చెప్పాలి అని కావ్య అంటుంది.
ముందు డాక్టర్ ఒప్పుకోదు. కావ్య బతిమిలాడటంతో డాక్టర్ ఒప్పుకుంటుంది. అదంతా రాజ్ చెప్పడంతో కావ్య కంగారుపడుతుంది. నా బ్యాడ్‌లక్ అండి. బిడ్డ పుట్టేవరకు ఇంట్లోవాళ్లకు తెలియకూడదనుకున్నాను. మీకు తెలిసింది కానీ ఎవరికి చెప్పకండి అని కావ్య అంటుంది. నీది ఒక పిచ్చి నిర్ణయం అని రాజ్ అంటాడు. అబార్షన్ టైమ్ దాటిపోయింది కాబట్టి బిడ్డకు జన్మనివ్వడం తప్ప దారి లేదు. అది ఇంట్లోవాళ్లకు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని కావ్య అంటుంది.
మరి నీ గురించి ఏం ఆలోచించావ్ అని రాజ్ అంటాడు. నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ, నేను ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించాను. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. తెలిస్తే తాను చేయాల్సినవన్ని ప్లాన్ చేసుకుంటాడు. అదే ఎగ్జిట్ ప్లాన్. నేను నిజం చెబితే నేను బిడ్డకు జన్మనిచ్చేవరకు అంతా జాలిగా చూస్తారు. అదే అబద్ధం చెబితే అంతా సంతోషంగా ఉంటారు. నేను నిండు చూలాలిగా సీమంతం చేసుకుని చనిపోతాను అని కావ్య అంటుంది.
మీ జ్ఞాపకాలతో నిండిపోవాలి
మీరు మీ చేతుల్లో ఉన్న మీ కళావతి గురించే ఆలోచించండి. ఈ కరిగిపోయే జీవితం మీ జ్ఞాపకాలతో నిండిపోవాలి అని కావ్య అంటుంది. నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి. నేను ఎలా చిరునవ్వుతో ఉంటాను అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. రాజ్ ఓ చోట ఉంటే.. హో.. ఈయన అలిగినట్లున్నారు అని అన్నం తీసుకెళ్తుంది కావ్య. అలిగిన వేళనే చూడాలి అంటూ రాజ్‌ను బుజ్జగిస్తూ పాట పాడుతుంది కావ్య.
చక్కిలిగింతలు పెట్టి రాజ్‌ను నవ్విస్తుంది కావ్య. అలక తీరిందా అని రాజ్‌కు అన్నం తినిపిస్తుంది కావ్య. నీలో మ్యాజిక్ ఉంది కళావతి. అప్పుడే కోపం తెప్పిస్తావ్ అప్పుడే ప్రేమ కురిపిస్తావ్ అని రాజ్ అంటాడు. దటీజ్ కళావతి అని కావ్య అంటుంది. అందుకే నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు రాజ్. మరోవైపు బీరువాలో పెట్టిన నెక్లెస్ స్వప్నకు కనిపించదు.
మళ్లీ రాహులే తీసి ఉంటాడు అని అనుమానిస్తుంది. రాహుల్ వస్తే నిలదీస్తుంది. గొడవ పడుతుంది. తాను తీయలేదని. బీరువాలో పెట్టినట్లే తెలియదు. ఇలా ప్రతిదానికి మొగుడి మీద నిందలు వేస్తే నాకు ఎంత అవమానం అని రాహుల్ అంటాడు. ఏ ముష్టి మొహానికే ఇచ్చి ఉంటావ్ అని స్వప్న అంటుంది. నువ్వు అద్దంలో మొహం చూసుకోవడం మానేసి ఉంటావ్ అని పంచ్ ఇస్తాడు రాహుల్.
తాళితోనే ఉరేస్తాను
24 గంటల్లో నెక్లెస్ తీసుకురావాలి లేదంటే అని స్వప్న అంటే.. లేదంటే ఏం చేస్తావే అని రాహుల్ అంటాడు. నువ్వు కట్టిన తాళితోనే ఉరేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
అంత అవకాశం నీకెందుకు ఇస్తాను. ఉరి నాకు వేస్తావో నీకే వేసుకుంటావో తెలుస్తుంది. నీకు భయపడి నా ఊహలు వదులుకోలేనుగా. త్వరలోనే నీకు చరమగీతం నా కుయిలితో కొవెల గీతం. మా మమ్మీ ప్లాన్స్ వినక్కర్లేదు. చిల్లర కోసం అడుక్కోనవసరం లేదు. నీ దేబ్యమొహం చూడాల్సిన అవసరం లేదని రాహుల్ అనుకుంటాడు.
మరోవైపు కావ్య ఆసనాలు వేస్తుంటుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. రాజ్ అలాగే ఇమిటేట్ చేస్తాడు. రాజ్ తిడతాడు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని. తర్వాత కావ్య నడుము తిప్పుకుంటే వెళ్తే ఊడిపోద్దని ఇందిరాదేవి అంటుంది.
మీకు లేదు కాబట్టి తిప్పలేరు
నాకు ఉంది కాబట్టి తిప్పుతున్నా. మీకు లేదు కాబట్టి తిప్పలేరు అని అమ్మమ్మపై పంచ్ వేస్తుంది కావ్య. దానికి అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


