బ్రహ్మముడి అక్టోబర్ 22 ఎపిసోడ్: రాజ్ నిజం చెప్పిన నమ్మని కావ్య- కొత్త డ్రామా అంటూ నిందలు- రహస్యం బయటపెట్టిన అప్పు
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో అంతా సంతోషంగా క్రాకర్స్ కాలుస్తుంటారు. రుద్రాణి పెట్టిన క్రాకర్స్‌కు వచ్చే స్మోక్ వల్ల అప్పు కుప్పకూలిపోతుంది. రాజ్ కావాలనే చేశాడని అందరికి అనుమానం వచ్చేలా రుద్రాణి మాట్లాడుతుంది. దాంతో కావ్య నిలదీస్తుంది. రాజ్ నిజం చెబుతాడు. కానీ, కావ్య నమ్మదు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణి మార్చిన టపాకాయలను కల్యాణ్, అప్పు కాలుస్తారు. దాంతో రుద్రాణి, రాహుల్ తెగ టెన్షన్ పడుతుంటారు. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్యను ఇంటికి తీసుకొస్తా అన్నావ్. తను ఇంట్లో ఉంటే ఎలా సంతోషంగా ఉంచుతావ్ అని చెబుతుంది. దాంతో కావ్యను తీసుకురావడానికి రాజ్ వెళ్లిపోతాడు.

మా వంట తిని సంతోషిస్తే
క్రాకర్స్‌కు స్మోక్ రావడంతో అప్పు దగ్గుతుంది. మరోవైపు కావ్య వంట చేస్తుంటుంది. రాజ్ వెళ్లి అంతా బయట పండుగ జరుపుకుంటే ఇక్కడ ఇదేంటో అని అంటాడు. కొంతమంది ఆడవాళ్లకు ఇలా పనులు చేస్తే సంతోషంగా ఉంటుంది. మేము చేసి వంట తిని సంతోషిస్తే అదే చాలనిపిస్తుందని అంటుంది కావ్య. నాతో వచ్చి సరదాగా క్రాకర్స్ కాలిస్తే సంతోషంగా ఉంటుందిగా అని రాజ్ అంటాడు.
రాజ్, కావ్య ఇద్దరు గొడవ పడతారు. మీరు నన్ను ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పించడానికేగా వచ్చారు. నిజం చెప్పండి ఏం ప్లాన్ చేశారు. అంత కాన్పిడెంట్‌గా తీసుకెళ్తా అని ఎలా చెప్పారు అని కావ్య అంటుంది. నేనేం ప్లాన్ చేయలేదే అని రాజ్ అంటాడు. నేను మీతోపాటు వస్తాను. కానీ, ఒక కండిషన్. మీరు బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారో కారణం చెప్పండి. గుడ్డిగా మీతో ఎలా రాను అని కావ్య అడుగుతుంది.
మరోవైపు క్రాకర్స్ పొగ ఎక్కువైపోయేసరికి అప్పు స్పృహ తప్పి కుప్పకూలిపోతుంది. అక్కడికి రాజ్, కావ్య వస్తారు. కట్ చేస్తే డాక్టర్ వచ్చి అప్పును చూస్తుంది. తప్పు చేశాను అమ్మమ్మ ఆ క్రాకర్స్ దగ్గరికి తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. ఆ స్మోక్ పడలేదు అని కల్యాణ్ అంటాడు. ఎందుకు తీసుకొచ్చావురా. దూరంగా ఉంచాల్సింది కదా అని ధాన్యం అంటే ఏం కాదులే పిన్ని అని రాజ్ అంటాడు.
రాజ్ తీసుకొచ్చిన క్రాకర్స్ వల్లే
ఇప్పుడు మనం చేసిన పనివల్ల అప్పు కడుపు పోతుంది. దానికి కారణం రాజ్ తీసుకొచ్చిన క్రాకర్స్ వల్లే అని నిరూపిస్తే కావ్య తప్పుబడుతుంది. ఇప్పుడు డాక్టర్ వచ్చి అప్పు కడుపు పోయిందని చెబితే చాలు తగలబెట్టేస్తా. అందులో రాజ్, కావ్యను బూడిద చేస్తా అని రుద్రాణి అంటుంది. డాక్టర్ వచ్చి ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. మీరు వాడిన క్రాకర్స్‌లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో తెలుసా. ఆ స్మోక్ పీల్చడం వల్లే తనకు ఇలా అయింది అని డాక్టర్ అంటుంది.
