ఓటీటీలోకి మరో 5 రోజుల్లో వచ్చేస్తున్న పవన్ కల్యాణ్ ఓజీ- ఐదు భాషల్లో స్ట్రీమింగ్- అధికారిక ప్రకటన- ఇక్కడ చూసేయండి!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓజీ ఓటీటీలోకి వచ్చేయనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్లిల్లర్ సినిమా దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేసింది. రన్ రాజా రన్, సాహో చిత్రాల యువ దర్శకుడు సుజీత్ ఓజీ సినిమాను తెరకెక్కించారు.

ప్రతినాయకుడిగా ఇమ్రాన్ పరిచయం
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్‌తోపాటు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.
పవన్ అభిమానులకు ఫుల్ ట్రీట్
ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమా పవన్ కల్యాణ్ అభిమానులకు అమితమైన ట్రీట్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను వింటేజ్ లుక్‌లో చూశామని తెగ సంబరపడిపోయారు ఆయన ఫ్యాన్స్. కలెక్షన్స్ పరంగా కూడా ఓజీ బాగా ఆకట్టుకుంది.
మరో 5 రోజుల్లో ఓటీటీకి
అలాంటి ఓజీ ఓటీటీలోకి వచ్చేయనుంది. మరో ఐదు రోజుల్లో ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను ఇవాళ (అక్టోబర్ 18) ప్రకటించారు. అక్టోబర్ 23 నుంచి ఓజీ ఓటీటీ ప్రీమియర్ కానుంది. దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 23న దే కాల్ హిమ్ ఓజీ ఓటీటీ రిలీజ్ కానుంది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
అది కూడా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ఓజీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లోల బీభత్సం సృష్టించిన ఓజీ ఓటీటీలో కూడా రచ్చ చేయనుంది. మరి ఓటీటీలో ఓజీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
నెల కాకుండానే ఓటీటీలోకి
అయితే, సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ నెల కాకుండానే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఓజీ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలను దాటిందని చిత్ర బృందం ప్రకటించింది.
బ్లాక్ బస్టర్ హిట్ మూవీని దాటి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్లను ఓజీ అధిగమించిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
ఆ రెండు సినిమాలు బ్రేక్
సంక్రాంతికి వస్తున్నాం రూ. 255.2 కోట్లతో తెలుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతోపాటు హనుమాన్ (రూ. 295 కోట్లు) కలెక్షన్స్‌ను కూడా పవన్ కల్యాణ్ ఓజీ సినిమా బీట్ చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


