బ్రహ్మముడి అక్టోబర్ 24 ఎపిసోడ్: కావ్యను మోసం చేసిన ఇంట్లో వాళ్లు.. ఇందిరా దేవి ప్లాన్.. స్పృహలో లేనప్పుడు అబార్షన్..

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ లో కావ్యను ఇంట్లో వాళ్లందరూ కలిసి మోసం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆమె బతిమాలినా, బెదిరించినా, యుద్ధం ప్రకటించినా వెనక్కి తగ్గకపోవడంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకుంటారు.

Published on: Oct 24, 2025, 07:14:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 860వ ఎపిసోడ్ కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ చేసే యుద్ధం, అందరూ వద్దంటున్నా కావ్య మాత్రం అమ్మతనం కోసం మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది. చివరికి సీతారామయ్య చెప్పినా కూడా కావ్య వినకపోవడంతో ఇంట్లో వాళ్లు ఆమెను మోసం చేయడానికి కూడా సిద్ధమవుతారు.

బ్రహ్మముడి అక్టోబర్ 24 ఎపిసోడ్: కావ్యను మోసం చేసిన ఇంట్లో వాళ్లు.. ఇందిరా దేవి ప్లాన్.. స్పృహలో లేనప్పుడు అబార్షన్..
బ్రహ్మముడి అక్టోబర్ 24 ఎపిసోడ్: కావ్యను మోసం చేసిన ఇంట్లో వాళ్లు.. ఇందిరా దేవి ప్లాన్.. స్పృహలో లేనప్పుడు అబార్షన్..

అబార్షన్‌కు నో చెప్పిన కావ్య.. అమ్మతనం కోసం ఆరాటం

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ అత్తింట్లో కావ్య అసలు ఏమీ జరగనట్లుగా నటించే సీన్ తో మొదలవుతుంది. బిడ్డను కంటే తన ప్రాణం పోతుందన్న నిజం తెలిసినా ఆమె ఏమీ పట్టనట్లు అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు ఆమెను తిడతారు.

ఎందుకు నటిస్తున్నావని నిలదీస్తారు. కానీ కావ్య మాత్రం అమ్మతనం ఓ వరం.. బిడ్డ పుట్టక ముందే ఆ స్వరాన్ని చంపడం కరెక్ట్ కాదు.. నా ప్రాణం పోయినా నా బిడ్డను మాత్రం బతికించుకుంటానని స్పష్టంగా చెబుతుంది.

కావ్యకు రుద్రాణి సపోర్ట్.. తిట్టిన ఇంట్లో వాళ్లు

కావ్య మాటలు విన్న రుద్రాణి పరుగెత్తుకొని వచ్చి కావ్యను ప్రశంసిస్తుంది. నీ నిర్ణయం చాలా బాగుందని, అమ్మతనం కోసం నువ్వు పరితపిస్తున్న తీరుకు తాను సపోర్ట్ చేస్తున్నట్లు చెబుతుంది. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం రుద్రాణిని తిడతారు.

నీ నుంచి ఇలాంటి మాటలు రావడం ఏంటి.. ఇవాళ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ ఆమెను వెటకారంగా అడుగుతారు. కానీ కావ్య ఏం తప్పు చేసిందని అందరూ అలా నిలదీస్తున్నారని ఆమె తిరిగి ప్రశ్నిస్తుంది.

వెనక్కి తగ్గని కావ్య.. అందుకే నిజం చెప్పలేదన్న రాజ్

అందరూ ఎంత చెబుతున్నా కావ్య మాత్రం వెనక్కి తగ్గదు. తన ప్రాణం పోయినా సరే తన కడుపులో బిడ్డను కాపాడుకుంటానని ఆమె తెగేసి చెప్పి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న రాజ్ ఇంట్లో వాళ్ల దగ్గరకు వచ్చి ఇప్పుడు అందరికీ అర్థమైందా తాను ఎందుకు నిజం చెప్పలేదో అని అడుగుతాడు.

ఇన్నాళ్లూ అందరూ తనను నిందించారని, ఓ విలన్ లా చూశారని, కావ్యకు నిజం చెప్పలేదని అన్నారని, నిజం తెలిసినా కావ్య ఇలా చేస్తుందనే తాను చెప్పలేదని అంటాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు.. నా కావ్య నాకు నిండు నూరేళ్ల ఆయుష్షుతో కావాలని చెప్పి వెళ్లిపోతాడు.

నిర్ణయం మార్చుకోమని కావ్యను కోరిన సీతారామయ్య

అటు తాతయ్య సీతారామయ్య దగ్గరకు పాలు తీసుకొని వెళ్తుంది కావ్య. అయితే అతడు కూడా కావ్య నిర్ణయం మార్చుకోమని కోరతాడు. ఈ ఇంట్లోకి నువ్వు వచ్చిన తర్వాతే ఎవరు ఏంటో తెలిసిందని, వాళ్లందరినీ నువ్వు మార్చావని అంటాడు. ఈ ఇంటికి పూర్తిగా ఊపిరి పోసుకోని ఆ బిడ్డ కంటే నువ్వే ముఖ్యమని, నువ్వు సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అదే తమకు ఆనందమని అంటాడు. అయినా కావ్య మాత్రం తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండదు.

మళ్లీ లవర్ దగ్గరికి రాహుల్.. స్వప్నకు విడాకులిస్తానంటూ..

అటు రాహుల్ మరోసారి తన లవర్ దగ్గరికి వెళ్తాడు. ఆమెకు ఖరీదైన ఓ చెయిన్ గిఫ్ట్ గా ఇస్తాడు. నీకోసం ఎంతగా వేచి చూశానో తెలుసా అని ఆమె అంటుంది. నీ భార్యకు విడాకులు ఇచ్చి, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా.. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాతే నా దగ్గరకు రా అని తేల్చి చెబుతుంది. దీంతో మూడు రోజుల్లో స్వప్నకు విడాకులు ఇస్తానని చెప్పి వెళ్లిపోతాడు.

ఇంట్లో వాళ్ల నిరాహారదీక్ష.. కావ్యపై యుద్ధం

ఇటు ఎంత చెప్పినా కావ్య వెనక్కి తగ్గకపోవడంతో కావ్యపై ఇంట్లో వాళ్లు యుద్ధం ప్రకటిస్తారు. ఇక నుంచి టిఫిన్ కాదు కదా కావ్య చేత్తో పచ్చి మంచి నీళ్లు కూడా తాగొద్దని అపర్ణ చెప్పడంతో అందరూ సరే అంటారు. కావ్య అప్పుడే పూజ చేసి ప్రసాదం తెచ్చినా ఎవరూ తీసుకోరు. ఆమెకు తమ నిర్ణయం చెప్పేస్తారు.

దీంతో ఆమె షాక్ తింటుంది. అంతలోనే కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ఆమె స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయిస్తే అయిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఇదే విషయం డాక్టర్ కు చెబుతాడు రాజ్. అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే ఇది రేపటి ఎపిసోడ్ పై ఆసక్తి రేపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More