ఇంకొంచెం సేపు అదే స్మోక్ పీల్చుంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోయేవి. ఇలాంటివి కాలిస్తే అందరికి ప్రమాదమే. ఇప్పుడు ప్రమాదం లేదు. కాస్తా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇకనైన జాగ్రత్తగా ఉంటే చాలు అని డాక్టర్ వెళ్లిపోతుంది. ఏంటీ రాజ్ ఇంత పని చేశావ్. నువ్వేగా ఆ క్రాకర్స్ తీసుకొచ్చావ్. ఇంత డేంజర్ క్రాకర్స్ తీసుకొచ్చావ్. అక్కడ కావ్య లేకపోయేసరికి సరిపోయింది. లేకుంటే అక్కడ కావ్య కూడా ఉండేదిగా అని రుద్రాణి చిచ్చు పెడుతుంది.
రాజ్ నువ్ ఇదంతా కావాలని చేశావుగా అని ధాన్యలక్ష్మీ అంటుంది. పిన్ని నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా. నేనెందుకు అలా చేస్తాను అని రాజ్ అంటాడు. ఎందుకంటే కావ్య కడుపు పోడానికి అని ధాన్యలక్మీ అంటుంది. రాజ్ చెప్పబోతుంటే చాలు ఆపు ఇంకా ఎందుకురా నటిస్తున్నావ్. ఇదంతా నువ్వే చేశావని ఇక్కడనున్న వారందరికి అర్థమైంది. ఎందుకురా రోజు రోజుకు దిగజారిపోతున్నావ్ అని అపర్ణ తిడుతుంది.
మృగం కంటే దారుణంగా
ఇదేనా మీ ప్లాన్ అని కావ్య అంటుంది. నువ్వు కూడా నమ్ముతున్నావా అని రాజ్ అంటే.. కళ్లముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను. ఇంట్లో మీరు చేసింది అంతా ఇదేగా. విడాకులు, దీక్ష అంటూ ఇదంతా ప్లాన్ చేశారు. ఇందాక వంటింట్లో నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూశారు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలా. అడవిలో మృగం కూడా కళ్లముందు కనిపిస్తేనే వేటాడుతుంది. ఇలా వెతుక్కుంటు వచ్చి మరి చంపదు. మీరు అంతకంటే దారుణంగా తయారయ్యారు అని కావ్య నిందిస్తుంది.
నేను, నా బిడ్డ చేసిన తప్పేంటీ. ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఈరోజు మీరు నిజం చెప్పేవరకు వదిలిపెట్టను అని గద్దిస్తుంది కావ్య. రాజ్ సైలెంట్‌గా ఉంటే రాజ్ కాలర్ పట్టుకుని ఎందుకు నా బిడ్డను చంపాలనుకుంటున్నారు. చెప్పండి.. చెప్పండి అని అరుస్తూనే ఉంటుంది కావ్య. దాంతో ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు చస్తావు కాబట్టి అని రాజ్ నిజం చెప్పి కుండబద్ధలు కొట్టేస్తాడు.
దానికి అంతా షాక్ అవుతారు. రుద్రాణి నోరెళ్లబెడుతుంది. ఏంటీ నేను చచ్చిపోతానా. అబ్బబ్బా మీది మాములు తెలివి కాదండి. ఇది కొత్త డ్రామానా. ఎందుకండి ఇలా దిగజారిపోతున్నారు. ఆఖరికి నేను చచ్చిపోతాను అనే మాట ఎలా వచ్చిందండి అని కావ్య అంటుంది. బావ చెప్పేది నిజం అక్క అని అప్పు వచ్చి చెబుతుంది. రాజ్ ఆపుతుంటే అప్పు వద్దంటుంది.
మొహం చాటేసిన కళావతి
ఒక్కసారి పెదవి దాటిన రహస్యం ఆగదు అని అప్పు నిజం చెబుతుంది. ఏంటా రహస్యం అని కావ్య అడిగితే.. నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావనే రహస్యం అని అప్పు అంటుంది. అంతా షాక్ అవుతారు. దాంతో కల్యాణ్ జరిగింది చెబుతాడు. నీకు నిజం చెబితే నువ్వు బిడ్డనే కావాలంటావని నీకోసం ఇదంతా చేశాడని కల్యాణ్, అప్పు చెబుతారు.
దాంతో కావ్య బాధతో మొహం చాటేస్తుంది. రూమ్‌లోకి వెళ్లి కడుపు పట్టుకుని ఏడుస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


